Shivaji Anasuya: ఆవేశంలో మాటలు జారాయి.. ఆడబిడ్డలకు క్షమాపణలు.. శివాజీ.. అనసూయ గారు మీరెందుకొచ్చారు! Entertainment News: డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ‘గ్లామర్‌కు హద్దు ఉండాలి’ అంటూ చర్చకు తెర!! OTT Releases: ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమాలు, సిరీస్‌ల వర్షం! లిస్ట్ ఇదిగోండి! Bigg Boss 9: ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు..? ఆయన రాకతో షో రేంజ్ నెక్స్ట్ లెవెల్..! OTT Releases: వీకెండ్ వినోదం.. ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ఈ వారం స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే! Putins press: పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రేమ ఘట్టం.. లవ్ ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో ఫైనల్ ఫైట్… విన్నర్ ఎవరో! Bigg boss: అంచనాలను తలకిందులు చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9... గ్రాండ్ ఫినాలేకు మెగా ట్విస్ట్... చీఫ్ గెస్ట్‌గా! Jani Master: వాళ్లిద్దరి మధ్య విభేదాలు... తేల్చి చెప్పేసిన జానీ మాస్టర్! OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు... Shivaji Anasuya: ఆవేశంలో మాటలు జారాయి.. ఆడబిడ్డలకు క్షమాపణలు.. శివాజీ.. అనసూయ గారు మీరెందుకొచ్చారు! Entertainment News: డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ‘గ్లామర్‌కు హద్దు ఉండాలి’ అంటూ చర్చకు తెర!! OTT Releases: ఈ వారం ఓటీటీలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. సినిమాలు, సిరీస్‌ల వర్షం! లిస్ట్ ఇదిగోండి! Bigg Boss 9: ఫినాలే చీఫ్ గెస్ట్ ఎవరు..? ఆయన రాకతో షో రేంజ్ నెక్స్ట్ లెవెల్..! OTT Releases: వీకెండ్ వినోదం.. ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ఈ వారం స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే! Putins press: పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రేమ ఘట్టం.. లవ్ ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్! Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో ఫైనల్ ఫైట్… విన్నర్ ఎవరో! Bigg boss: అంచనాలను తలకిందులు చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9... గ్రాండ్ ఫినాలేకు మెగా ట్విస్ట్... చీఫ్ గెస్ట్‌గా! Jani Master: వాళ్లిద్దరి మధ్య విభేదాలు... తేల్చి చెప్పేసిన జానీ మాస్టర్! OTT: ఓటీటీ లవర్స్‌కు పండుగే! ఈ వారం స్ట్రీమింగ్‌లో 8 క్రేజీ సినిమాలు & సిరీస్‌లు...

Shivaji Anasuya: ఆవేశంలో మాటలు జారాయి.. ఆడబిడ్డలకు క్షమాపణలు.. శివాజీ.. అనసూయ గారు మీరెందుకొచ్చారు!

2025-12-25 11:02:00
H-1B Shock: హెచ్‌–1బీ వీసా ఇక సులువు కాదు…! లక్ష డాలర్ల ఫీజుతో కొత్త నియమాలు!

నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల అవమానకరంగా ఉన్నాయంటూ పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సీనియర్ నటుడిగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత అభిప్రాయాలను సమాజంపై రుద్దేలా మాట్లాడటం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. డ్రెస్సింగ్‌లో తప్పు లేదని, అసలు సమస్య చూసే చూపులోనే ఉందని కొందరు బలంగా వాదిస్తున్నారు. మహిళ ఏ దుస్తులు ధరించాలన్నది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ అని, అందులో ఇతరులు జోక్యం చేసుకోవడం తగదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Air Pollution: అత్యవసర పరిస్థితిలోనూ నిర్ణయం లేదా? జీఎస్టీ కౌన్సిల్‌పై ఢిల్లీ హైకోర్టు ఫైర్!

ఈ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు స్పందించారు. గాయని చిన్మయి వ్యంగ్యంగా స్పందిస్తూ, ముందు శివాజీ గారే ధోతీ కట్టుకోవాలని సూచించడం చర్చకు దారి తీసింది. మరోవైపు యాంకర్, నటి అనసూయ ఘాటుగా కౌంటర్ ఇస్తూ, “ఇది నా శరీరం, మీది కాదు” అని స్పష్టంగా పేర్కొన్నారు. మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులపై ఆమె చేసిన వ్యాఖ్యలు చాలామందికి మద్దతు పొందాయి. అయితే మరో వర్గం మాత్రం శివాజీ మాటలను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఆయన ఉద్దేశం హుందాగా ఉండాలన్న సూచన మాత్రమేనని సమర్థిస్తోంది. సమాజంలో సంస్కారం, విలువలు అవసరమేనని, సెలబ్రిటీలు యువతపై ప్రభావం చూపుతారన్న కోణంలో ఆయన మాటలను చూడాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.

KV Update: విద్యార్థులకు గుడ్ న్యూస్…! ఆ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఫిక్స్…!

వివాదం ముదిరిన నేపథ్యంలో శివాజీ తాజాగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. ఆవేశంలో కొన్ని మాటలు నోరు జారాయని అంగీకరిస్తూ, ఆడబిడ్డలందరికీ క్షమాపణలు చెప్పారు. అయితే తన స్టేట్మెంట్‌కు మాత్రం కట్టుబడి ఉన్నానని పేర్కొనడం మరోసారి చర్చను రేకెత్తించింది. ఇదే సమయంలో ఈ వివాదంపై స్పందించిన అనసూయపై ఆయన అసహనం వ్యక్తం చేస్తూ, “ఇష్యూకు సంబంధం లేని వారు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? అనసూయ గారు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి?” అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి.

Tirumala: స్థానిక భక్తులకు టీటీడీ బిగ్ గిఫ్ట్…! వైకుంఠ ద్వార దర్శనానికి రిజిస్ట్రేషన్ స్టార్ట్…!

దీనికి అనసూయ మరింత ఘాటుగా స్పందించారు. “అతివినయం ధూర్త లక్షణం. ఆయనకు సింపథీ కావాలి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకటి, రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించానని, కాబట్టి ఈ అంశంతో తనకు సంబంధం లేదనడం సరికాదని స్పష్టం చేశారు. మహిళలు ఎలా జీవించాలనేది వారి ఇష్టమని, వారికి ఆ స్వేచ్ఛ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. హీరోయిన్లు ఇబ్బంది పడుతున్నారని నిజంగా భావిస్తే, డ్రెస్సింగ్‌పై మాట్లాడటం కంటే యువకులు జంతువుల్లా ప్రవర్తించవద్దని చెప్పాలని సూచించారు. ఈవెంట్‌లో శివాజీ మాట్లాడిన తీరు ఆయన అసలు స్వరూపాన్ని బయటపెట్టిందని అనసూయ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Amazon Expansion: నిరుద్యోగులకు పండగే పండగ! అమెజాన్ భారీ విస్తరణ.. 833 మందికి ఉద్యోగాలు!

మొత్తానికి ఈ వివాదం డ్రెస్సింగ్ స్టైల్ అంశాన్ని దాటి, మహిళల స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు, సెలబ్రిటీల బాధ్యత వంటి విస్తృత అంశాలపై చర్చకు దారితీసింది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా, మాటల విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Christmas Mass 2025: వాటికన్ సిటీ నుంచి ప్రపంచానికి శాంతి పిలుపు.. పోప్ లియో XIV తొలి క్రిస్మస్!!
Anganwadi Jobs: అంగన్వాడీ పోస్టుల భర్తీ.. డిసెంబర్ 31 వరకు గడువు! పది పాసైతే చాలు... మీ ఊర్లోనే ఉద్యోగం!
Indian Passport: భారత పాస్‌పోర్ట్‌పై టెకీ ఆవేదన.. ఇక విలువ లేదంటూ సంచలన వ్యాఖ్యలు!
Navi Mumbai Airport: నవి ముంబై విమానాశ్రయం ప్రారంభం.. తొలి విమానం ల్యాండింగ్‌తో చరిత్రాత్మక ఘట్టం!!
District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...?
కెనడా లో అత్యధికంగా ఏపీ, తెలంగాణ విద్యార్థులదే హవా.. అడ్మిషన్లకు ముందు ఇవి కచ్చితంగా తెలుసుకోవాలి.!
ప్రేమ, శాంతి సందేశంతో క్రిస్మస్ పండుగ... ప్రత్యేకత ఇదే!
Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

Spotlight

Read More →