Weather Report: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం! ఏపీలో ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

2026-01-08 08:19:00
పోలవరం.. ఏపీ జీవనాడి! అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్‌ఫుల్ స్పీచ్! ఫిబ్రవరి 15 నాటికి..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండం (Cyclone) గా మారిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వాయుగుండం గురువారం నాటికి తీవ్ర వాయుగుండం (Severe Cyclonic Storm) గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం! అది జరగదు.. జరగనివ్వం!

ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (AP Disaster Management) స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉద్యోగస్తుల కోసం కొత్త ఎలక్ట్రిక్ కారు.. ఒక్కసారి చార్జ్ చేస్తే.. ఆఫీస్, షాపింగ్, చిన్న ట్రిప్ అన్నీ కవర్! అదిరిపోయే రేంజ్, ఫీచర్లు!

ఇదే సమయంలో శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ వాయుగుండం ప్రధానంగా తమిళనాడు తీరం వైపు కదులుతుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం పరిమితంగా ఉండొచ్చని తెలిపారు.

Relians: రిలయన్స్ స్కాలర్‌షిప్‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా..! 1,883 మందికి ఎంపిక!

వర్షాల సూచన నేపథ్యంలో రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఉన్న చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండగా, కొన్ని చోట్ల ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కనిపించే అవకాశముందని తెలిపారు. ఉష్ణోగ్రతలు కొంత పెరగడంతో చిన్నారులు, వృద్ధులకు ఉపశమనం లభించవచ్చని చెప్పారు.

Delhi: కాలుష్యంతో కుదేలైన ఢిల్లీ… మరో రాజధాని అవసరమా!

మరోవైపు ఈ వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైతో పాటు తీరప్రాంతాలకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు. ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అక్కడి అధికారులు సూచించారు.

job recruitment: మహిళలకు శుభవార్త… KGBVల్లో భారీ ఉద్యోగ భర్తీ!
Zoo Park: ఏపీలో కొత్తగా జూపార్క్! 250 హెక్టార్లలో... అక్కడే ఫిక్స్!
Tollywood Movie: ఆ సినిమా టికెట్ ధర భారీగా పెంపు.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
Praja Vedika: నేడు (8/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Europe Relations: 2026లో కొత్త ఎత్తులకు భారత్.. లక్సెంబర్గ్ వేదికగా జైశంకర్ కీలక ప్రకటన!!

Spotlight

Read More →