LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Entertainment

Inspiring Director Stories: ఐరన్ లెగ్' అన్న నోళ్లే జై కొడుతున్నాయి..మూడే సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు..!

Inspiring Director Stories: కేవలం మూడు సినిమాలతోనే భారత చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్. 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' నుండి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'దురందర్' వరకు ఆయన ఎదుర్కొన్న అవమానాలు, కష్టాలు సాధించిన విజయాలు

AndhraPravasi News Desk 2 min read
Inspiring Director Stories: ఐరన్ లెగ్' అన్న నోళ్లే జై కొడుతున్నాయి..మూడే సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు..!

Inspiring Director Stories: సినిమా రంగంలో వంద సినిమాలు తీసిన దర్శకులకు కూడా దక్కనంత పేరు, బాక్సాఫీస్ రికార్డులు కేవలం మూడు సినిమాలతోనే సొంతం చేసుకున్నాడు ఆ యువ దర్శకుడు. ప్రస్తుతం భారత చిత్ర పరిశ్రమలో ఎక్కడ చూసినా ఆయన పేరే మారుమోగుతోంది. ఆయనే 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' ఫేమ్ ఆదిత్య ధర్. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన 'దురందర్' పార్ట్ 1, పార్ట్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఒకప్పుడు అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగితే 'నీకు ఛాన్స్ లేదు పో' అని గెంటేసిన వాళ్లే, ఈరోజు ఆయన డేట్స్ కోసం క్యూ కడుతున్నారంటే అది ఆదిత్య ధర్  పట్టుదలకు నిదర్శనం.

1983లో ఢిల్లీలోని ఒక కాశ్మీరీ పండిట్ కుటుంబంలో జన్మించిన ఆదిత్యకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చి. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, కళ్ల నిండా కలలతో 2006లో ముంబైలో అడుగుపెట్టాడు. అక్కడ ఆయన పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. బతకడం కోసం రేడియో జాకీగా పనిచేస్తూనే, అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశాల కోసం తిరిగేవాడు. చివరకు విధు వినోద్ చోప్రా, విశాల్ భరద్వాజ్ వంటి దిగ్గజాల దగ్గర మెలుకువలు నేర్చుకున్నాడు. అప్పట్లో తక్కువ జీతంతో సరిపెట్టుకుంటూ, అదనపు ఆదాయం కోసం సినిమాలకు పాటలు, డైలాగులు కూడా రాసేవాడు. ఎంత రాసినా ఆయన లక్ష్యం మాత్రం ఎప్పుడూ మెగాఫోన్ పట్టుకోవడమే.

ఆదిత్య దర్శకుడిగా మారే క్రమంలో ఎదుర్కొన్న దెబ్బలుఎవరినైనా కుంగదీస్తాయి . 2016లో కత్రినా కైఫ్, ఫవాద్ ఖాన్ తో 'రాత్ బాకీ' అనే సినిమా మొదలుపెట్టాడు. కానీ సరిగ్గా షూటింగ్ సమయానికి ఉరి ఉగ్రదాడి జరగడం, పాకిస్థాన్ నటులపై నిషేధం విధించడంతో ఆ సినిమా ఆగిపోయింది. అందరూ ఆయన్ని 'ఐరన్ లెగ్' అని ఎగతాళి చేశారు. కానీ వాళ్ళ అమ్మ చెప్పిన ఒకే ఒక్క మాట— "దేవుడు నీకోసం ఏదో పెద్ద విజయాన్ని రాసిపెట్టాడు"— ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అదే సమయంలో జరిగిన భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్‌ను సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ సినిమా కోసం ఆదిత్య పడ్డ కష్టం అసాధారణం. ఏకంగా 50 మంది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లను రహస్యంగా కలిసి సమాచారం సేకరించాడు. నిర్మాత అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్‌ను పెడదామన్నా, ఆదిత్య మాత్రం 10 కోట్ల మార్కెట్ ఉన్న విక్కీ కౌశల్ వైపు నిలబడ్డాడు. "నాకు స్టార్ డమ్ వద్దు, పాత్ర కోసం రక్తం ధారపోసే డెడికేషన్ కావాలి" అని పట్టుబట్టి 'ఉరి' తీశాడు. ఫలితం... దేశవ్యాప్తంగా 'హౌ ఈజ్ ద జోష్' అనే నినాదం మార్మోగింది. వందల కోట్ల వసూళ్లతో పాటు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితంలోనూ ఆదిత్య ఎంతో హుందాగా ఉంటారు. 'ఉరి' సినిమా సమయంలో పరిచయమైన నటి యామీ గౌతమ్‌ను 2021లో పెళ్లాడారు. తెలుగు ప్రేక్షకులకు 'గౌరవం', 'యుద్ధం' వంటి సినిమాలతో సుపరిచితురాలైన యామీ, పెళ్లి తర్వాత కూడా 'దురందర్' వంటి సినిమాలతో తన సత్తా చాటుతోంది. అవకాశాల కోసం వీధుల్లో తిరిగిన ఒక సామాన్య యువకుడు, ఈరోజు ఇండియాలో నంబర్ వన్ డైరెక్టర్లలో ఒకరిగా ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని ఆదిత్య ధర్ మరోసారి నిరూపించారు.

Be the first to react

More Coverage

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: జార్జ్‌కుట్టి ట్విస్టులు ఇక ఇంట్లోనే.. ‘దృశ్యం 3’ అఫీషియల్ ఓటీటీ డేట్ ఫిక్స్! స్ట్రీమింగ్ ఎక్కడ? ఎప్పుడు?

Drishyam 3: మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌ నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ ఓటీటీ విడుదల తేద…

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: ఒకప్పుడు టాయిలెట్ దగ్గర పేపర్లు పరుచుకుని పడుకున్నా.. ఇప్పుడు వందే భారత్‌లో.. సోనూ సూద్ భావోద్వేగం!

Sonu Sood: నటుడు సోనూ సూద్ ఇటీవల వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించారు. ఈ ఆధునిక రైలు ప్రయాణం ఆయనన…