RBI Rules: స్మార్ట్‌ఫోన్ ఫైనాన్స్ వినియోగదారులకు బిగ్ అలర్ట్... వాయిదాలు ఎగ్గొడితే ఆర్‌బీఐ కఠిన చర్యలు!

RBI Rules: ఈఎంఐ (EMI) పద్ధతిలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసి నెలవారీ వాయిదాలు చెల్లించని వినియోగదారుల పట్ల ఫైనాన్స్ కంపెనీలు మరియు బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త నిబంధనలను జారీ చేసింది.

వాయిదాలు ఎగ్గొడితే ఆర్‌బీఐ కఠిన చర్యలు
వాయిదాలు ఎగ్గొడితే ఆర్‌బీఐ కఠిన చర్యలు

నెలవారీ వాయిదాలు కట్టకపోతే ఫోన్ బ్లాక్...

ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఇవే...

ఇకపై ఫోన్ ఫైనాన్స్ కంపెనీల దాదాగిరీకి చెక్...

RBI Rules: ఈఎంఐ (EMI) పద్ధతిలో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసి నెలవారీ వాయిదాలు చెల్లించని వినియోగదారుల పట్ల ఫైనాన్స్ కంపెనీలు మరియు బ్యాంకులు అనుసరించాల్సిన విధానాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త నిబంధనలను జారీ చేసింది. సులభ వాయిదాల పద్ధతిలో ఫోన్లు కొనుగోలు చేసే ధోరణి ఇటీవల కాలంలో విపరీతంగా పెరగడం, అదే సమయంలో కొందరు ఇఎంఐలు కట్టకుండా ఎగవేస్తుండటంతో ఆర్‌బీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

రిమోట్ లాకింగ్ సాఫ్ట్‌వేర్‌కు అనుమతి: కొత్త నిబంధనల ప్రకారం, ఫైనాన్స్ కంపెనీలు లేదా బ్యాంకులు ఫోన్ విక్రయించే సమయంలోనే ప్రత్యేకమైన డిజిటల్ లాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఫోన్‌లో ఇన్స్టాల్ చేసేందుకు అనుమతి లభించింది. వినియోగదారుడు నిర్ణీత గడువులోగా ఈఎంఐ చెల్లించడంలో విఫలమైతే, ఫైనాన్స్ సంస్థలు రిమోట్ పద్ధతి ద్వారా సదరు స్మార్ట్‌ఫోన్‌ను పాక్షికంగా లేదా పూర్తిగా లాక్ చేయవచ్చు. దీనివల్ల ఫోన్‌లోని ముఖ్యమైన యాప్‌లు, కాలింగ్ సేవలు పనిచేయకుండా పోతాయి.

వినియోగదారుల భద్రత మరియు హక్కుల పరిరక్షణ: అదే సమయంలో, ఫైనాన్స్ సంస్థలు తమ పరిమితులను దాటకుండా ఆర్‌బీఐ కఠిన షరతులు విధించింది. ఈఎంఐ చెల్లించలేదనే నెపంతో వినియోగదారుడి ఫోన్లోని వ్యక్తిగత డేటా, ఫోటోలు, మెసేజ్‌లు లేదా ఇతర రహస్య సమాచారాన్ని ఫైనాన్స్ కంపెనీలు యాక్సెస్ చేయడానికి లేదా డిలీట్ చేయడానికి వీల్లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కేవలం ఫోన్ వినియోగాన్ని మాత్రమే నియంత్రించేలా సాఫ్ట్‌వేర్ ఉండాలని, డేటా గోప్యతకు భంగం కలగకూడదని ఆదేశించింది.

రికవరీ ఏజెంట్ల వేధింపులకు చెక్: గతంలో ఈఎంఐ బకాయిల కోసం రికవరీ ఏజెంట్లు వినియోగదారులను అసభ్యంగా మాట్లాడటం, వేధించడం వంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో డిజిటల్ పద్ధతిలోనే ఫోన్ సేవలను నిలిపివేసే అవకాశం రావడంతో రికవరీ ఏజెంట్ల ప్రత్యక్ష వేధింపులు తగ్గుతాయని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఫోన్ లాక్ చేసే ముందు వినియోగదారుడికి నోటిఫికేషన్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా తగినంత సమయం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈఎంఐ బకాయి మొత్తం చెల్లించిన వెంటనే ఆటోమేటిక్‌గా ఫోన్ అన్‌లాక్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌బీఐ తెలిపింది.

Tags

Be the first to react

Latest