Google Pixel 11: మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ 11, ప్రో ఫోన్లు.. సరికొత్త ఏఐ ఫీచర్లు, అధునాతన భద్రతా ఫీచర్లు ప్రధాన ఆకర్షణ.!

టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ మోడళ్లను అధికారికంగా ఆవిష్కరించింది. సరికొత్త టెన్సర్ జీ6 ప్రాసెసర్, అత్యాధునిక జెమిని ఏఐ సామర్థ్యాలు, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ ఫోన్లు వినియోగదారుల ముందుకు రానున్నాయి.

భారత్‌లో రూ. 89,999 నుంచి ప్రారంభం కానున్న ధరలు..
భారత్‌లో రూ. 89,999 నుంచి ప్రారంభం కానున్న ధరలు..
  • Gadgets: పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో ఎక్స్ఎల్ పేరుతో మూడు మోడళ్లు..

  • భారత్‌లో రూ. 89,999 నుంచి ప్రారంభం కానున్న ధరలు..

Google Pixel 11: టెక్ దిగ్గజం గూగుల్ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. 'మేడ్ బై గూగుల్' ఈవెంట్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ మోడళ్లను అధికారికంగా ఆవిష్కరించింది. సరికొత్త టెన్సర్ జీ6 ప్రాసెసర్, అత్యాధునిక జెమిని ఏఐ సామర్థ్యాలు, మెరుగైన భద్రతా ఫీచర్లతో ఈ ఫోన్లు వినియోగదారుల ముందుకు రానున్నాయి.

భారత్‌లో పిక్సెల్ 11 (12GB+256GB) బేస్ వేరియంట్ ప్రారంభ ధరను రూ. 89,999గా నిర్ణయించారు. అలాగే పిక్సెల్ 11 ప్రో ధర రూ. 1,19,999 నుంచి, పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ధర రూ. 1,34,999 నుంచి ప్రారంభం కానుంది. గత సిరీస్‌తో పోలిస్తే ఈసారి ధరలు సుమారు రూ. 10,000 వరకు పెరిగాయి. గూగుల్ స్టోర్‌తో పాటు ఇతర రిటైల్ భాగస్వాముల వద్ద ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభమవగా, ఆగస్టు 20 నుంచి ఈ ఫోన్లు విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి.

ఈ మూడు మోడళ్లలోనూ గూగుల్ తన సొంత టెన్సర్ జీ6 చిప్‌సెట్‌ను టైటాన్ ఎం3 సెక్యూరిటీ కో-ప్రాసెసర్‌తో జత చేసింది. ఆండ్రాయిడ్ 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్లకు ఏడు సంవత్సరాల పాటు ఓఎస్, సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తామని గూగుల్ ప్రకటించింది.

డిస్‌ప్లే, కెమెరా ఫీచర్ల విషయంలో మోడళ్ల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.
పిక్సెల్ 11: ఇందులో 48MP వైడ్, 13MP అల్ట్రావైడ్, 10.8MP 5x టెలిఫోటో లెన్స్‌లతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీని ద్వారా 30x వరకు సూపర్ జూమ్ చేయవచ్చు. వీడియో రికార్డింగ్ 4Kకు పరిమితం. ముందువైపు 10.5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

పిక్సెల్ 11 ప్రో / ప్రో ఎక్స్ఎల్: ఈ రెండు ప్రో మోడళ్లలోనూ ఒకే రకమైన, మరింత శక్తివంతమైన కెమెరా వ్యవస్థను అందించారు. ఇందులో 50MP వైడ్ లెన్స్, 48MP అల్ట్రావైడ్ (మాక్రో ఫీచర్‌తో), 48MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. వీటి ద్వారా 120x వరకు 'ప్రో జూమ్' సాధ్యమవుతుంది. 8K వీడియో రికార్డింగ్ సదుపాయం కూడా ఉంది. సెల్ఫీల కోసం 42MP ఫ్రంట్ కెమెరాను ఇవ్వడం విశేషం.

ఇక స్టాండర్డ్ పిక్సెల్ 11 మోడల్‌లో 48 ఎంపీ వైడ్, 13 ఎంపీ అల్ట్రావైడ్, 10.8 ఎంపీ టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. ప్రో మోడళ్లలో 3,600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కూడిన 'సూపర్ యాక్చువా' ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఉపయోగించారు. ఫోన్‌ను బోర్లా పెట్టినప్పుడు నోటిఫికేషన్ల కోసం కెమెరా మాడ్యూల్ చుట్టూ 'హైలైట్' అనే సరికొత్త ఎల్ఈడీ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఈ ఫోన్లలో ఆన్-డివైజ్ జెమిని నానో మోడల్‌తో పాటు, జెమిని లైవ్ వంటి అత్యాధునిక ఏఐ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Tags

Be the first to react

Latest