లండన్‌లో మెరిసిన తెలుగు ప్రతిభ.. పార్లమెంటులో తెలుగు ఫొటోగ్రాఫర్‌కు అరుదైన గౌరవం!
Telugu Photographer Honoured at UK Parliament: తెలుగు కమ్యూనిటీకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ వై. జ్వాలా నరసింహ గౌడ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. బ్రిటన్ పార్లమెంటు వేదికగా ఆయనను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. ఫొటోగ్రఫీ రంగంలో ఆయన అందించిన సేవలు, ప్రతిభను గుర్తిస్తూ ‘బెస్ట్ ఫొటోగ్రాఫర్ ఇన్ తమిళ్ కమ్యూనిటీ-2026’ పురస్కారాన్ని అందజేశారు. తెలుగు వ్యక్తికి తమిళ కమ్యూనిటీ తరఫున ఈ స్థాయిలో గుర్తింపు రావడం విశేషంగా నిలిచింది.\
బ్రిటన్ పార్లమెంటులో తెలుగు ఫొటోగ్రాఫర్‌కు అరుదైన గౌరవం.. నరసింహ గౌడ్‌కు అంతర్జాతీయ అవార్డు!
లండన్: తెలుగు కమ్యూనిటీకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ వై. జ్వాలా నరసింహ గౌడ్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. బ్రిటన్ పార్లమెంటు వేదికగా ఆయనను ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించారు. ఫొటోగ్రఫీ రంగంలో ఆయన అందించిన సేవలు, ప్రతిభను గుర్తిస్తూ ‘బెస్ట్ ఫొటోగ్రాఫర్ ఇన్ తమిళ్ కమ్యూనిటీ-2026’ పురస్కారాన్ని అందజేశారు. తెలుగు వ్యక్తికి తమిళ కమ్యూనిటీ తరఫున ఈ స్థాయిలో గుర్తింపు రావడం విశేషంగా నిలిచింది.
లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ బ్రిటన్ పార్లమెంటులో ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ తమిళ్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో ‘ఎక్సలెన్స్ అవార్డ్స్-2026’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు అందజేశారు. ఇందులో భాగంగా ఫొటోగ్రఫీ రంగంలో విశేష సేవలు అందిస్తున్న వై. జ్వాలా నరసింహ గౌడ్‌ను సంస్థ ప్రత్యేకంగా గుర్తించి సత్కరించింది.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని బ్రిటన్ డిప్యూటీ మేయర్ జాన్ గ్రే, బ్రిటన్ ప్రభుత్వ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు సర్ స్టీఫెన్ టిమ్స్ చేతుల మీదుగా నరసింహ గౌడ్ అందుకున్నారు. బ్రిటన్ పార్లమెంటు వంటి ప్రతిష్టాత్మక వేదికపై అవార్డు స్వీకరించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతినిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
భాష, ప్రాంతం, కమ్యూనిటీ వంటి హద్దులకు అతీతంగా ప్రతిభను గుర్తించి గౌరవించిన ఫెడరేషన్ ఆఫ్ బ్రిటిష్ తమిళ్ అసోసియేషన్స్ ప్రతినిధులకు ఈ సందర్భంగా నరసింహ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక తెలుగు వ్యక్తి ఫొటోగ్రఫీ ప్రతిభను తమిళ కమ్యూనిటీ గుర్తించి అంతర్జాతీయ వేదికపై గౌరవించడం భారతీయ సమాజాల మధ్య ఉన్న ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.
కాగా, వై. జ్వాలా నరసింహ గౌడ్ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందినవారు. స్వగ్రామం నుంచి ప్రారంభమైన ఆయన ప్రయాణం అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందే స్థాయికి చేరడం స్థానికంగా ఆనందం కలిగించే అంశం. బ్రిటన్ పార్లమెంటులో లభించిన ఈ గౌరవం ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా తెలుగు సమాజానికి కూడా గర్వకారణంగా నిలిచింది.