LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Biker: మోటోక్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో ‘బైకర్’.. సినిమా రివ్యూ..

Biker Movie Review: భారతదేశంలో తొలి మోటోక్రాస్ సినిమాగా ‘బైకర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బైకర్’ సినిమా. తమిళనాడులోని కోయంబత్తూరులో సాగే కథ.

AndhraPravasi News Desk 2 min read
Biker: మోటోక్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో ‘బైకర్’.. సినిమా రివ్యూ..

భారతదేశంలో తొలి మోటోక్రాస్ సినిమాగా ‘బైకర్’..

ఊహించిన రేంజ్ లో సినిమా ఉందా?

స్పోర్ట్స్ డ్రామాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండటం తెలిసిందే. అదే ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని, భారతదేశంలో తొలి మోటోక్రాస్ సినిమాగా ‘బైకర్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో శర్వానంద్, దర్శకుడు అభిలాష్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం విడుదలకు ముందే మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. అయితే సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుందో చూద్దాం.

కథ ఏమిటి? 
తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ కథ సాగుతుంది. ఒకప్పుడు ప్రముఖ మోటోక్రాస్ రేసర్‌గా ఉన్న సునీల్ నారాయణ (రాజశేఖర్) తన దేశాన్ని ఈ రంగంలో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని కలలు కంటాడు. తన కలను నిజం చేయడానికి తన కుమారుడు వికాస్ నారాయణ (శర్వానంద్)ను చిన్నప్పటి నుంచే రేసర్‌గా తయారు చేస్తాడు.

వికాస్ కూడా తండ్రి కలను నెరవేర్చేందుకు కష్టపడుతూ మంచి రేసర్‌గా ఎదుగుతాడు. అయితే ఒక ప్రమాదం, అలాగే ప్రేమికురాలు (మాళవిక నాయర్) ఒత్తిడి కారణంగా రేసింగ్‌కు దూరమవుతాడు. తర్వాత తండ్రి-కొడుకుల మధ్య భావోద్వేగ సంఘర్షణ ఎలా సాగింది? వికాస్ మళ్లీ ట్రాక్‌ పైకి వస్తాడా? తండ్రి అతన్ని అంగీకరిస్తాడా? అన్నదే కథ.

నటీనటుల ప్రదర్శన 
వికాస్ పాత్రలో శర్వానంద్ అద్భుతంగా ఒదిగిపోయాడు. రేసర్‌గా కనిపించే తీరు, బాడి లాంగ్వేజ్ చాలా సహజంగా ఉన్నాయి. భావోద్వేగ సన్నివేశాల్లో కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు.

సునీల్ నారాయణ పాత్రలో రాజశేఖర్ సీరియస్, మెచ్యూర్ ప్రదర్శన ఇచ్చారు. క్రీడే జీవితమన్న తన నమ్మకాన్ని బలంగా చూపించారు. ముఖ్యంగా రెండో భాగంలో తండ్రి-కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. మాళవిక నాయర్, బ్రహ్మాజీ, తులసి, అతుల్ కులకర్ణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే వీరి పాత్రల పరిధి పరిమితంగానే ఉంది.

సాంకేతికంగా ఎలా ఉంది?  
ఇలాంటి సినిమాల్లో టెక్నికల్ అంశాలు చాలా ముఖ్యమైనవి. ఈ విషయంలో ‘బైకర్’ మంచి మార్కులు సాధించింది. సినిమాటోగ్రాఫర్ జే. యువరాజ్ తీసిన రేసింగ్ సన్నివేశాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ట్రాక్‌పై జరిగే పోటీని ప్రేక్షకుడు ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎడిటర్ అనిల్ పసాలా పనితనం బాగుంది. నాన్-లీనియర్ కథనం కొంత ఆసక్తిని పెంచినప్పటికీ, కొన్ని చోట్ల క్లిష్టంగా అనిపిస్తుంది.

జిబ్రాన్ అందించిన సంగీతం కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కువగా ఆకట్టుకుంటుంది. పాటలు మాత్రం పెద్దగా గుర్తుండిపోయేలా లేవు. యువీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తాయి.

ప్లస్ పాయింట్లు:
రేసింగ్ సన్నివేశాలు
సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ప్రధాన నటీనటుల నటన
మైనస్ పాయింట్లు
బలహీనమైన సంఘర్షణ
కొంత ఫ్లాట్‌గా అనిపించే డ్రామా
పాటలు పెద్దగా ఆకట్టుకోకపోవడం

తెలుగు సినిమాల్లో నిజమైన స్పోర్ట్స్ డ్రామాలు చాలా అరుదుగా వస్తాయి. ఆ కోవలో ‘బైకర్’ ఒక మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. మోటోక్రాస్ అనే కొత్త కాన్సెప్ట్‌ను తీసుకుని, తండ్రి-కొడుకుల భావోద్వేగ కథతో కలపడం దర్శకుడు అభిలాష్ రెడ్డి ప్రత్యేకత.

రేసింగ్ సన్నివేశాల్లో శర్వానంద్ కష్టపడి చేసిన శ్రమ స్పష్టంగా కనిపిస్తుంది. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా చాలా నాణ్యంగా ఉంది. ముఖ్యంగా ప్రారంభంలో వచ్చే రేసింగ్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

అయితే కథలో భావోద్వేగాలు కొంతవరకు ఊహించదగ్గ విధంగా సాగుతాయి. ఇంకా కొంత కొత్తదనం, బలమైన ట్విస్టులు ఉంటే సినిమా ఇంకా మెరుగ్గా ఉండేది. అలాగే మాళవిక నాయర్ పాత్ర కొంత క్లిషేలా అనిపిస్తుంది.

బైకర్’ పాత కథనంతో ఉన్నా, కొత్త బ్యాక్‌డ్రాప్, మంచి టెక్నికల్ వాల్యూస్, ప్రధాన నటీనటుల నటనతో చూడదగ్గ సినిమా. మోటోక్రాస్ రేసింగ్ సన్నివేశాలు, భావోద్వేగ క్షణాల కోసం థియేటర్లలో ఒకసారి చూసేయవచ్చు. కొంచెం బలమైన కథనంతో వస్తే, ఇది మరింత గుర్తుండిపోయే సినిమాగా మారేదని చెప్పొచ్చు.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…