Women Commission: ఉజ్బెకిస్థాన్‌లో కేరళ వైద్య విద్యార్థిని హత్య.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్!
Women Commission: ఉజ్బెకిస్థాన్‌లో వైద్య విద్యను అభ్యసిస్తున్న కేరళకు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని హత్యకు గురైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) కీలకంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్, విద్యార్థిని మరణానికి ముందు ఆమెపై శారీరక దాడులు, వేధింపులు, బలవంతపు మతమార్పిడికి ప్రయత్నించినట్లు వస్తున్న ఆరోపణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఉజ్బెకిస్థాన్ ఘటనపై ఎన్సీడబ్ల్యూ సీరియస్.. 7 రోజుల్లో నివేదిక కోరింది..
కేరళ విద్యార్థిని మృతి కేసు.. విదేశాంగ శాఖ, భారత రాయబార కార్యాలయంతో సమన్వయానికి సూచనలు..
ఉజ్బెకిస్థాన్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న కేరళకు చెందిన 21 ఏళ్ల విద్యార్థిని హత్యకు గురైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) కీలకంగా స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన కమిషన్, విద్యార్థిని మరణానికి ముందు ఆమెపై శారీరక దాడులు, వేధింపులు, బలవంతపు మతమార్పిడికి ప్రయత్నించినట్లు వస్తున్న ఆరోపణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
వేగవంతమైన దర్యాప్తుకు ఆదేశాలు
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కేరళ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కు లేఖ రాసింది. కేసు విచారణను వేగవంతం చేయడంతో పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖ, తాష్కెంట్లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని సూచించింది.
దర్యాప్తుకు అవసరమైన అన్ని ఆధారాలను భద్రపరచాలని, కేసు న్యాయపరమైన విచారణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. అలాగే బాధితురాలి కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహాయం అందించాలని కూడా అధికారులను కోరింది.
ఈ కేసులో ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై ఏడు రోజుల్లోగా చర్యల నివేదిక (Action Taken Report) సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ కేరళ డీజీపీని ఆదేశించింది. దర్యాప్తు పురోగతిపై కమిషన్ నిరంతరం పర్యవేక్షణ కొనసాగించనున్నట్లు తెలిపింది.
భారత రాయబార కార్యాలయానికి విజ్ఞప్తి
ఉజ్బెకిస్థాన్లోని భారత రాయబారిని కూడా జాతీయ మహిళా కమిషన్ సంప్రదించింది. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు స్థానిక అధికారులతో సమన్వయం చేసి న్యాయ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని కోరింది.
విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత మరోసారి చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని సంస్థలు కలిసి పనిచేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Tags
Be the first to react