LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gadgets

Oppo F33 Pro 5G: ఒప్పో, వన్‌ప్లస్, నథింగ్.. బడ్జెట్‌లో టాప్ ఫోన్ ఏది? పూర్తి వివరాలు మీకోసం!

Oppo F33 Pro 5G: ఒప్పో F33 ప్రో 5G, వన్‌ప్లస్ నార్డ్ 6 నథింగ్ ఫోన్ 4a ప్రో మధ్య అసలైన పోటీ మొదలైంది. 9000mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే పవర్‌ఫుల్ కెమెరా ఫీచర్లతో వస్తున్న ఈ మూడు ఫోన్లలో ఏది వాల్యూ ఫర్ మనీ? ధరలు, స్పెసిఫికేషన్ల పూర్తి సమాచారం

AndhraPravasi News Desk 2 min read
Oppo F33 Pro 5G: ఒప్పో, వన్‌ప్లస్, నథింగ్.. బడ్జెట్‌లో టాప్ ఫోన్ ఏది? పూర్తి వివరాలు మీకోసం!

మొబైల్ మార్కెట్‌లో పోటీ అంటేనే ఒక యుద్ధంలా మారిపోయింది. ముఖ్యంగా మిడ్-రేంజ్ విభాగంలో ఇప్పుడు మూడు ఫోన్లు హాట్ టాపిక్‌గా మారాయి. అవే ఒప్పో F33 ప్రో 5G, వన్‌ప్లస్ నార్డ్ 6, నథింగ్ ఫోన్ 4a ప్రో సుమారు 40 వేల రూపాయల బడ్జెట్‌లో ఉన్న ఈ మూడు ఫోన్లలో ఏది కొంటే లాభం? వాటి స్పెసిఫికేషన్లు ఏంటి? అనేది  చూద్దాం.

ధరలు ఇలా ఉన్నాయి..

మొదట ధరల విషయానికి వస్తే, ఒప్పో F33 ప్రో ప్రారంభ ధర రూ. 37,999గా ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 6  కొంచెం ఎక్కువగా రూ. 38,999 నుండి మొదలవుతుంది. ఇక నథింగ్ ఫోన్ 4a ప్రో రూ. 39,999 వద్ద అందుబాటులో ఉంది. అంటే ధరల పరంగా చూస్తే ఒప్పో ఫోన్ మిగతా రెండింటి కంటే కొంచెం తక్కువకే వస్తోంది.

డిస్‌ప్లే  డిజైన్

చూడగానే ఆకట్టుకునే డిజైన్ నథింగ్ ఫోన్ సొంతం. ఇందులో 6.83 ఇంచుల అమోలెడ్ స్క్రీన్ ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ 6 విషయానికి వస్తే, ఇందులో 165Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.78 ఇంచుల స్క్రీన్ ఉంది. గేమింగ్ ఆడేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఒప్పో F33 ప్రో 6.57 ఇంచుల స్క్రీన్‌తో వస్తోంది, ఇది పట్టుకోవడానికి కాస్త తేలికగా ఉంటుంది.

 బ్యాటరీ  పవర్

బ్యాటరీ పరంగా వన్‌ప్లస్ నార్డ్ 6 అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందులో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. సాధారణంగా ఫోన్లలో 5,000mAh బ్యాటరీ ఉంటుంది, కానీ వన్‌ప్లస్ ఇంత పెద్ద బ్యాటరీ ఇవ్వడం ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఒప్పోలో 7,000mAh బ్యాటరీ ఉండగా, నథింగ్‌లో 5,400mAh మాత్రమే ఉంది. అయితే మూడు ఫోన్లలోనూ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉంది.

 కెమెరా పనితీరు

సెల్ఫీలు ఎక్కువగా తీసుకునే వారికి ఒప్పో F33 ప్రో ది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఇందులో ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అదే నథింగ్ ఫోన్ విషయానికి వస్తే, వెనుక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉన్నవారికి నథింగ్ ఫోన్ మంచి అనుభూతిని ఇస్తుంది.

సాఫ్ట్‌వేర్  అప్‌డేట్స్

ఈ మూడు ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 తో పనిచేస్తాయి. వన్‌ప్లస్ కంపెనీ తమ ఫోన్‌కు 4 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్  6 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని ప్రామిస్ చేసింది. మీకు పెద్ద బ్యాటరీ కావాలంటే వన్‌ప్లస్ నార్డ్ 6   బెస్ట్ అని చెప్పుకోవాలి. స్టైలిష్ డిజైన్  మంచి కెమెరా సెటప్ కావాలంటే నథింగ్ ఫోన్ 4a ప్రో ఎంచుకోండి.  తక్కువ బడ్జెట్‌లో మంచి సెల్ఫీ కెమెరా, తేలికపాటి ఫోన్ కావాలంటే ఒప్పో F33 ప్రో ఉత్తమం.

Be the first to react

More Coverage

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కొనుగోలు…

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇస్తూ డెల్ సంస్థ తన ప్రీమియం ‘ఎక్స్‌ప…