LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్!

NEET UG: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న పూణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు.

AndhraPravasi News Desk 1 min read
NEET UG: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ కీలక చర్యలు! కెమిస్ట్రీ లెక్చరర్ అరెస్ట్!

పూణేలో నీట్ లీక్ మాస్టర్‌మైండ్ అరెస్ట్..

దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. కీలక ఆధారాల స్వాధీనం..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న పూణేకు చెందిన కెమిస్ట్రీ లెక్చరర్ పి.వి. కులకర్ణిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరఫున పరీక్షల నిర్వహణ ప్రక్రియలో భాగమైన ఆయనకు ప్రశ్నాపత్రాలకు ఆకెస్స్ ఉండేదని సీబీఐ వెల్లడించింది.

గత 24 గంటల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కులకర్ణిని పూణేలో అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన ఇద్దరు నిందితులను పూణే కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్ తీసుకునేందుకు సీబీఐ చర్యలు చేపట్టింది. అనంతరం వారిని ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచారం. అంతకుముందు అరెస్టైన ఐదుగురు నిందితుల్లో ముగ్గురు జైపూర్‌కు చెందినవారు కాగా, ఒకరు గురుగ్రామ్‌, మరొకరు నాసిక్‌కు చెందినవారని అధికారులు తెలిపారు.

ఈ ఐదుగురిని ఢిల్లీలోని సంబంధిత కోర్టులో హాజరుపరచగా, కోర్టు వారిని ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ప్రస్తుతం వారిని సీబీఐ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి పలువురు అనుమానితులను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

నీట్-యూజీ 2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్‌కు సంబంధించిన ఆరోపణలపై విద్యాశాఖ పరిధిలోని ఉన్నత విద్యా విభాగం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 12న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ చేపడుతున్నామని సీబీఐ స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ ఘటనపై తల్లిదండ్రులు, విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పరీక్షల విశ్వసనీయతపై మచ్చపడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…