TTD Updates: తిరుమలలో పోటెత్తిన భక్తులు.. కలియుగ వైకుంఠంలో ఊహించని రీతిలో పెరిగిన భక్తుల జనసందోహం..
TTD Updates: కలియుగ వైకుంఠం తిరుమల గిరులు భక్తుల జనసందోహంతో పోటెత్తుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.
- భక్తులతో నిండిపోయిన క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు..
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,172 మంది భక్తులు..
TTD Updates: కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులు భక్తుల జనసందోహంతో పోటెత్తుతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో తిరుమాడ వీధులు, క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోవడంతో, వెలుపల కూడా క్యూలైన్లు సుదీర్ఘంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఎలాంటి టైమ్ స్లాట్ దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) లభించడానికి దాదాపు 18 గంటల సుదీర్ఘ సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులు, ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా మంచినీరు, పాలు, కాఫీతో పాటు అన్నప్రసాదాలను క్యూలైన్లలోనే భక్తులకు పంపిణీ చేస్తున్నారు. కాగా, నిన్న ఒక్కరోజే మొత్తం 82,172 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని తరించగా, వారిలో 36,978 మంది భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఈ స్థాయిలో పెరగడంతో స్వామివారి హుండీ కానుకల ఆదాయం కూడా భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా లభించిన కానుకల ఆదాయం ఏకంగా రూ. 5.15 కోట్లుగా నమోదైనట్లు టీటీడీ అధికారులు అధికారికంగా ప్రకటించారు.
Tags
Be the first to react
