LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

LIK: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీతో కొత్త ప్రయోగం!

LIK: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నాయనతారం నిర్మాతగా.. థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.

AndhraPravasi News Desk 2 min read
LIK: లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీతో కొత్త ప్రయోగం!

మొబైల్ ఫోన్ ద్వారా 2035 సంవత్సరానికి టైమ్ ట్రావెల్..

కోల్పోయిన ప్రేమను వెతికే ప్రయత్నంలో..

తమిళ సినీ పరిశ్రమలో కొత్త కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Kompany) అనే సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రేపు అనగా ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. మొదటగా 2025 సెప్టెంబర్‌లో విడుదల చేయాలని భావించినా, పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధమైంది.

ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), S. J. సూర్య, కృతీ శెట్టి (Krithi Shetty) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే యోగి బాబు, సీమన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సినిమా విడుదలకు ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కృతి శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హీరో ప్రదీప్ రంగనాథన్ నటన గురించి మాట్లాడుతూ… అతనిలో ఒక ప్రత్యేకమైన “మ్యాజిక్” ఉందని చెప్పింది. నటిగా తానే సినిమా చూస్తున్నప్పుడు కూడా అతని నటనపై ఆకర్షితురాలినయ్యానని తెలిపింది. అతనిలో ఉన్న “ఫైర్” మరియు కష్టపడే తత్వం ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయని చెప్పింది.

ఈ సినిమా కథ పూర్తిగా కొత్తగా ఉండబోతోంది. ఒక యువకుడు భవిష్యత్తు టెక్నాలజీతో కూడిన మొబైల్ ఫోన్ ద్వారా 2035 సంవత్సరానికి ప్రయాణిస్తాడు. తన కోల్పోయిన ప్రేమను వెతుక్కోవడమే అతని లక్ష్యం.

ఆ ప్రయాణంలో అతను ఒక “లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ”ని కనుగొంటాడు. అక్కడ ప్రేమ, సంబంధాలు అన్నీ ఇన్సూరెన్స్ పాలసీల మాదిరిగా నిర్వహించబడతాయి. క్లెయిమ్స్, షరతులు, బ్రేకప్ సెటిల్‌మెంట్స్ తో కథ సాగుతుంది. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం మన జీవితంలో మొబైల్ ఫోన్ ఎంత ముఖ్యమైందో అందరికీ తెలుసు. అదే అంశాన్ని ఈ సినిమా తీసుకుని, మరింత భవిష్యత్తు కోణంలో అతిశయోక్తిగా చూపించనుంది. ఈ కాన్సెప్ట్ కథకు ప్రధాన బలం అని కృతి శెట్టి తెలిపింది.

ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ (Rowdy Pictures), సెవెన్ స్క్రీన్ స్టూడియో (Seven Screen Studio) నిర్మిస్తున్నాయి. ప్రముఖ నటి నయనతార ఈ ప్రాజెక్ట్‌ లో నిర్మాత కూడా.

సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందించగా, సినిమాటోగ్రఫీని రవి వర్మన్ మరియు సత్యన్ సూర్యన్ నిర్వహించారు. ఎడిటింగ్ బాధ్యతలను ప్రదీప్ ఈ. రాఘవ్ చేపట్టారు.

తమిళనాడులో ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies) విడుదల చేయనుంది. రొమాన్స్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ మేళవింపుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మొత్తానికి, లవ్ ఇన్షూరెన్స్ కంపెనీ ఒక వినూత్న కథతో, భవిష్యత్తు నేపథ్యంతో వస్తున్న ప్రత్యేక సినిమా. కృతి శెట్టి చెప్పిన విషయాలు చూస్తే… ఇందులో నటన, కథ, కాన్సెప్ట్ అన్నీ కొత్తదనం కలిగినవిగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులు థియేటర్లలో ఈ సినిమా ఎలా స్వీకరిస్తారో చూడాలి.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…