LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Sunil actor: మలయాళ సినిమాలో 'మారి'గా సునీల్... 'కట్టలన్'లో పవర్ ఫుల్ రోల్...

Sunil actor: టాలీవుడ్ నటుడు సునీల్ మరో పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో ఆంటోనీ వర్గీస్ హీరోగా, పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'కట్టలన్'లో సునీల్ 'మారి' అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ క్యూబ్ ఎంటర్‌టై…

AndhraPravasi News Desk 2 min read
Sunil actor: మలయాళ సినిమాలో 'మారి'గా సునీల్... 'కట్టలన్'లో పవర్ ఫుల్ రోల్...
  • అంటోనీ వర్గీస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి పాల్ జార్జ్ దర్శకుడు…
     
  • మలయాళ పాన్ ఇండియా చిత్రం 'కట్టలన్'లో సునీల్..

Sunil actor: టాలీవుడ్ నటుడు సునీల్ మరో పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో ఆంటోనీ వర్గీస్ హీరోగా, పాల్ జార్జ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'కట్టలన్'లో సునీల్ 'మారి' అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ క్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సునీల్ క్యారెక్టర్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రం మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించింది. 'వేటకు సిద్ధంగా ఉండండి' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇటీవల ఇదే చిత్రం నుంచి తమిళ నటి దుషారా విజయన్ 'లూసీ' అనే పాత్రలో నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరితో పాటు కబీర్ దుహాన్ సింగ్ 'ఎడ్డీ'గా, పార్థ్ తివారీ 'రాబీ'గా నటిస్తున్నారు. ముఖ్యంగా 'పుష్ప' చిత్రంలో 'మొగిలేసు' పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తిరందాసు 'మారి 95' అనే పాత్రలో కనిపించనుండటం విశేషం. ఈ చిత్రానికి తొలుత 'కాంతార 2' ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్‌ను సంగీత దర్శకుడిగా ప్రకటించినా, ఆ తర్వాత అనూహ్యంగా 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్‌ను తీసుకున్నారు. ఈ మార్పు సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 'కట్టలన్' షూటింగ్ పూర్తయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వాస్తవానికి మే 14న విడుదల చేయాలని భావించినా, కొన్ని కారణాలతో విడుదల తేదీని మే 28కి మార్చారు. గతంలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ షూటింగ్ సమయంలో జరిగిన ఓ కారు ప్రమాదానికి సంబంధించిన వీడియోను విడుదల చేసి, ప్రాణాలకు తెగించి పనిచేసే స్టంట్‌మెన్‌ల ధైర్యానికి నివాళులర్పించడం అందరి ప్రశంసలు అందుకుంది.

బ్లాక్‌బస్టర్ 'మార్కో' చిత్ర నిర్మాత షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాల్ జార్జ్, జాబీ వర్గీస్, జెరో జాకబ్ కలిసి ఈ చిత్రానికి కథ అందించారు. ఆంటోనీ వర్గీస్‌కు జోడీగా రాజిషా విజయన్ నటిస్తుండగా, రాపర్ బేబీ జీన్, జగదీష్, సిద్దిఖ్ వంటి ప్రముఖులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెనాడైవ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, షమీర్ మహమ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారీ తారాగణం, ప్రముఖ టెక్నీషియన్లతో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…