World Map: బే, గల్ఫ్, స్ట్రెయిట్,కెనాల్.. ప్రపంచ పటంలో వీటి మధ్య తేడా మీకు తెలుసా? AP Full Rains: హై అలెర్ట్.. ఏపీకి పిడుగుల ముప్పు.. రాగల 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం! Earthquake: ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. తీరాన్ని తాకిన సునామీ అలలు! Weather Report: ఏప్రిల్‌లో మండుతున్న ఎండలు... కుండపోత వానలు! ... ప్రజలు తస్మాత్ జాగ్రత్త! Rain Alert: రాబోయే మూడు గంటల్లో ఈ నాలుగు జిల్లాలకు హై అలర్ట్!! పిడుగుల బీభత్సం.... 40-60కిమీ వేగంతో... AP Full Rains: ఆ జిల్లాలకు హై అలర్ట్.. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు! ఏపీలో వాతావరణం ఉగ్రరూపం.. Full Rains: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. 20కి పైగా జిల్లాల్లో.. IMD Alert: రాబోయే 24 గంటలు కీలకం.. ఏపీ వాతావరణంపై ఐఎండీ తాజా అప్‌డేట్! Fire Accident: రాజధానిలో కలకలం... సచివాలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్... World Map: బే, గల్ఫ్, స్ట్రెయిట్,కెనాల్.. ప్రపంచ పటంలో వీటి మధ్య తేడా మీకు తెలుసా? AP Full Rains: హై అలెర్ట్.. ఏపీకి పిడుగుల ముప్పు.. రాగల 3 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం! Earthquake: ఇండోనేషియాలో 7.4 తీవ్రతతో భూకంపం.. తీరాన్ని తాకిన సునామీ అలలు! Weather Report: ఏప్రిల్‌లో మండుతున్న ఎండలు... కుండపోత వానలు! ... ప్రజలు తస్మాత్ జాగ్రత్త! Rain Alert: రాబోయే మూడు గంటల్లో ఈ నాలుగు జిల్లాలకు హై అలర్ట్!! పిడుగుల బీభత్సం.... 40-60కిమీ వేగంతో... AP Full Rains: ఆ జిల్లాలకు హై అలర్ట్.. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు! ఏపీలో వాతావరణం ఉగ్రరూపం.. Full Rains: నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు! పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. 20కి పైగా జిల్లాల్లో.. IMD Alert: రాబోయే 24 గంటలు కీలకం.. ఏపీ వాతావరణంపై ఐఎండీ తాజా అప్‌డేట్! Fire Accident: రాజధానిలో కలకలం... సచివాలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్...

Rare Earth Minerals: ఆ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్.. ఖరీదైన రేర్ ఎర్త్ నిక్షేపాలు..!!

రాయలసీమలో అపారమైన ఖనిజ నిక్షేపాలు బయటపడ్డాయి. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో లిథియం సహా 8 రకాల అరుదైన ఖనిజాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఏపీకి చేకూరనున్న లాభాలేంటో తెలుసుకోండి...

Published : 2026-02-06 17:09:00

రాయలసీమ అంటే కేవలం వర్షాభావ ప్రాంతమో, కరువు సీమనో అనుకుంటే పొరపాటే. ప్రాచీన కాలం నుండి 'రతనాల సీమ'గా పేరుగాంచిన ఈ గడ్డ తన గర్భంలో అపారమైన సహజ సంపదను దాచుకుంది. ఇప్పటికే వర్షాకాలంలో వజ్రాల వేటకు వేదికగా నిలిచే ఈ ప్రాంతంలో, ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి అత్యంత కీలకమైన 'రేర్ ఎర్త్ ఎలిమెంట్స్' (అరుదైన ఖనిజాలు) వెలుగు చూడటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్' జాబితాలో ఉమ్మడి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చోటు దక్కడం ఈ ప్రాంత పారిశ్రామిక భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

హైదరాబాద్‌కు చెందిన నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో జరిపిన పరిశోధనల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అనంతపురం జిల్లాలోని తాడిమర్రి, తురకవారిపల్లి, దాడితోట వంటి ప్రాంతాల్లో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అత్యంత అరుదైన నియోబియం, నియోడైమియం, సిరియం, లాంథనం, స్కాండియం మరియు జిక్రోనియం వంటి ఖనిజాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖనిజాలను కేవలం గృహోపకరణాల తయారీలోనే కాకుండా, అత్యాధునిక ఎయిర్‌క్రాఫ్ట్స్, స్మార్ట్‌ఫోన్లు, విండ్ టర్బైన్లు మరియు సూక్ష్మ కంప్యూటర్ చిప్‌ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. వీటి లభ్యత ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పారిశ్రామిక పటంలో నిలబెట్టనుంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ నిక్షేపాల్లో 'లిథియం' ఉనికి ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతపురం జిల్లాతో పాటు కడప జిల్లాలోని పార్నపల్లె, లోపటనూతల సరిహద్దు ప్రాంతాల్లో కూడా లిథియం నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ 'వైట్ గోల్డ్' (తెల్ల బంగారం) లభ్యత వల్ల బ్యాటరీల తయారీ రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించే అవకాశం ఉంది. ఈ నిక్షేపాల అన్వేషణ కోసం అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ (AMD) మరియు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశోధనలతో పాటు హెలికాప్టర్ సర్వేలను కూడా వేగవంతం చేశాయి.

ఈ భారీ ఖనిజ సంపద వెలికితీత ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అతిపెద్ద ఖనిజ హబ్‌గా అవతరించే అవకాశం ఉంది. గతంలో కేవలం బాక్సైట్, ఇనుము మరియు బంగారు నిక్షేపాలకే పరిమితమైన రాయలసీమ, ఇప్పుడు గ్లోబల్ టెక్నాలజీకి అవసరమైన ముడిసరుకును సరఫరా చేసే స్థాయికి చేరుకోనుంది. కేంద్ర ప్రభుత్వం ఈ కారిడార్లకు అందిస్తున్న ప్రోత్సాహం వల్ల భారీ ఎత్తున పెట్టుబడులు తరలిరావడమే కాకుండా, స్థానిక నిరుద్యోగులకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రత్నాల సీమగా పేరుగాంచిన ఈ గడ్డ, ఇప్పుడు అరుదైన ఖనిజాల గనిగా మారి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవబోతోంది.

Spotlight

Read More →