LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి..

Chandrabose: ప్రముఖ సినీ గీత రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా కలికిరిలో ఆదివారం ఉదయం జరిగింది.

AndhraPravasi News Desk 1 min read
Chandrabose: సినీ గీత రచయిత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం.. టిఫిన్ చేస్తూ అక్కడికక్కడే కుప్పకూలి..
  • Cinema: వ్యాపార పనులపై వెళ్లి అస్వస్థతకు గురై మరణం…
     
  • చంద్రబోస్ సోదరుడు రాజేంద్ర (60) గుండెపోటుతో మృతి..

Chandrabose: ప్రముఖ సినీ గీత రచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రాజేంద్ర (60) ఆదివారం ఉదయం అన్నమయ్య జిల్లా కలికిరిలో గుండెపోటుతో కన్నుమూశారు. వ్యాపార నిమిత్తం బెంగళూరు నుంచి వచ్చిన ఆయన, శనివారం రాత్రి కలికిరిలోని తన స్నేహితుడు శ్రీనివాసరెడ్డి నివాసంలో బస చేశారు. అయితే ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు. ఆ తర్వాత కలికిరి క్రాస్ రోడ్డు సమీపంలోని ఒక హోటల్‌లో టిఫిన్ చేస్తున్న సమయంలో రాజేంద్రకు ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.

ఈ విషాద వార్త తెలియగానే కలికిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రాజేంద్ర మృతి చెందిన విషయాన్ని వెంటనే చంద్రబోస్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజేంద్ర ఆకస్మిక మరణంతో కలికిరి పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆస్కార్ వంటి అంతర్జాతీయ వేదికలపై తెలుగు ఖ్యాతిని చాటిన చంద్రబోస్ సోదరుడు ఇలా అకస్మాత్తుగా మరణించడం పట్ల సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ చంద్రబోస్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…