⚡ BREAKING

Dark Chocolate: క్యాలరీల భయం లేదు.. బరువు పెరిగే ఛాన్స్ లేదు.. కేవలం వాసనతోనే ఆకలికి బ్రేక్! డార్క్ చాక్లెట్ క్రేజీ నిజాలు!

Dark Chocolate: చాక్లెట్‌ తినకపోయినా.. దాని వాసన చూడడం వల్ల వ్యాయామంలో మెరుగైన ఫలితాలు రావొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్‌ వాసన చూస్తే ఎక్కువసేపు వ్యాయామం చేయగలిగారని, అదే సమయంలో ఆకలి కూడా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

కేవలం వాసనతోనే ఆకలికి బ్రేక్! డార్క్ చాక్లెట్ క్రేజీ నిజాలు!
కేవలం వాసనతోనే ఆకలికి బ్రేక్! డార్క్ చాక్లెట్ క్రేజీ నిజాలు!
  • ఇంకా లోతైన పరిశోధనలు అవసరమన్న నిపుణులు..

  • డార్క్‌ చాక్లెట్‌తో వ్యాయామ పనితీరు మెరుగుదల..

Dark Chocolate: ఫిట్‌నెస్‌ ప్రియులకు మరియు బరువు తగ్గాలనుకునే వారికి సైంటిస్టులు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. బరువు పెరుగుతామనే భయంతో చాలామంది చాక్లెట్లకు దూరంగా ఉంటారు. అయితే, ఇప్పుడు చాక్లెట్‌ను తినకపోయినా.. కేవలం దాని వాసన (Aroma) చూడడం ద్వారానే వ్యాయామంలో విప్లవాత్మకమైన మార్పులు సాధించవచ్చని తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ (Dark Chocolate) వాసన చూడడం వల్ల అలసట తెలియకుండా ఎక్కువ సమయం వర్కౌట్స్ చేయడమే కాకుండా, ఆకలిని కూడా నియంత్రించుకోవచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ ఆసక్తికరమైన పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ సైన్స్ జర్నల్ ‘ఫ్రాంటియర్స్ ఇన్ ఫిజియాలజీ’ (Frontiers in Physiology) లో ప్రచురితమయ్యాయి.

శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం ఏమిటి?
ఈ హ్యూమన్ స్టడీ కోసం పరిశోధకులు 23 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులైన యువకులను ఎంపిక చేశారు. ప్రయోగంలో ఖచ్చితత్వం కోసం ప్రతి టెస్టింగ్‌కు ముందు వారిని కనీసం 10 గంటల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా (Fasting) ఉంచారు. ఆ తర్వాత వారిని మూడు గ్రూపులుగా విభజించి ఈ క్రింది నమూనాలను కేవలం 30 సెకన్ల పాటు వాసన చూపించారు:

  1. 90 శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్

  2. 60 శాతం కోకో ఉన్న మిల్క్ చాక్లెట్

  3. ఎలాంటి వాసన లేని సాధారణ నీరు

ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే వారందరితో కాళ్ల కండరాలకు సంబంధించిన అత్యంత కఠినమైన ‘లెగ్ ఎక్స్‌టెన్షన్’ (Leg Extension Workout) వ్యాయామాన్ని పూర్తిగా అలసిపోయే వరకు చేయించారు. ప్రతి సెట్‌కు ముందు వారికి మళ్లీ అదే వాసనను చూపిస్తూ.. వారి ఆకలి తీవ్రత, క్రేవింగ్స్ (తినాలనే కోరిక), కడుపు నిండిన భావన (Satiety) వంటి పారామీటర్లను నిరంతరం నమోదు చేశారు.

డార్క్ చాక్లెట్ వాసనతో అద్భుత ఫలితాలు!
ఈ రీసెర్చ్‌లో వెల్లడైన ఫలితాలు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచాయి. ఎలాంటి వాసన చూడని గ్రూపుతో పోలిస్తే, కేవలం డార్క్ చాక్లెట్ వాసన చూసిన యువకులు సగటున 18 లెగ్ ఎక్స్‌టెన్షన్లు ఎక్కువగా చేయగలిగారు. సాధారణంగా వర్కౌట్ చేసేటప్పుడు వచ్చే కండరాల నొప్పులు, శ్రమ వీరికి చాలా తక్కువగా అనిపించినట్లు కంటెస్టెంట్లు స్వయంగా వెల్లడించారు. డార్క్ చాక్లెట్ సువాసన మెదడుపై చూపిన ప్రభావం వల్ల ఆకలి, జంక్ ఫుడ్ తినాలనే కోరికలు గణనీయంగా తగ్గాయి. అదే సమయంలో కడుపు నిండుగా ఉన్న భావన పెరిగింది.

మరోవైపు, మిల్క్ చాక్లెట్ వాసన చాలామందికి ఆహ్లాదకరంగా అనిపించినప్పటికీ.. ఆకలిని తగ్గించడంలో లేదా ఓర్పును (Stamina) పెంచడంలో డార్క్ చాక్లెట్ చూపించినంత ప్రభావం చూపలేకపోయింది.

మెదడుకు, వాసనకు ఉన్న కనెక్షన్ ఇదే!
ఈ మ్యాజిక్ ఎలా సాధ్యమైందనే అంశంపై శాస్త్రవేత్తలు క్లారిటీ ఇచ్చారు. మన ముక్కు పీల్చుకునే వాసనలకు, మెదడులో ఆకలి మరియు భావోద్వేగాలను నియంత్రించే నాడీ వ్యవస్థలకు (Nervous System) నేరుగా సంబంధం ఉంటుంది. డార్క్ చాక్లెట్ లోని ఘాటైన సువాసన మెదడుకు చేరినప్పుడు అది కడుపు నిండినట్లుగా భ్రమ కలిగించే సిగ్నల్స్ పంపుతుంది. అయితే, ఈ ప్రయోగంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు మరియు అంతర్గత మెదడు పనితీరును పూర్తిగా స్కానింగ్ చేయనందున.. ఈ ఫలితాలను అందరికీ ఒకేలా వర్తింపజేయడానికి ముందు మరిన్ని లోతైన పరిశోధనలు (Deep Clinical Trials) అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. ఏదేమైనా, జిమ్‌కు వెళ్లేవారు తమ బ్యాగులో ఒక డార్క్ చాక్లెట్ ముక్కను ఉంచుకుని, వర్కౌట్ కి ముందు దాన్ని వాసన చూడడం వల్ల మెరుగైన ఎనర్జీ సాధించవచ్చని ఈ స్టడీ నిరూపిస్తోంది.

Tags

Be the first to react

Latest