LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Film Chamber: ఐ బొమ్మ, బప్పంపై మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు!

Film Chamber: తెలుగు సినీ పరిశ్రమకు మళ్లీ పైరసీ బెడద పెరుగుతోంది. ఇటీవల విడుదలైన సినిమాలు అక్రమంగా ప్రసారం చేస్తున్న ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లపై ఫిల్మ్ ఛాంబర్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

AndhraPravasi News Desk 1 min read
Film Chamber: ఐ బొమ్మ, బప్పంపై మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు!

ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్లపై కేసులు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు..

విడుదలైన సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్న పైరసీ ముఠా..

తెలుగు సినీ పరిశ్రమకు మళ్లీ పైరసీ బెడద పెరుగుతోంది. ఇటీవల విడుదలైన సినిమాలు అక్రమంగా ప్రసారం చేస్తున్న ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లపై ఫిల్మ్ ఛాంబర్ మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమాల విడుదల వెంటనే వాటిని ఆన్‌లైన్‌లో పెట్టడం వల్ల నిర్మాతలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

ఈ వ్యవహారంలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గతంలో ‘ఐ బొమ్మ’ నిర్వహణతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న రవి అనే వ్యక్తి తాజాగా స్పందించారు. ప్రస్తుతం నడుస్తున్న కొత్త ‘ఐ బొమ్మ’ వెబ్‌సైట్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తన పేరును ఉపయోగించుకుని కొందరు కేటుగాళ్లు కొత్త వెబ్‌సైట్‌ను సృష్టించి సినిమాలను అప్‌లోడ్ చేస్తున్నారని తెలిపారు.

ఇటీవల విడుదలైన పలు సినిమాలు ఈ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవడంతో సినీ పరిశ్రమలో ఆందోళన మరింత పెరిగింది. థియేటర్లలో సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే పైరసీ కాపీలు బయటకు రావడం వల్ల ప్రేక్షకులు కూడా అక్రమ లింకుల వైపు మొగ్గు చూపుతున్నారని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ‘ఐ బొమ్మ’, ‘బప్పం’ వెబ్‌సైట్లపై కేసు నమోదు చేశారు. ఈ వెబ్‌సైట్ల నిర్వహకులు ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…