Film Chamber: ఐ బొమ్మ, బప్పంపై మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు! Tollywood Heronie: బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడి.. యువతకు ప్రేమ పాఠాలు చెప్తున్న హీరోయిన్! ప్రేమ అనేది ఒక్కసారే కాదు.. Peddhi Movie: ఆ చివరి 50 నిమిషాలు గుండె బరువెక్కుతుంది.. 'పెద్ది' క్లైమాక్స్‌పై బుచ్చిబాబు సనా షాకింగ్ కామెంట్స్! Ram Charan: 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా? దేశవ్యాప్తంగా 8 నగరాల్లో... Rashmika: డూప్ లేకుండా డేరింగ్ స్టంట్.. రష్మిక అంకితభావానికి ఫిదా అవుతున్న సినీ వర్గాలు! 9 మిలియన్లకు పైగా లైక్స్‌తో.. Tollywood: టాలీవుడ్‌లో 'పెద్ది' సెగ: నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు.. ముదురుతున్న పర్సంటేజీ వివాదం! Ram Charan: సౌండ్ ఆఫ్ "పెద్ది" రామ్ చరణ్ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారు! iBomma: మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్ - కొత్త ఓటీటీ కంటెంట్‌పై..! Kollywood: సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత! Drishyam 3: 'దృశ్యం 3'లో బిగ్ ట్విస్ట్: ఈసారి వెంకటేష్ రీమేక్ చేయడం లేదా! Film Chamber: ఐ బొమ్మ, బప్పంపై మరోసారి ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు! Tollywood Heronie: బ్రేకప్ పెయిన్ నుంచి బయటపడి.. యువతకు ప్రేమ పాఠాలు చెప్తున్న హీరోయిన్! ప్రేమ అనేది ఒక్కసారే కాదు.. Peddhi Movie: ఆ చివరి 50 నిమిషాలు గుండె బరువెక్కుతుంది.. 'పెద్ది' క్లైమాక్స్‌పై బుచ్చిబాబు సనా షాకింగ్ కామెంట్స్! Ram Charan: 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ధోనీ వస్తున్నాడా? దేశవ్యాప్తంగా 8 నగరాల్లో... Rashmika: డూప్ లేకుండా డేరింగ్ స్టంట్.. రష్మిక అంకితభావానికి ఫిదా అవుతున్న సినీ వర్గాలు! 9 మిలియన్లకు పైగా లైక్స్‌తో.. Tollywood: టాలీవుడ్‌లో 'పెద్ది' సెగ: నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు.. ముదురుతున్న పర్సంటేజీ వివాదం! Ram Charan: సౌండ్ ఆఫ్ "పెద్ది" రామ్ చరణ్ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారు! iBomma: మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్ - కొత్త ఓటీటీ కంటెంట్‌పై..! Kollywood: సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత! Drishyam 3: 'దృశ్యం 3'లో బిగ్ ట్విస్ట్: ఈసారి వెంకటేష్ రీమేక్ చేయడం లేదా!

Rajinikanth: ఆయన ఆఖరి కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు.. సూపర్ స్టార్ రజనీకాంత్ భావోద్వేగం!

Rajinikanth: ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి ఆకస్మిక మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన తన 100వ సినిమాను తనతోనే తీయాలని అనుకుంటున్నట్టు చెప్పారని, అందుకు తాను అంగీకరించానని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Published : 2026-05-07 14:27:00
  • Cinema: తన 100వ సినిమాలో నటించాలని చౌదరి కోరారని వెల్లడి..
     
  • గొప్ప వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం బాధాకరమని ఆవేదన..

Rajinikanth: ప్రముఖ చలనచిత్ర నిర్మాత ఆర్బీ చౌదరి ఆకస్మిక మరణం సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేయగా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ, తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. సుమారు నాలుగు నెలల క్రితం 'జైలర్ 2' చిత్రీకరణ సమయంలో ఆర్బీ చౌదరి తనను కలిశారని, అప్పటికే 99 సినిమాలు పూర్తి చేసిన ఆయన, తన 100వ మైలురాయి చిత్రాన్ని రజనీకాంత్‌తోనే నిర్మించి చిత్ర పరిశ్రమ నుండి గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలని ఆకాంక్షించారని తెలిపారు. ఆ ప్రతిపాదనకు తాను తక్షణమే అంగీకరిస్తూ నూట శాతం ఆ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చానని, కానీ ఆ కల తీరకుండానే ఆయన కన్నుమూయడం జీర్ణించుకోలేకపోతున్నానని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఆర్బీ చౌదరి వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ, ఆయనతో నేరుగా ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ తమ మధ్య దశాబ్దాల కాలంగా ఎంతో ఆత్మీయమైన స్నేహం ఉందని సూపర్ స్టార్ పేర్కొన్నారు. దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పినట్లుగా, చౌదరి ఎందరో ప్రతిభావంతులైన దర్శకులను, సాంకేతిక నిపుణులను పరిశ్రమకు పరిచయం చేసి, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన గొప్ప మానవతావాది అని రజనీకాంత్ కొనియాడారు. 99 చిత్రాలను నిర్మించిన సుదీర్ఘ ప్రయాణంలో ఆయన ఎప్పుడూ వివాదాలకు తావు ఇవ్వలేదని, ఒకవేళ ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా సంబంధిత వ్యక్తుల వద్దకు వెళ్లి సామరస్యంగా పరిష్కరించుకునే గొప్ప సంస్కారం ఆయన సొంతమని గుర్తుచేసుకున్నారు.

ఎల్లప్పుడూ చిరునవ్వుతో కనిపించే ఆర్బీ చౌదరి అంతటి ప్రశాంతతకు కారణం తన పరిమితులు తనకు తెలియడమేనని గతంలో చెప్పేవారని రజనీ వివరించారు. దేవుడిపై భారం వేసి ఫలితం గురించి ఆందోళన చెందకుండా మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టడం ఆయన విజయరహస్యమని రజనీకాంత్ పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇంతటి మంచి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, చౌదరి కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.

Spotlight

Read More →