ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన సేల్ Flipkart Buy Buy Sale నుంచి ఈరోజు భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి 7.1.2 Dolby Atmos సౌండ్ బార్ ను ఈరోజు భారీ డిస్కౌంట్ తో కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకోవచ్చు.
ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్స్ పై ఒక లుక్కేద్దామా. ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ Aavante Prime 7.1.4 7050DA ఈరోజు ఈ డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బై బై 2025 సేల్ అందించిన 81% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 16,999 ధరలో సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ ను ICICI క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ కేవలం రూ. 15,499 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ అతి తక్కువ ధరలో లభిస్తున్న ఏకైక 7.1.2 డాల్బీ అట్మాస్ సౌండ్ బార్ డీల్ గా నిలిచేలా చేసింది. ఈ సౌండ్ బార్ 7.1.2 ఛానల్ సెటప్ తో వస్తుంది.
ఇది కంప్లీట్ సరౌండ్ సౌండ్ అందించే ప్రీమియం బార్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఇక సెటప్ విషయానికి వస్తే, ఇందులో పైన రెండు, సైడ్ లో రెండు స్పీకర్లు మరియు ముందు ఆరు స్పీకర్లు కలిగిన బార్, డ్యూయల్ శాటిలైట్ స్పీకర్ మరియు హెవీ బాస్ సౌండ్ అందించే సబ్ ఉఫర్ కూడా కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ కంప్లీట్ సౌండ్ సెటప్ తో టోటల్ 700W హెవీ సౌండ్ అందిస్తుంది. అంతేకాదు, సినిమా థియేటర్ వంటి సౌండ్ అందించే డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
ఇందులో ఆప్టికల్, HDMI eArc, USB, AUX, కోఆక్సియల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ సౌండ్ బార్ మీకు రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది.