Tirumala: తిరుమలలో భారీగా  భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 18 గంటల సమయం!

Tirumala: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (జూలై 9) ఉదయం తిరుమలలోని అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు చేరింది. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఓపికగా తమ వంతు కోసం వేచి చూస్తున్నారు.

Tirumala
Tirumala

శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్.. తిరుమలలో భారీ రద్దీ..

ఒక్కరోజులో 82 వేల మందికి పైగా శ్రీవారి దర్శనం..

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం (జూలై 9) ఉదయం తిరుమలలోని అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకు చేరింది. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఓపికగా తమ వంతు కోసం వేచి చూస్తున్నారు.

టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సుమారు 18 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (శీఘ్ర దర్శనం) ద్వారా వెళ్లే భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనం పూర్తవుతోంది. ఇక సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5 నుంచి 7 గంటలలో స్వామివారి దర్శనం లభిస్తోంది.

బుధవారం ఒక్కరోజే 82,172 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 36,978 మంది తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అదే రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.15 కోట్లకు చేరడం విశేషం.

లడ్డూ ప్రసాదాలకు కూడా భక్తుల నుంచి భారీ స్పందన కనిపించింది. ఒక్కరోజులోనే 4.25 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.57 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించారు. అలాగే తిరుమలలోని వైద్య సేవలను 3,234 మంది భక్తులు వినియోగించుకున్నారు.

వేసవి సెలవులు ముగిసినా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గకపోవడంతో, దర్శనానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. భక్తులకు దర్శనం, వసతి, అన్నప్రసాదం, వైద్య సేవలు వంటి అన్ని సౌకర్యాలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.

Tags

Be the first to react

Latest