Tirumala: తిరుమలలో భారీ భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 20–22 గంటల నిరీక్షణ!
Tirumala: శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయంలో రద్దీ మరింత పెరిగింది. ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూ శిలాతోరణం వరకు కొనసాగుతోంది.
తిరుమలలో భారీ రద్దీ.. ఒక్కరోజులో 77,502 మంది భక్తులకు శ్రీవారి దర్శనం..
శ్రీవారి హుండీకి రూ.5.46 కోట్ల ఆదాయం.. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
తిరుమల: శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయంలో రద్దీ మరింత పెరిగింది. ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూ శిలాతోరణం వరకు కొనసాగుతోంది.
టీటీడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనం కోసం క్యూలో చేరిన భక్తులకు స్వామివారి దర్శనం పొందేందుకు సుమారు 20 నుంచి 22 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్రదర్శనం) ద్వారా వచ్చే భక్తులకు 3 నుంచి 5 గంటల వ్యవధిలో దర్శనం కల్పిస్తున్నారు.
బుధవారం మొత్తం 77,502 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 34,485 మంది భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ తలనీలాలు సమర్పించారు. భక్తుల నుంచి హుండీ ద్వారా రూ.5.46 కోట్ల ఆదాయం లభించినట్లు టీటీడీ వెల్లడించింది.
శ్రీవారి ప్రసాదమైన లడ్డూలకు కూడా భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 4.24 లక్షల లడ్డూలు విక్రయించగా, అన్నప్రసాద కేంద్రాల్లో 2.50 లక్షల మంది భక్తులు ఉచిత భోజనాన్ని స్వీకరించారు. ఆలయ వైద్య సేవలను 2,926 మంది భక్తులు వినియోగించుకున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రావణ మాసం సందర్భంగా తిరుమలకు భక్తుల రాక మరింత పెరుగుతున్న నేపథ్యంలో, దర్శనానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. రద్దీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేసుకుని రావాలని, అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
Tags
Be the first to react