Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Galaxy ZFold 8: బిగ్ స్క్రీన్.. బిగ్గర్ బ్యాటరీ... 'గెలాక్సీ Z ఫోల్డ్ వైడ్' మోడల్‌తో సరికొత్త ఎంట్రీ! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! Motorola: భారత్‌లో సరికొత్త 'రేజర్ ఫోల్డ్' మొబైల్ లాంచ్! అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా! Android17: ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు గూగుల్ చెక్... జెమిని ఏఐతో ఆండ్రాయిడ్ 17 బీటా విడుదల! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం!

OnePlus 16: వన్‌ప్లస్ 16 వచ్చేస్తోంది..200MP కెమెరాతో అదిరిపోయే అప్‌డేట్స్!

OnePlus 16: వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి. 200MP శామ్‌సంగ్ పెరిస్కోప్ కెమెరా, భారీ 9,000mAh బ్యాటరీ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రాబోతోంది..

Published : 2026-04-07 10:50:00

OnePlus 16: వన్‌ప్లస్ ప్రియులకు అదిరిపోయే వార్త. మార్కెట్లో ఇప్పటికే వన్‌ప్లస్ 15 హవా నడుస్తుండగా, కంపెనీ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్‌ప్లస్ 16 (OnePlus 16) పై కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కొత్త ఫోన్ కెమెరా విభాగంలో విప్లవాత్మక మార్పులతో రాబోతోంది. ముఖ్యంగా ఫొటోగ్రఫీ అంటే పిచ్చి ఉన్నవారికి ఈ ఫోన్ ఒక వరంలా మారనుంది. గత మోడళ్లతో పోలిస్తే ఇందులో డిజైన్  పర్ఫార్మెన్స్ పరంగా భారీ మార్పులు ఉండబోతున్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ దీని 200 మెగాపిక్సెల్ శామ్‌సంగ్ పెరిస్కోప్ కెమెరా. సాధారణంగా మనం చూసే ఫోన్ల కంటే ఇది చాలా స్పష్టమైన జూమ్ ఫొటోలను అందిస్తుంది. గతంలో వన్‌ప్లస్ 15లో కేవలం 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 200 ఎంపీ సెన్సార్‌ను వాడుతుండటం విశేషం. దీనివల్ల చాలా దూరం ఉన్న వస్తువులను కూడా క్లారిటీ తగ్గకుండా షూట్ చేయవచ్చు. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లలో వాడిన సెన్సార్‌నే ఇందులో కూడా ఉపయోగించే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి.

డిజైన్ విషయానికి వస్తే, వన్‌ప్లస్ 16 స్క్రీన్ చాలా అందంగా ఉండబోతోంది. ఫోన్ ముందు భాగంలో ఉండే నల్లటి అంచులు (Bezels) ఈసారి చాలా సన్నగా, అంటే 1 మిల్లీమీటర్ కంటే తక్కువ మందంతో ఉంటాయట. దీనివల్ల ఫోన్ చూడ్డానికి చాలా ప్రీమియం లుక్‌తో కనిపిస్తుంది. అయితే, గతంలో ప్రచారం జరిగినట్లుగా ఇందులో గేమింగ్ కోసం ప్రత్యేకంగా కూలింగ్ ఫ్యాన్ గానీ, ఫిజికల్ బటన్లు గానీ ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. కేవలం స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ కే కంపెనీ ప్రాధాన్యత ఇస్తోంది.

సామర్థ్యం పరంగా కూడా వన్‌ప్లస్ తగ్గేదేలే అంటోంది. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 చిప్‌సెట్‌ను వాడే అవకాశం ఉంది. దీనివల్ల ఫోన్ ఎంత వాడినా హ్యాంగ్ అవ్వకుండా, చాలా వేగంగా పనిచేస్తుంది. ఇక బ్యాటరీ విషయంలో అయితే వన్‌ప్లస్ రికార్డు సృష్టించబోతోంది. ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని ఇందులో అమర్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు మూడు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చన్నమాట.

ప్రస్తుతానికి ఈ వివరాలన్నీ లీకుల ద్వారా తెలిసినవే. 

చైనాలో ఈ ఏడాది చివరలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ధర విషయానికి వస్తే, పాత మోడల్ కంటే కొంచెం ఎక్కువే ఉండే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా, అదిరిపోయే కెమెరా, సన్నని అంచులు, మరియూ భారీ బ్యాటరీతో వస్తున్న వన్‌ప్లస్ 16 కోసం టెక్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మన దేశంలో ఈ ఫోన్ ఎప్పుడు వస్తుందనే దానిపై కంపెనీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

Spotlight

Read More →