LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Kollywood: సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!

Kollywood: కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన ఆకస్మిక మృతితో శాండల్‌వుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది.

AndhraPravasi News Desk 2 min read
Kollywood: సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత!
  • నటుడిగానే కాకుండా నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా బహుముఖ ప్రజ్ఞ..
     
  • Cinema: ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ గుండెపోటుతో మృతి..

Kollywood: కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, నిర్మాత దిలీప్ రాజ్ (47) ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన ఆకస్మిక మృతితో శాండల్‌వుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, దిలీప్ రాజ్‌కు తీవ్రమైన గుండెపోటు రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయనను బతికించలేకపోయామని వైద్యులు ప్రకటించారు.

పునీత్ రాజ్‌కుమార్‌తో కలిసి నటించిన ‘మిలనా’ (2007) చిత్రంతో దిలీప్ రాజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘యూ-టర్న్’, ‘బాయ్‌ఫ్రెండ్’ వంటి అనేక చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించి మెప్పించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా ఆయన తనదైన ముద్ర వేశారు. జీ కన్నడలో ప్రసారమైన ప్రముఖ సీరియల్ ‘హిట్లర్ కళ్యాణ’లో ప్రధాన పాత్రలో నటించి కన్నడ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.

నటనపై ఆసక్తితో దిలీప్ రాజ్ తొలుత రంగస్థలంపై తన ప్రయాణాన్ని ప్రారంభించారు. నటరంగా, దృష్టి వంటి ప్రముఖ థియేటర్ గ్రూపులతో కలిసి పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయనకు నటి నందిత ప్రోత్సాహంతో టెలివిజన్ రంగంలోలోకి అడుగుపెట్టారు. ‘కంబద మనే’ అనే టెలిఫిల్మ్‌తో ఆయన కెమెరా ముందుకొచ్చారు. ఆ తర్వాత ‘జనని’, ‘అర్ధ సత్య’, ‘కుంకుమ భాగ్య’, ‘మంగళ్య’ వంటి ఎన్నో విజయవంతమైన సీరియళ్ల ద్వారా కన్నడలో ఇంటింటికీ సుపరిచితమయ్యారు.

నటుడిగానే కాకుండా తన డీఆర్ క్రియేషన్స్ పతాకంపై కొన్ని టీవీ సీరియళ్లను కూడా నిర్మించారు. ఆయనలో ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. ‘ఆ దినగళు’ చిత్రంలో నటుడు చేతన్ కుమార్‌కు ఆయన చెప్పిన డబ్బింగ్ మంచి ప్రశంసలు అందుకుంది. తన కెరీర్‌లో 24కు పైగా చిత్రాల్లో నటించిన దిలీప్ రాజ్, సినిమా, టీవీ రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ రంగస్థలాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. విలక్షణమైన, సహజమైన పాత్రలతో బుల్లితెరపై అత్యంత నమ్మకమైన నటులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న దిలీప్ రాజ్ మరణం కన్నడ పరిశ్రమకు తీరని లోటు.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…