Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.!

2025-12-29 10:02:00
గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ!

టాటా–ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్‌ రైల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై అధికారులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా సంఘటనాస్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు. మృతుడు 71 సంవత్సరాల వృద్ధుడని, వయోభారం కారణంగా సకాలంలో బోగీ నుంచి బయటకు రాలేకపోయారని ఎస్పీ తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని చెప్పారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులకు వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించామని, అనంతరం ప్రత్యేకంగా మరో రైలును ఏర్పాటు చేసి వారిని ఎర్నాకుళం వైపు పంపించామని వెల్లడించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (FSL) నివేదిక వచ్చిన తర్వాతే అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు వెల్లడవుతాయని తెలిపారు.

Vijay Latest News: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కిందపడ్డ విజయ్…!!

ప్రాథమిక సమాచారం ప్రకారం B1 కోచ్‌లోని ఎలక్ట్రికల్ ప్యానల్ నుంచి మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో B1, M2 కోచ్‌లు తీవ్రంగా దగ్ధమయ్యాయి. బోగీల్లో భారీగా పొగలు కమ్మేయడంతో రెస్క్యూ ఆపరేషన్‌ తీవ్రంగా ఆటంకం ఎదుర్కొంది. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ బృందాలు కోచ్‌ల అద్దాలను పగలగొట్టి ప్రయాణికులను క్షేమంగా బయటికి తీసుకొచ్చారు. ప్రయాణికులు అందరూ గాఢ నిద్రలో ఉండగా మంటలు చెలరేగడం తీవ్ర భయాందోళనలకు కారణమైంది. కోచ్‌లో పోలీ మెటీరియల్‌, దుప్పట్లు ఉండటంతో క్షణాల్లోనే మంటలు విస్తరించినట్లు అధికారులు తెలిపారు.

AP Cabinet: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం... కీలక అంశాలు!

ఈ ఘటనలో టీటీఈ, లోకో పైలట్ అప్రమత్తతతో పెద్ద ప్రాణనష్టం తప్పిందని అధికారులు స్పష్టం చేశారు. అనకాపల్లి దాటిన తర్వాత రైలు ఎలమంచిలి స్టేషన్‌కు చేరువవుతున్న సమయంలో రైల్ బ్రేక్ జామ్ కావడంతో లోకో పైలట్ అప్రమత్తమయ్యారు. వెనక్కి పరిశీలించగా ఓ కోచ్ నుంచి మంటలు వస్తున్నట్లు గుర్తించి వెంటనే రైలును నిలిపివేశారు. ప్రయాణికులను తక్షణమే అప్రమత్తం చేయడంతో వారు బోగీల నుంచి బయటికి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. లోకో పైలట్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్లే భారీ ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు కొనియాడారు.

ATM Scam: తస్మాత్ జాగ్రత్త! ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తే రావడం లేదా... ఇదొక కొత్త రకం స్కాం!

ఆదివారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాంట్రీ కారుకు ఆనుకుని ఉన్న B1 కోచ్‌లో మొదట మంటలు చెలరేగగా, కొద్దిసేపటికే అవి M2 కోచ్‌కు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునేలోపే రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అయితే అప్పటికే ప్రయాణికులు ప్రాణాలు కాపాడుకుని రైలు నుంచి దిగిపోయారు. రైలు ప్రమాదంతో ఎలమంచిలి స్టేషన్ మొత్తం పొగలతో నిండిపోయి భయానక వాతావరణం నెలకొంది. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు రెండు వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లోనే గంటల తరబడి పడిగాపులు కాశారు.

Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం!
Ukraine War Updates: ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన... ఆ అంశంపై ఉక్రెయిన్ గట్టి వైఖరి!!
Mann Ki Baat: ప్రపంచానికి స్పష్టమైన హెచ్చరిక… దేశ భద్రతపై రాజీ లేదు, యువతే భారత శక్తి – మన్ కీ బాత్‌లో మోదీ ఫైర్!!
Praja Vedika: నేడు (29/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Train Accident: ఏపీలో ఘోర రైలు ప్రమాదం! రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం!
ENari: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ–నారీలుగా ఛాన్స్! అర్హతలు ఇవే!

Spotlight

Read More →