కేంద్రానికి చిరంజీవి లేఖ.. ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టాలని విజ్ఞప్తి!
Chiranjeevi Letter to Kishan Reddy: ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్ వినియోగం పెరుగుతుండటంపై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. వీటి కారణంగా సినీ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా వ్యక్తిగత గోప్యత, ప్రతిష్ఠకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, నకిలీ డిజిటల్ గుర్తింపుల సృష్టిని అడ్డుకునేందుకు కఠినమైన నియంత్రణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే.. దాని తప్పుడు వినియోగం వల్ల ఎవరికీ నష్టం కలగకుండా పటిష్ఠమైన డిజిటల్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- డీప్‌ఫేక్‌లు, ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి చిరంజీవి వినతిపత్రం.
- అమిత్ షా సూచనల మేరకు డిజిటల్ భద్రత, వ్యక్తిగత గౌరవం పరిరక్షణపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన మెగాస్టార్.
Chiranjeevi Letter to Kishan Reddy: ఏఐ ఆధారిత నకిలీ వీడియోలు, డీప్‌ఫేక్ కంటెంట్ వినియోగం పెరుగుతుండటంపై మెగాస్టార్ చిరంజీవి ఆందోళన వ్యక్తం చేశారు. వీటి కారణంగా సినీ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా వ్యక్తిగత గోప్యత, ప్రతిష్ఠకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం, నకిలీ డిజిటల్ గుర్తింపుల సృష్టిని అడ్డుకునేందుకు కఠినమైన నియంత్రణ చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. సాంకేతికత అభివృద్ధిని ప్రోత్సహిస్తూనే.. దాని తప్పుడు వినియోగం వల్ల ఎవరికీ నష్టం కలగకుండా పటిష్ఠమైన డిజిటల్ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కిషన్ రెడ్డికి వినతిపత్రం
ఏఐ సాంకేతికత దుర్వినియోగాన్ని అరికట్టేందుకు మరింత పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని చిరంజీవి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచన మేరకు ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. డీప్‌ఫేక్‌లు, డిజిటల్ నకిలీ గుర్తింపుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేలా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అమిత్ షాతోనూ చర్చించిన చిరంజీవి
ఈ నెల 2న హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ కలిసి సమావేశమయ్యారు. ఆ సమయంలో డీప్‌ఫేక్ టెక్నాలజీ వల్ల ఎదురవుతున్న ముప్పులపై చర్చించినట్లు చిరంజీవి తెలిపారు. ఈ సమస్యపై సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటామని హామీ ఇచ్చిన కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
సాంకేతికత దుర్వినియోగం కాకూడదు
ఏఐని సృజనాత్మక ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని ప్రోత్సహించాల్సిందేనని చిరంజీవి అభిప్రాయపడ్డారు. అయితే అదే సమయంలో వ్యక్తుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని సూచించారు. ఈ సమస్య కేవలం సినీ ప్రముఖులకే పరిమితం కాదని, సామాన్య పౌరుల డిజిటల్ భద్రతకు కూడా ముప్పుగా మారుతోందని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరి గోప్యత, గౌరవం, డిజిటల్ భద్రతను కాపాడటం సమాజంలోని అందరి బాధ్యత అని చిరంజీవి తన ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు
Be the first to react