LIVE
Supreme Court: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో దక్కని ఊరట! రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై పిటిషన్ కొట్టివేత!  •  Praja Vedika: రేపు (13/6) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!  •  అమెరికా మిస్సైల్ దాడిలో విశాఖ యువకుడి దుర్మరణం... చంద్రబాబు ఆరా!!  •  Jobs: దుబాయ్‌లో ఉద్యోగాలు... నెలకు రూ.1.12 లక్షల జీతం... గోల్డెన్ ఛాన్స్ మీకోసమే!  •  Amaravathi Works: అమరావతి నిర్వాసితులకు గుడ్ న్యూస్... ఏడాది పాటు నెలకు రూ.10 వేల అద్దె!  •  Horticulture: భారత్‌లో ఉద్యానవన పంటల ఉత్పత్తికి భారీ వృద్ధి! 3,778 లక్షల టన్నులకు చేరనున్న హార్టికల్చర్ ఉత్పత్తి!  •  Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ బుకింగ్ ఇక చాలా ఈజీ! కేవలం 30 రోజుల్లో..  •  AP Farmers: అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు... కీలక ఆదేశాలు... దాదాపు పదేళ్ల తర్వాత...!!  •  H1B Visa: వీసా బాదుడుకు యూఎస్ కోర్టు బ్రేక్... వెనక్కి తగ్గని ట్రంప్!  •  Weather Alert: రాగల 24 గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు... ఏపీలో ఈ జిల్లాలకు హై అలర్ట్!!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
Entertainment

Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ!

Dhurandhar 2 Movie Review: రణవీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'ధురందర్ 2' రివ్యూ మీ కోసం. రణవీర్ సింగ్ యాక్టింగ్, ఆదిత్య ధర్ టేకింగ్ మరియు సినిమా ప్లస్, మైనస్ పాయింట్స్ మీ కోసం..

AndhraPravasi News Desk 2 min read
Dhurandhar 2 Movie Review:పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లిన రణవీర్.. థియేటర్లలో రచ్చ లేపుతున్న 'ధురందర్ 2' మూవీ రివ్యూ!

Dhurandhar 2 Movie Review: రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన 'ధురందర్ 2' కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఊపు చూశాక, ఈ సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి ఈ సినిమా థియేటర్లలో ఏ రేంజ్‌లో ఆడియన్స్ అలరించింది రణవీర్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

రణవీర్ వన్ మ్యాన్ షో

ఈ సినిమా మొత్తం రణవీర్ సింగ్ భుజాల మీదనే నడిచింది. ఇందులో రణవీర్ జస్క్రీత్ సింగ్ రంగీ అనే క్యారెక్టర్‌లో కనిపిస్తాడు. తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునే ఒక యువకుడు, దేశం కోసం 'హమ్జా అలీ మజారీ'గా మారి పాకిస్థాన్ టెర్రర్ నెట్‌వర్క్‌ను ఎలా గడగడలాడించాడు అనేది మెయిన్ పాయింట్. రణవీర్ యాక్టింగ్ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో కన్నీళ్లు పెట్టిస్తూనే, యాక్షన్ సీన్స్‌లో రౌద్రం చూపిస్తూ అదరగొట్టేశాడు. ముఖ్యంగా జైలులో అతను నవ్వే సీన్ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం.

డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈసారి కథను చాలా లోతుగా రాసుకున్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఇండియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ (నోట్ల రద్దు, ఉరి సర్జికల్ స్ట్రైక్స్, అయోధ్య ఇష్యూ) వంటి వాటిని కథలో కలిపిన తీరు బాగుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎక్కడా బోర్ కొట్టకుండా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే క్లైమాక్స్ కొంచెం స్లోగా అనిపించినా, ఓవరాల్‌గా సినిమా మాత్రం అదిరిపోయే రేంజ్‌లో ఉంది.

విలన్ల వేటలో మాధవన్, సంజయ్ దత్

ఆర్ మాధవన్ ఒక బాస్ లాగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించారు. జస్క్రీత్‌ను ఒక మిషన్‌లా మార్చే అజయ్ సన్యాల్ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. ఇక విలన్‌గా అర్జున్ రాంపాల్ భయంకరంగా కనిపించారు. అక్షయ్ ఖన్నా లేని లోటును ఆయన తన విలనిజంతో భర్తీ చేశారు. సంజయ్ దత్ కాసేపు కనిపించినా, తనదైన స్టైల్‌లో థియేటర్లో విజిల్స్ వేయించారు. సారా అర్జున్ కూడా  చిన్న  పాత్రనే మంచి ఇంపాక్ట్ చూపించింది.

సినిమాలో సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్ద ప్లస్ పాయింట్. 90ల నాటి హిట్ సాంగ్స్‌ను మళ్ళీ కొత్తగా వాడటం వల్ల ఆడియన్స్‌కు ఒక తెలియని కిక్ వస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంది, ముఖ్యంగా కరాచీ వీధుల్లో జరిగే యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ లెవల్‌లో ఉన్నాయి. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ మరోసారి ప్రూవ్ అయ్యింది.

'ధురందర్ 2' ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దేశభక్తి సినిమాలను, యాక్షన్ మూవీస్‌ను ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక విందు లాంటిది. కొన్ని లాజిక్స్ పక్కన పెడితే, ఈ వీకెండ్‌కు ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా థియేటర్లో చూసేయొచ్చు.

Be the first to react

More Coverage

OTT: నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్-1 ట్రెండింగ్‌గా ‘మా బెహెన్’.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డార్క్ కామెడీ!

OTT: నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్-1 ట్రెండింగ్‌గా ‘మా బెహెన్’.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న డార్క్ కామెడీ!

OTT: ప్రముఖ దర్శకుడు సురేష్ త్రివేణి తెరకెక్కించిన డార్క్ కామెడీ చిత్రం ‘మా బెహెన్’ విడుదలైన కొద్ది…