AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Swachh Andhra: స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఇక వాటికి కూడా డబ్బులు..! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…! Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! CM Alert: జనవరి నుంచి జిల్లాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు…! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..! AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Swachh Andhra: స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఇక వాటికి కూడా డబ్బులు..! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…! Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! CM Alert: జనవరి నుంచి జిల్లాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు…! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!

Swachh Andhra: స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఇక వాటికి కూడా డబ్బులు..!

2025-12-20 17:29:00
Thaman: సౌండ్ సిస్టమ్ మార్చలేదు.. థియేటర్ల యాజమాన్యాలే బాధ్యత.. తమన్!


ఆంధ్రప్రదేశ్‌ను 2026 జూన్ నాటికి పూర్తిగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శనివారం అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే రాష్ట్రాన్ని శుభ్రమైన, ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దగలమని చెప్పారు.

AP Survey: ఏపీలో నెలరోజుల మెగా సర్వే…! 38 ప్రశ్నలతో... చేయించుకోకపోతే పథకాలు మిస్!

గత వైసీపీ ప్రభుత్వం వదిలివెళ్లిన సుమారు 86 లక్షల టన్నుల చెత్తను ఇప్పటికే తొలగించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాటికి రాష్ట్రంలోని రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం చూపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

విమాన ప్రయాణం.. ఒక తీరని వేదన! గంటల కొద్దీ ఆలస్యం.. విమానంలోనుంచి కిందకు దూకిన ప్రయాణీకులు!

ఇదే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ రథం కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. స్వచ్ఛ రథాల ద్వారా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్నామని, చెత్తకు బదులుగా అవసరమైన సరుకులను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును మొదట ప్రయోగాత్మకంగా ప్రారంభించగా ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో ప్రస్తుతం 26 ప్రాంతాల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

AP New Highway: మాస్టర్ ప్లాన్.. ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే! 446 కిలోమీటర్ల - ఈ రూట్ లో.. భూముల ధరలకు రెక్కలు!

ఇళ్లలోని పొడి చెత్తను రోడ్లపై వేయకూడదని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. పొడి చెత్తకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ప్రకటించారు. రోడ్లు మనవేననే భావనతో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఇంట్లోనే చెత్తను కంపోస్ట్‌గా మార్చుకోవాలని, రాబోయే రోజుల్లో పట్టణాల్లో 5 లక్షల ఇళ్లు, గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం తాళ్లపాలెంలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన సీఎం చంద్రబాబు, ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత, పాఠశాల పరిసరాల శుభ్రతను స్వయంగా పరిశీలించారు.
 

OTT Releases: వీకెండ్ వినోదం.. ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల.. ఈ వారం స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!
ఇంటర్వ్యూతో ఆర్బీఐలో ఉద్యోగాలు - 93 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.! లక్షల్లో జీతభత్యాలు - పూర్తి వివరాలివే!
Putins press: పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ప్రేమ ఘట్టం.. లవ్ ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్!
BJP: బీజేపీలోకి ప్రముఖ హీరోయిన్…! రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ..!
Mallanna devotees: మల్లన్న భక్తులకు శుభవార్త.. స్పర్శ దర్శనాల సమయం పెంపు!
ఏపీ అభివృద్ధికి గ్లోబల్ బూస్ట్.. అమరావతిలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్!

Spotlight

Read More →