AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Swachh Andhra: స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఇక వాటికి కూడా డబ్బులు..! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…! Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! CM Alert: జనవరి నుంచి జిల్లాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు…! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..! AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Swachh Andhra: స్వచ్ఛాంధ్రపై సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..! ఇక వాటికి కూడా డబ్బులు..! Delhi Meet: బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో సీఎం చంద్రబాబు భేటీ..! ఎన్డీయే భవిష్యత్‌పై ఫోకస్! Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…! Delhi: మరోసారి ఢిల్లీకి చంద్రబాబు..! కీలక ప్రాజెక్టులపై ఫోకస్! Swarnandhra: 2047 విజన్ రివీల్…! పది సూత్రాలతో.. స్వర్ణ ఆంధ్ర దిశగా కీలక అడుగులు! CM Alert: జనవరి నుంచి జిల్లాల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు…! కలెక్టర్లకు కీలక ఆదేశాలు..!

Chandrababu: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ..! నీటి భద్రతే లక్ష్యం…!

2025-12-19 12:42:00
Festival Season Trains: పండక్కి ఇంటికి వెళ్తున్నారా? విజయవాడ మచిలీపట్నం స్పెషల్ ట్రైన్స్ టైమింగ్స్ చూశారా?


ఆంధ్రప్రదేశ్ సాగునీటి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులపై పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఆయన ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టుతో పాటు జల్ జీవన్ మిషన్, పీఎం కృషి సించాయి యోజన, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులు ఆలస్యం కాకుండా మంజూరు చేయాలని సీఎం కేంద్రాన్ని కోరారు.

వాతావరణ శాఖ సైరెన్.. రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు.! ఇదిగో ఈ ప్రాంతాల్లో..

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటి భద్రత అత్యంత కీలకమని, సాగునీటి ప్రాజెక్టులే రైతుల జీవనాధారమని వివరించారు. జల్ జీవన్ మిషన్ అమలుకు సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరానికి అదనంగా రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని, అలాగే రాష్ట్ర వాటాగా ఇప్పటికే ఖర్చు చేసిన రూ.524.41 కోట్లకు సంబంధించిన కేంద్ర వాటాను తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిరంతరంగా సాగాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి అని సీఎం వివరించారు.

Bigg boss: అంచనాలను తలకిందులు చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9... గ్రాండ్ ఫినాలేకు మెగా ట్విస్ట్... చీఫ్ గెస్ట్‌గా!

పోలవరం జాతీయ ప్రాజెక్టు పురోగతిపై కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి సమగ్రంగా వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని కీలక అనుమతులు ఇంకా పెండింగ్‌లో ఉండటం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. రెండో దశ పనులకు అవసరమైన నిధులపై త్వరలోనే పూర్తి స్థాయి నివేదిక సమర్పిస్తామని, ఆ తర్వాత కేంద్రం నుంచి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరారు. అలాగే వంశధార ట్రైబ్యునల్ తీర్పును అమలు చేసి, శ్రీకాకుళం జిల్లా కరవు ప్రాంతాలకు జీవనాడిగా మారనున్న నేరడి బ్యారేజీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

AP Welfare Schemes: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లో డబ్బులు ఎప్పుడు పడతాయో ముందే తెలుసుకోండిలా!

అంతేకాకుండా ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు అంశంపై కూడా సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నప్పటికీ, కర్ణాటక ప్రభుత్వం ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించే అంశమని, కేంద్రం జోక్యం చేసుకుని ఈ చర్యలను నిలువరించాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదని, రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని సీఎం చంద్రబాబు మరోసారి తేల్చిచెప్పారు.
 

Pension Update: ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్…! జిల్లాకు 200 చొప్పున మంజూరు..!
Pakistani begging: గల్ఫ్ దేశాల్లో పాక్ భిక్షాటనకు చెక్.. భారీ స్థాయిలో బహిష్కరణలు!
FLAG సిస్టమ్ ప్రభావం.. అథ్లెట్ల I-140 వీసాలకు కొత్త షరతులు! ఇక నుండి అవి తప్పనిసరి!
Meesho: UBS గ్రీన్ సిగ్నల్‌తో మీషో షేర్ దూకుడు…! లక్ష్య ధర దాటేశింది!
Nara Lokesh: రాజమహేంద్రవరంలో మంత్రి లోకేశ్‌ పర్యటన..! కార్యకర్తలతో భేటీ…!
Jani Master: వాళ్లిద్దరి మధ్య విభేదాలు... తేల్చి చెప్పేసిన జానీ మాస్టర్!

Spotlight

Read More →