LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Gadgets

One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం!

One Plus Phone: సాధారణంగా మన దగ్గర డబ్బు ఉంటే ఏ వస్తువునైనా కొనేయగలమనే ధీమా ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో, చేతిలో లక్ష రూపాయలు ఉన్నా సరే, "మీరు ఈ ఫోన్ కొనడానికి అర్హులు కారు" అని ఒక కంపెనీ చెప్పేదంటే నమ్ముతారా? అవును, అదే వన్ ప్లస్ (OnePlus).

AndhraPravasi News Desk 3 min read
One Plus Phone: డబ్బున్నా కొనలేని ఫోన్.. వన్ ప్లస్ 'ఇన్వైట్ సిస్టం' సృష్టించిన మార్కెటింగ్ సంచలనం!
  • ఒప్పోలో చిన్న స్టార్టప్ నుండి గ్లోబల్ జైంట్స్ కు సవాల్ వరకు: వన్ ప్లస్ సక్సెస్ స్టోరీ..
     
  • Gadgets: ఆక్సిజన్ ఓఎస్ vs కలర్ ఓఎస్: ఫ్యాన్స్‌ను నిరాశపరిచిన సాఫ్ట్‌వేర్ మార్పులు..

One Plus Phone: సాధారణంగా మన దగ్గర డబ్బు ఉంటే ఏ వస్తువునైనా కొనేయగలమనే ధీమా ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో, చేతిలో లక్ష రూపాయలు ఉన్నా సరే, "మీరు ఈ ఫోన్ కొనడానికి అర్హులు కారు" అని ఒక కంపెనీ చెప్పేదంటే నమ్ముతారా? అవును, అదే వన్ ప్లస్ (OnePlus). కేవలం 10 మందితో ఒక చిన్న స్టార్టప్‌గా మొదలై, ఈరోజు యాపిల్, శామ్‌సంగ్ వంటి దిగ్గజ కంపెనీలకే సవాల్ విసురుతున్న ఈ బ్రాండ్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.

ఇద్దరు మిత్రులు - ఒకే కల..
వన్ ప్లస్ ప్రయాణం 2013లో ప్రారంభమైంది. దీని వెనుక పీట్లా (Pete Lau) మరియు కాల్పి (Carl Pei) అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. పీట్లా అప్పట్లో ఒప్పో (OPPO) కంపెనీలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉండేవారు. ఒకరోజు స్నేహితులతో కాఫీ తాగుతున్నప్పుడు, అందరి చేతుల్లో ఐఫోన్లు ఉండటం, ఒక్కరి దగ్గర కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడాన్ని ఆయన గమనించారు. ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రీమియంగా లేవనే విమర్శ వినిపించడంతో, ఐఫోన్ అంత క్వాలిటీ ఉన్న ఫోన్‌ను సగం ధరకే ఎందుకు ఇవ్వకూడదు అనే ఆలోచన ఆయనకు వచ్చింది. వెంటనే తన టాప్ పొజిషన్‌కు రాజీనామా చేసి, కాల్పితో కలిసి వన్ ప్లస్ స్థాపించారు.

డబ్బున్నా కొనలేని ఫోన్: ఇన్వైట్ సిస్టం మ్యాజిక్..
వన్ ప్లస్ ప్రారంభంలో మార్కెటింగ్ కోసం వేల కోట్లు ఖర్చు చేసే స్థితిలో లేదు. అందుకే వారు 'ఇన్వైట్ ఓన్లీ' (Invite-only) అనే వింతైన ప్లాన్ వేశారు. అంటే మీ దగ్గర డబ్బు ఉన్నా, ఫోన్ కొనాలంటే ఆల్రెడీ ఆ ఫోన్ వాడుతున్న వారు మీకు ఇన్విటేషన్ పంపాలి. ఇది ప్రజల్లో ఒక రకమైన 'ఫోమో' (FOMO - Fear of Missing Out) క్రియేట్ చేసింది. రూపాయి ఖర్చు లేకుండా ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ వచ్చేలా చేసింది. దీనితో పాటు 'నెవర్ సెటిల్' (Never Settle) అనే స్లోగన్ ప్రజల నరనరాల్లోకి ఎక్కేసింది.

ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఆవిర్భావం..
2014లో వన్ ప్లస్ తమ మొదటి ఫోన్ 'OnePlus One' ను విడుదల చేసింది. అప్పట్లో ఇతర కంపెనీల టాప్ ఫోన్లు 50-60 వేల రూపాయలు ఉంటే, వన్ ప్లస్ కేవలం 20 వేల రూపాయలకే (299 డాలర్లు) హై-ఎండ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, అదిరిపోయే కెమెరా మరియు క్లీన్ సాఫ్ట్‌వేర్‌ను అందించింది. అందుకే దీనికి 'ఫ్లాగ్‌షిప్ కిల్లర్' అనే పేరు వచ్చింది. సాఫ్ట్‌వేర్ పరంగా గీక్స్‌కు ఇష్టమైన 'సైనోజన్ మోడ్' (CyanogenMod) తో వీరు టై అప్ అయ్యారు.

వివాదాలు మరియు వైఫల్యాలు..
ఏ ప్రయాణమైనా సాఫీగా సాగదు కదా! వన్ ప్లస్ కూడా కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. పబ్లిసిటీ కోసం 'స్మాష్ ద పాస్ట్' (Smash the Past) అనే కాంటెస్ట్ పెట్టి, కొత్త ఫోన్ కోసం పాత ఫోన్‌ను పగలగొట్టాలని కోరి విమర్శలు ఎదుర్కొంది. అలాగే 'లేడీస్ ఫస్ట్' అనే పేరుతో మహిళల ఫోటోలు పోస్ట్ చేయమనడం కూడా సెక్సిస్ట్‌గా ఉందని గొడవలు జరిగాయి. 2015లో వచ్చిన వన్ ప్లస్ 2 ఫోన్ హీటింగ్ ఇష్యూస్ మరియు NFC లేకపోవడంతో ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.

భారతదేశంలో ఒక కల్ట్ బ్రాండ్..
ఇండియాలో వన్ ప్లస్ ఎంట్రీ ఒక సునామీలా సాగింది. అమెజాన్‌తో టై అప్ అయ్యి, కేవలం ఆన్‌లైన్‌లోనే అమ్మడం ద్వారా ఖర్చులు తగ్గించుకున్నారు. వన్ ప్లస్ 3 మరియు 3T ఫోన్లు ఇండియాలో ఈ బ్రాండ్‌ను ఒక కల్ట్ బ్రాండ్‌గా మార్చేశాయి. 2018 నాటికి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శామ్‌సంగ్‌ను దాటేసి వన్ ప్లస్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లను అంబాసిడర్లుగా పెట్టుకుని తన ఇమేజ్‌ను మరింత పెంచుకుంది.

ఒప్పోతో విలీనం - ఒక కొత్త మలుపు..
కాలక్రమేణా వన్ ప్లస్ తన మూలాలను మర్చిపోతోందనే విమర్శలు మొదలయ్యాయి. 2020లో కాల్పి కంపెనీ నుండి బయటకు వెళ్లి 'నథింగ్' (Nothing) బ్రాండ్ స్థాపించారు. ఆ తర్వాత వన్ ప్లస్ పూర్తిగా ఒప్పోలో విలీనమైంది. ఫ్యాన్స్‌కు ఎంతో ఇష్టమైన ఆక్సిజన్ ఓఎస్ (OxygenOS) స్థానంలో ఒప్పో వారి కలర్ ఓఎస్ (ColorOS) తీసుకురావడం చాలా మందికి నచ్చలేదు. ఇప్పుడు వన్ ప్లస్ కేవలం ఒప్పో ఫోన్లకు స్టిక్కర్ వేసి అమ్ముతోందని, ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఇమేజ్ వదిలేసి లక్ష రూపాయల ఫోన్లు అమ్ముతోందని విమర్శలు వస్తున్నాయి.

ప్రస్తుతం వన్ ప్లస్ కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా టీవీలు, ఇయర్ బడ్స్, వాచ్‌లు మరియు టాబ్లెట్లు కూడా తయారు చేస్తోంది. 'వన్ ప్లస్ ఓపెన్' తో ఫోల్డబుల్ ఫోన్ల మార్కెట్‌లో కూడా తన సత్తా చాటుతోంది. అయితే ఇప్పుడు మార్కెట్‌లో నథింగ్ మరియు పిక్సెల్ వంటి బ్రాండ్ల నుండి గట్టి పోటీ ఎదురవుతోంది.

ఒక చిన్న ఆఫీసులో మొదలై, ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన కమ్యూనిటీని సంపాదించుకున్న వన్ ప్లస్ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. 'నెవర్ సెటిల్' అనేది కేవలం ఒక స్లోగన్ మాత్రమే కాదు, అది ఒక కంపెనీ ఆత్మ అని వన్ ప్లస్ నిరూపించింది. మరి పాత వన్ ప్లస్ బాగుందా లేక ఇప్పుడున్న వన్ ప్లస్ బాగుందా అనేది యూజర్ల అభిప్రాయంపైనే ఆధారపడి ఉంటుంది.

Be the first to react

More Coverage

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఐఫోన్ ప్రియులకు శుభవార్త.. ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్! ఇప్పుడే కొనాలా? ఐఫోన్ 18 కోసం ఆగాలా?

iPhone Offers: ఆపిల్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 17 ప్రొ మ్యాక్స్ కొనుగోలు…

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లతో సరికొత్త డెల్ ల్యాప్‌టాప్... 17 గంటల బ్యాటరీ లైఫ్ తో... లగ్జరీ లుక్ ల్యాప్‌టాప్ సొంతం!

Dell XPS 13: యాపిల్ మ్యాక్‌బుక్ నియో ల్యాప్‌టాప్‌కు గట్టి పోటీ ఇస్తూ డెల్ సంస్థ తన ప్రీమియం ‘ఎక్స్‌ప…