Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు! Smartphone Deals: శాంసంగ్ ప్రియులకు బంపర్ ఆఫర్.. అమెజాన్ సేల్‌లో సంచలనం.. చరిత్రలోనే అత్యల్ప ధర! ఐఫోన్ ప్రియులకు పండగే.. ఫ్లిప్‌కార్ట్ 'సాసా లేలే' సేల్ షురూ! ఐఫోన్ 17 సిరీస్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే డీల్స్! Vivo T5 Pro: రోజంతా వచ్చే భారీ బ్యాటరీ... స్లిమ్ డిజైన్! ధర మరియు ఫీచర్ల పూర్తి వివరాలు! One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం! Vivo Smartphones: వీవో స్మార్ట్‌ఫోన్ ప్రియులకు షాక్... భారీగా పెరిగిన మొబైల్ ఫోన్ల ధరలు!

Motorola Edge 70 Pro: త్వరలో మార్కెట్లోకి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో.. ఫీచర్లు మామూలుగా లేవుగా!

Motorola Edge 70 Pro: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి రాబోతోంది. 6,500mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ 50MP సెల్ఫీ కెమెరా వంటి కీలక ఫీచర్లతో రానున్న ఈ ఫోన్ ధర, లాంచ్ వివరాలు..

Published : 2026-04-14 12:34:00

Motorola Edge 70 Pro: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు మోటరోలా అదిరిపోయే శుభవార్త చెప్పింది. గత ఏడాది మార్కెట్లో సంచలనం సృష్టించిన 'ఎడ్జ్ 60 ప్రో'కు కొనసాగింపుగా, ఇప్పుడు మోటరోలా ఎడ్జ్ 70 ప్రో (Motorola Edge 70 Pro) విడుదలకు రంగం సిద్ధమైంది. తాజాగా ఈ ఫోన్ యూఏఈకి చెందిన టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో కనిపించింది. దీని మోడల్ నంబర్ XT2607-1 అని తేలిపోయింది. ఈ లిస్టింగ్ బయటకు రావడంతో, గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారత్‌లో కూడా ఈ ఫోన్ అతి త్వరలోనే లాంచ్ కానుందని స్పష్టమవుతోంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్ గురించి టీజర్‌ను కూడా  విడుదల చేసిన విషయం అందరికీ తెలిసినదే.

డిజైన్ విషయానికి వస్తే, మోటరోలా ఎడ్జ్ 70 ప్రో చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది. లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ బ్లూ, గ్రీన్  వైట్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. అలాగే ముందు వైపు పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్ ఇస్తున్నారు. పాత మోడల్‌తో పోలిస్తే దీని డిజైన్ మరింత ప్రీమియం లుక్‌తో రాబోతోందని తెలుస్తోంది. కర్వ్డ్ డిస్‌ప్లే ఉండటం వల్ల ఫోన్ పట్టుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

ఈ ఫోన్ కేవలం అందంగా ఉండటమే కాదు, పనితీరులో కూడా దుమ్ము రేపనుంది. ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్‌ ను వాడుతున్నట్లు సమాచారం. గేమ్స్ ఆడేవారికి, మల్టీ టాస్కింగ్ చేసేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ కానుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే, ఏకంగా 6,500mAh భారీ బ్యాటరీ ని ఇందులో అమర్చుతున్నారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హాయిగా వాడుకోవచ్చు, ఛార్జింగ్ అయిపోయినా నిమిషాల్లో మళ్ళీ ఫుల్ చేసుకోవచ్చు.

కెమెరాల విషయానికి వస్తే మోటో ఎప్పుడూ వెనక్కి తగ్గదు. ఎడ్జ్ 70 ప్రోలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా తో పాటు, మరో రెండు పవర్‌ఫుల్ లెన్స్‌లు ఉండనున్నాయి. సెల్ఫీల కోసం కూడా ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ కెమెరాను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఫోటోలు చాలా క్లారిటీగా, రియలిస్టిక్‌గా వచ్చేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా నైట్ ఫోటోగ్రఫీలో ఈ ఫోన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని కంపెనీ వర్గాల టాక్.

ధర విషయానికి వస్తే, మోటరోలా ఎడ్జ్ 70 ప్రో సుమారు రూ. 30,000 నుండి రూ. 35,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది. గత ఏడాది వచ్చిన ఎడ్జ్ 60 ప్రో రూ. 29,999 కి లాంచ్ అయ్యింది. దానికంటే మెరుగైన ఫీచర్లు ఇస్తున్నారు కాబట్టి ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఏది ఏమైనా, తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ఒక సరైన ఎంపిక అని చెప్పవచ్చు. మరికొద్ది రోజుల్లోనే దీని అధికారిక లాంచ్ తేదీ గురించి కంపెనీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

Spotlight

Read More →