మొబైల్ మార్కెట్‌లో పోటీ అంటేనే ఒక యుద్ధంలా మారిపోయింది. ముఖ్యంగా మిడ్-రేంజ్ విభాగంలో ఇప్పుడు మూడు ఫోన్లు హాట్ టాపిక్‌గా మారాయి. అవే ఒప్పో F33 ప్రో 5G, వన్‌ప్లస్ నార్డ్ 6, నథింగ్ ఫోన్ 4a ప్రో సుమారు 40 వేల రూపాయల బడ్జెట్‌లో ఉన్న ఈ మూడు ఫోన్లలో ఏది కొంటే లాభం? వాటి స్పెసిఫికేషన్లు ఏంటి? అనేది చూద్దాం.
ధరలు ఇలా ఉన్నాయి..
మొదట ధరల విషయానికి వస్తే, ఒప్పో F33 ప్రో ప్రారంభ ధర రూ. 37,999గా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 6 కొంచెం ఎక్కువగా రూ. 38,999 నుండి మొదలవుతుంది. ఇక నథింగ్ ఫోన్ 4a ప్రో రూ. 39,999 వద్ద అందుబాటులో ఉంది. అంటే ధరల పరంగా చూస్తే ఒప్పో ఫోన్ మిగతా రెండింటి కంటే కొంచెం తక్కువకే వస్తోంది.
డిస్‌ప్లే డిజైన్
చూడగానే ఆకట్టుకునే డిజైన్ నథింగ్ ఫోన్ సొంతం. ఇందులో 6.83 ఇంచుల అమోలెడ్ స్క్రీన్ ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 6 విషయానికి వస్తే, ఇందులో 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 ఇంచుల స్క్రీన్ ఉంది. గేమింగ్ ఆడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఒప్పో F33 ప్రో 6.57 ఇంచుల స్క్రీన్‌తో వస్తోంది, ఇది పట్టుకోవడానికి కాస్త తేలికగా ఉంటుంది.
బ్యాటరీ పవర్
బ్యాటరీ పరంగా వన్‌ప్లస్ నార్డ్ 6 అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. సాధారణంగా ఫోన్లలో 5,000mAh బ్యాటరీ ఉంటుంది, కానీ వన్‌ప్లస్ ఇంత పెద్ద బ్యాటరీ ఇవ్వడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఒప్పోలో 7,000mAh బ్యాటరీ ఉండగా, నథింగ్‌లో 5,400mAh మాత్రమే ఉంది. అయితే మూడు ఫోన్లలోనూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.
కెమెరా పనితీరు
సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే వారికి ఒప్పో F33 ప్రో ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అదే నథింగ్ ఫోన్ విషయానికి వస్తే, వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి నథింగ్ ఫోన్ మంచి అనుభూతిని ఇస్తుంది.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్
ఈ మూడు ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 తో పనిచేస్తాయి. వన్‌ప్లస్ కంపెనీ తమ ఫోన్‌కు 4 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ 6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేసింది. మీకు పెద్ద బ్యాటరీ కావాలంటే వన్‌ప్లస్ నార్డ్ 6 బెస్ట్ అని చెప్పుకోవాలి. స్టైలిష్ డిజైన్ మంచి కెమెరా సెటప్ కావాలంటే నథింగ్ ఫోన్ 4a ప్రో ఎంచుకోండి. తక్కువ బడ్జెట్‌లో మంచి సెల్ఫీ కెమెరా, తేలికపాటి ఫోన్ కావాలంటే ఒప్పో F33 ప్రో ఉత్తమం.