US Student Visa: అమెరికా స్టూడెంట్ వీసాల్లో భారీ కోత... చైనా కంటే భారత్‌పైనే తీవ్ర ప్రభావం!

US Student Visa: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం విడుదల చేస్తున్న ఎఫ్-1 (F-1) స్టూడెంట్ వీసాల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

స్టూడెంట్ వీసాల్లో భారీ కోత
స్టూడెంట్ వీసాల్లో భారీ కోత

విదేశీ విద్యార్థుల వీసాలపై ఆందోళనకర నిజాలు...

యుఎస్ ఎఫ్-1 (F-1) వీసాల్లో 62 శాతం క్షీణత...

పీక్ సీజన్‌లో కుదేలైన భారతీయ విద్యార్థుల వీసా సంఖ్య...

US Student Visa: అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావిస్తున్న భారతీయ విద్యార్థులకు ఊహించని షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం విడుదల చేస్తున్న ఎఫ్-1 (F-1) స్టూడెంట్ వీసాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. అమెరికాలోని 'సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్' (CIS) రూపొందించిన నివేదిక ప్రకారం, ప్రధాన పోటీదారు అయిన చైనాతో పోలిస్తే భారతీయ విద్యార్థుల వీసాల నిష్పత్తిలోనే అత్యధికంగా కోత పడినట్లు తేలింది.

మే-ఆగస్టు పీక్ సీజన్‌లో 62 శాతం పతనం: సాధారణంగా మే నుంచి ఆగస్టు వరకు ఉండే నాలుగు నెలల కాలం విదేశీ విద్యార్థులకు అత్యంత కీలకమైనది. అమెరికాలో కొత్త విద్యా సంవత్సరం (Fall Intake) ప్రారంభమయ్యే ముందు ఎక్కువ శాతం వీసాలు ఈ సమయంలోనే జారీ అవుతుంటాయి. అయితే, గత ఏడాది (2024) మే-ఆగస్టు మధ్య భారతీయ విద్యార్థులకు 58,694 ఎఫ్-1 వీసాలు లభించగా, ఈ ఏడాది అదే కాలంలో కేవలం 22,149 వీసాలు మాత్రమే లభించాయి. అంటే ఒక్కసారిగా 62 శాతం మేర వీసాల జారీ పడిపోయింది. చైనా విషయానికి వస్తే ఈ తగ్గుదల 34 శాతంగా నమోదైంది.

అమెరికా కఠిన ఆంక్షలే కారణమా?: అమెరికా ప్రభుత్వం చేపడుతున్న కఠిన ఇమ్మిగ్రేషన్ విధానాలు, ఆంక్షలు మరియు పటిష్టమైన స్క్రూటినీ విధానాలే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. విద్యార్థుల స్టే కాలవ్యవధిపై పరిమితులు విధించడం, వీసా దరఖాస్తుల పరిశీలనను మరింత కఠినతరం చేయడం వంటి చర్యలతో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. గత కొన్నేళ్లుగా అమెరికా అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులే అగ్రస్థానంలో నిలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం యూఎస్ వర్సిటీల్లో 3.6 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు చదువుతున్నారు.

ఓపిటి (OPT), ఉద్యోగావకాశాలపై పడనున్న తీవ్ర ప్రభావం: చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉండి ఉద్యోగ అనుభవం పొందేందుకు 'ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్' (OPT) ప్రోగ్రామ్ ఎంతో కీలకం. విదేశీ గ్రాడ్యుయేట్లలో దాదాపు సగం మంది భారతీయ విద్యార్థులే ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఎఫ్-1 వీసాల సంఖ్య తగ్గడంతో భవిష్యత్తులో ఓపిటి ప్రోగ్రామ్‌కు అర్హత సాధించే భారతీయుల సంఖ్యతో పాటు, ఆ తర్వాత హెచ్-1బీ (H-1B) వర్క్ వీసాలు పొందే అవకాశాలు కూడా క్రమంగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags

Be the first to react

Latest