LIVE
Defence: రూ.1.78 లక్షల కోట్లకు చేరిన భారత రక్షణ ఉత్పత్తి.. కొత్త రికార్డు నమోదు!  •  LPG: సామాన్యుడికి తప్పని గ్యాస్ మంట.. కేంద్ర ప్రభుత్వం సంచలనం.. వారికి బిగ్ షాక్..!!  •  NEET: నీట్ రీ-ఎగ్జామ్ ముందు అప్రమత్తమైన ఎన్టీఏ.. సోషల్ మీడియాలో మోసగాళ్లపై నిఘా!  •  ROB: నిడమర్రు ఆర్‌ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్!  •  Modi: జీ7 వేదికగా మోదీ-ట్రంప్ కీలక భేటీ.. వరుస ద్వైపాక్షిక భేటీలు!  •  Donald Trump: ఇరాన్ ముందు మోకరిల్లిన ట్రంప్.. అమెరికా, ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం!  •  Indian Railways: ప్రయాణికులకు అలర్ట్... జూన్ 20 నుండి ఆ ఎక్స్‌ప్రెస్ సమయాల్లో మార్పు!  •  Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు! తాజా రేట్లు ఇవే!  •  Pakistan: హాలిడే ట్రిప్‌లో ఊహించని విషాదం.. పాకిస్థాన్‌లో ఘోరం.. 9 ఏళ్ల చిన్నారిని కాల్చి చంపిన పోలీసులు!  •  India: భారత్ దెబ్బకు టర్కీ విమానయాన సంస్థ విలవిల.. రూ. 4,200 కోట్ల నష్టంతో రాత్రికి రాత్రే.. 10,000 మంది ఉద్యోగులను.!  • 
Entertainment

Kalki 2 Update: సుప్రీం యాస్కిన్ కోసం నిర్మాత భారీ ఖర్చు.. కమల్ రెమ్యూనరేషన్ ఇదే!

Supreme Yaskin Kalki 2 Salary: కల్కి 2898 AD సీక్వెల్ కోసం లోకనాయకుడు కమల్ హాసన్ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. రోజుకు దాదాపు 17 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌తో ఆయన ఇండియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న వార్తలు వస్తున్నాయి...

AndhraPravasi News Desk 2 min read
Kalki 2 Update: సుప్రీం యాస్కిన్ కోసం నిర్మాత భారీ ఖర్చు.. కమల్ రెమ్యూనరేషన్ ఇదే!

Supreme Yaskin Kalki 2 Salary: యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో సుప్రీం యాస్కిన్‌గా కనిపించిన లోకనాయకుడు కమల్ హాసన్ పాత్ర చిన్నదే అయినా, దాని ఇంపాక్ట్ మాత్రం మామూలుగా లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌కు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కమల్ హాసన్‌కు ఈ సినిమా కోసం ఇస్తున్న రెమ్యూనరేషన్ వింటే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా ఆయన రికార్డు సృష్టించారని టాలీవుడ్ టాక్.

ప్రముఖ నటుడు, దర్శకుడు యుగి సేతు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కమల్ పారితోషికం గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కల్కి మొదటి భాగం కోసం కమల్ హాసన్ రోజుకు దాదాపు ఒక మిలియన్ డాలర్ల (సుమారు 8.5 కోట్లు) పారితోషికం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే, ఈ లెక్క అంతకంటే ఎక్కువే ఉంటుందని ఆయన తాజా సమాచారం. సినిమా నిర్మాత అశ్వినీ దత్ గారితో మాట్లాడిన తర్వాత, కమల్ హాసన్‌కు రోజుకు రెండు మిలియన్ డాలర్లు అంటే దాదాపు 17 కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు తనకు అర్థమైందని యుగి సేతు బాంబు పేల్చారు.

సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా మొత్తానికి వంద కోట్లు తీసుకోవడం మనం చూస్తుంటాం. కానీ, కమల్ హాసన్ కేవలం 10 నుండి 20 రోజుల కాల్ షీట్ కోసం ఏకంగా 150 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక నటుడు ఒక రోజు పనికి తీసుకుంటున్న అత్యధిక మొత్తం ఇదే అవుతుంది. కల్కి పార్ట్-1 చివరలో యాస్కిన్ పాత్ర విశ్వరూపం చూపించిన సంగతి తెలిసిందే. అందుకే రెండో భాగంలో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని, దానికి తగ్గట్టుగానే భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారని తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమా సెట్స్‌లో సుమారు 40 ఏళ్ల తర్వాత అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మళ్లీ కలవడం అభిమానులకు కంటి నిండుగా అనిపించింది. వీరిద్దరూ కలిసి నటించిన 'గెరాఫ్తార్' సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు కల్కి సెట్స్‌లో ఒకరినొకరు ఆత్మీయంగా హత్తుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమితాబ్ కూడా తన బ్లాగులో కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఈ దిగ్గజ నటుల కలయిక సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోది  ఏదేమైనా, ఒకవైపు భారీ రెమ్యూనరేషన్లు, మరోవైపు తారాగణం మార్పులతో 'కల్కి 2' ఇప్పుడే హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సోషియో-ఫాంటసీ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Be the first to react

More Coverage

Trisha: అరవింద్ స్వామి, త్రిషల క్రేజీ కాంబో.. 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోలీవుడ్‌లో సరికొత్త సంచలనం!

Trisha: అరవింద్ స్వామి, త్రిషల క్రేజీ కాంబో.. 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోలీవుడ్‌లో సరికొత్త సంచలనం!

Trisha: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. హారర్, కామెడీ, క్రైమ్, లేడీ…

Renu Desai: కథ, టైటిల్ అన్నీ సస్పెన్స్.. రేణు దేశాయ్ కొత్త ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో పెరిగిన అంచనాలు!

Renu Desai: కథ, టైటిల్ అన్నీ సస్పెన్స్.. రేణు దేశాయ్ కొత్త ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో పెరిగిన అంచనాలు!

Renu Desai: సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రేణు దేశాయ్…

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…