LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Gadgets

Motorola Edge 70 Fusion:బడ్జెట్ ధరలో 'పవర్'ఫుల్ స్మార్ట్‌ఫోన్..మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్.. ఫీచర్లు అదిరిపోయాయిగా!

భారత మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ విడుదల! 7000mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరా 18 నెలల పాటు ఉచిత గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌తో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్లు ఫీచర్లు తెలుసుకోండి.

AndhraPravasi News Desk 2 min read
Motorola Edge 70 Fusion:బడ్జెట్ ధరలో 'పవర్'ఫుల్ స్మార్ట్‌ఫోన్..మార్కెట్లోకి మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్.. ఫీచర్లు అదిరిపోయాయిగా!

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరోలా భారత మార్కెట్లోకి మరో సంచలన ఫోన్‌ను తీసుకువచ్చింది. మిడ్-రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే యూజర్ల కోసం 'మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్' (Motorola Edge 70 Fusion) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ కేవలం స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, బ్యాటరీ  డిస్‌ప్లే పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.

ఈ స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేతో వస్తోంది. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల గేమింగ్  వీడియోలు చూసేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. ఫోన్ కింద పడినా త్వరగా పగలకుండా 'గొరిల్లా గ్లాస్ 7i' రక్షణ కల్పించారు. అంతేకాకుండా, ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందింది, అంటే ఫోన్ చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ప్రధాన ఆకర్షణ దీని 7000mAh భారీ బ్యాటరీ. సాధారణంగా ఇంత పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్ బరువుగా ఉంటుంది, కానీ మోటోరోలా దీనిని కేవలం 193 గ్రాముల బరువుతో, చాలా స్లిమ్‌గా డిజైన్ చేయడం విశేషం. దీనికి 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, దీనివల్ల అతి తక్కువ సమయంలోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో 50MP సోనీ LYTIA 710 మెయిన్ కెమెరాను అమర్చారు. దీనికి OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉండటం వల్ల ఫోటోలు, వీడియోలు షేక్ అవ్వకుండా చాలా క్లారిటీగా వస్తాయి. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో పనిచేస్తుంది.

ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది

 8GB + 128GB: రూ. 26,999

 8GB + 256GB: రూ. 29,999

 12GB + 256GB: రూ. 32,999

లాంచ్ ఆఫర్ కింద: బ్యాంకు కార్డులపై రూ. 2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల బేస్ వేరియంట్ కేవలం రూ. 24,999 కే సొంతం చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఫోన్ కొన్నవారికి సుమారు రూ. 35,000 విలువైన 'గూగుల్ జెమినీ ప్రో' (Google Gemini Pro) ప్లాన్ 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు మార్చి 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభం కానున్నాయి.

Be the first to react

More Coverage

iPhone Updates: ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. యాపిల్ వ్యూహంలో మార్పు.. అప్పటిదాకా ఆగాల్సిందే.. అసలు కారణాలు ఇవే!

iPhone Updates: ఐఫోన్ ప్రియులకు బిగ్ షాక్.. యాపిల్ వ్యూహంలో మార్పు.. అప్పటిదాకా ఆగాల్సిందే.. అసలు కారణాలు ఇవే!

iPhone Updates: టెక్ దిగ్గజం యాపిల్, తన ఐఫోన్ విడుదల వ్యూహంలో దశాబ్ద కాలంలోనే అతిపెద్ద మార్పుకు సిద్…

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కొనుగోలు…

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇస్తూ డెల్ సంస్థ తన ప్రీమియం ‘ఎక్స్‌ప…