LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

Study Abroad: ఇంటర్ తర్వాత ఫారిన్ వెళ్లాలనుకుంటున్నారా? టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే!

Study Abroad: 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ తర్వాత విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం ముఖ్యమైన సమాచారం. ఐఈఎల్టీఎస్ (IELTS), టోఫెల్ (TOEFL), ఎస్ఏటీ (SAT) వంటి ప్రవేశ పరీక్షల ప్రాధాన్యత అడ్మిషన్ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు..

AndhraPravasi News Desk 2 min read
Study Abroad: ఇంటర్ తర్వాత ఫారిన్ వెళ్లాలనుకుంటున్నారా? టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే!

Abroad Entrance Exams: ఇంటర్మీడియట్  పూర్తి కాగానే చాలామంది విద్యార్థులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్లాలని అనుకుంటారు. కొత్త సంస్కృతులను చూడటమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న డిగ్రీని పొందాలనేది చాలామంది విద్యార్థుల కల. అయితే, విదేశాల్లోని మంచి యూనివర్సిటీల్లో సీటు సాధించడం కేవలం మార్కులతోనే సాధ్యం కాదు. దీనికోసం ఒక పక్కా ప్లానింగ్, సరైన ప్రవేశ పరీక్షల అవగాహన ఉండటం చాలా ముఖ్యం.

అడ్మిషన్ ప్రక్రియలో మీ మార్కులతో పాటు మీ వ్యక్తిత్వం, ప్రతిభను వివరించే ప్రొఫైల్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సరైన ప్లానింగ్ ఉంటే ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో చదువుకోవడం కష్టమేమీ కాదు మీ అకడమిక్ ప్రతిభతో పాటు మీ కమ్యూనికేషన్ స్కిల్స్  లాజికల్ థింకింగ్‌ను కూడా గమనిస్తాయి. అందుకే అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా కొన్ని రకాల ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం తప్పనిసరి. మీరు ఎంచుకునే దేశం, కోర్సును బట్టి ఈ పరీక్షలు మారుతూ ఉంటాయి.

ముఖ్యంగా అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి ఇంగ్లీష్ మాట్లాడే దేశాలకు వెళ్లాలనుకునే వారు ముందుగా 'భాషా నైపుణ్య పరీక్షల'పై దృష్టి పెట్టాలి. వీటిలో ఐఈఎల్టీఎస్ (IELTS), టోఫెల్ (TOEFL) వంటివి ప్రధానమైనవి. ఈ పరీక్షలు మీరు ఇంగ్లీష్‌ను ఎంత బాగా చదవగలరు, రాయగలరు  మాట్లాడగలరు అనే అంశాలను అంచనా వేస్తాయి. ఈ స్కోరు బాగుంటేనే విదేశాల్లో పాఠాలు అర్థం చేసుకోవడం మీకు సులభం అవుతుందని అక్కడి యాజమాన్యాలు నమ్ముతాయి.

ఇక డిగ్రీ  కోర్సుల విషయానికి వస్తే.. ఎస్ఏటీ (SAT) లేదా ఏసీటీ (ACT) పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇవి మీలోని మ్యాథ్స్  ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తాయి. మీరు ఒకవేళ మేనేజ్మెంట్ లేదా బిజినెస్ కోర్సులు చేయాలనుకుంటే కొన్నిసార్లు జీమ్యాట్ (GMAT) వంటి పరీక్షల అవసరం పడవచ్చు. అలాగే మెడిసిన్ లేదా లా వంటి వృత్తి విద్యా కోర్సుల కోసం ఆయా దేశాలు నిర్వహించే ప్రత్యేక పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

విదేశీ అడ్మిషన్ ప్రక్రియలో కేవలం పరీక్షలే కాకుండా, మీ ప్రొఫైల్ కూడా బలంగా ఉండాలి. మీరు గతంలో సాధించిన విజయాలు, సామాజిక సేవలు,  మీ లక్ష్యాలను వివరించే 'స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్' (SOP) వంటివి అడ్మిషన్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి, 12వ తరగతి నుంచే సరైన కోచింగ్ తీసుకుంటూ, ముందుగానే దరఖాస్తు చేసుకోవడం ద్వారా మీరు అనుకున్న విదేశీ విద్య కలని నిజం చేసుకోవచ్చు.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…