బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు తీవ్ర వాయుగుండం గా బలపడింది. ఇది దక్షిణ భారత దేశం వైపు మరియు శ్రీలంక తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఈ ప్రభావంతో రాబోయే 36 నుంచి 48 గంటల పాటు దక్షిణ కోస్తా రాష్ట్రాల్లో వాతావరణం గణనీయంగా మారబోతోంది. భారత వాతావరణ శాఖ (IMD) సమాచారం ప్రకారం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ఈ తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది.
శ్రీలంకలోని పోట్స్‌విల్ కు తూర్పు ఆగ్నేయంగా సుమారు 420 కిలోమీటర్ల దూరంలో ఉంది. హాంబన్‌టోటాకు తూర్పు ఆగ్నేయంగా 470 కిలోమీటర్లు, త్రికోమలికి 570 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా సుమారు 1,020 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంది?
ఏపీపై ఈ వాయుగుండం ప్రభావం నేరుగా లేకపోయినప్పటికీ, ఆకాశం మేఘావృతమై కొన్ని చోట్ల వర్షాలు (Full Rains) కురిసే ఛాన్స్ ఉంది.
దక్షిణ కోస్తా & రాయలసీమ: నెల్లూరు, తిరుపతి, చిత్తూరు మరియు అన్నమయ్య జిల్లాల్లో రేపు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
రైతులకు సూచన: పండించిన పంటలు, ముఖ్యంగా ధాన్యం ఆరబోసిన రైతులు వర్షం సూచన ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇక తెలంగాణ (Telangana) విషయానికొస్తే..బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. వచ్చే రెండు రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4 డిగ్రీల తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంది. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో ఆకాశం పాక్షికంగా మెగావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో పొగ మంచు ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
అదిలాబాద్, నిర్మల్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. కరీంనగర్, వరంగల్, జగిత్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి హనుమకొండ, జనగాం, సిద్దిపేట్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, మహబూబాబాద్, వికారాబాద్, జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అటు రాష్ట్రంలోని ఖమ్మం జిల్లలో అత్యధికంగా 16.4 డిగ్రీలు, అత్యల్పంగా ఆదిలాబాద్‌లో 7.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తమిళనాడు, కేరళకు 'ఆరెంజ్ అలర్ట్'.?
వాయుగుండం శ్రీలంక వైపు వెళ్తున్నప్పటికీ, దాని ప్రభావం మన పొరుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుంది. రేపు (శుక్రవారం) తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆరెంజ్ అలర్ట్: ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఈ రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడు జిల్లాలు మరియు కేరళ తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తీర ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.