JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ! JanaSena FormationDay: గిరిజన గడ్డపై జనసేన ఆవిర్భావ వేడుకలు! అల్లూరి జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్! Chandrababu Naidu: నేనూ రైతు బిడ్డనే, మీ కష్టాలు నాకు తెలుసు! అన్నదాతలకు చంద్రబాబు భరోసా...! APSP Promotions: ఏపీఎస్పీ సిబ్బందికి మంత్రి లోకేష్ మెగా గిఫ్ట్..! 2,341 మందికి పదోన్నతులు! Praja Vedika: రేపు (14/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! LPG Updates: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ... 30 శాతం పెరిగిన ఎల్పీజీ ఉత్పత్తి! BITS Pilani: దేశంలోనే మొట్ట మొదటి బిట్స్ పిలానీ ఏఐ ప్లస్ క్యాంపస్.. ప్లాన్లు పరిశీలించిన మంత్రి లోకేష్! Railway Rules: రైలు చివరి పెట్టెపై 'X' గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు రహస్యం ఇదే! AP Government: బీసీ హాస్టల్‌లో ఆహార కొరతపై ప్రభుత్వం సీరియస్..! పాత సిబ్బందిని మారుస్తూ ఆదేశాలు! Steel Bridge: నెలాఖరులోగా బకింగ్‌హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ పూర్తి! మంత్రి నారాయణ కీలక ప్రకటన! Sagar Defence: సముద్రంలో చేపలను పట్టేందుకు AI టెక్నాలజీ..! మత్స్యకారులకు లోకేష్ హామీ!

Minister Savita: బీసీలను అభివృద్ధి చేసిందీ మేమే.. ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు - మంత్రి సవిత

Minister Savita Developed the BCs: ‘అయిదేళ్లలో వెనుకబడిన తరగతులకు జగన్ చేసింది శూన్యం, బీసీలకు పునాదులు మేమే... వారిని అభివృద్ది చేసింది కూడా మేమే..’అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.

Published : 2026-03-04 20:00:00
  • రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి సవిత..
     
  • 2.0 పథకాలను ప్రారంభించిన ఘనత సీఎం..

Minister Savita Developed the BCs: ‘అయిదేళ్లలో వెనుకబడిన తరగతులకు జగన్ చేసింది శూన్యం, బీసీలకు పునాదులు మేమే... వారిని అభివృద్ది చేసింది కూడా మేమే..’అని  రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం శాసనమండలిలో ప్రశ్నోత్తర సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె స్పందించారు. 2014-19లో వడ్డెర్లకు, రజకులకు, మత్స్యకారులతో ఇతక బీసీ కులాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చామన్నారు. కూటమి ప్రభుత్వంలోనూ బీసీలకు పెద్దపీట వేస్తున్నామని, వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు.

గతంలో ఆదరణ, ఆదరణ 2.0 పథకాలను ప్రారంభించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. త్వరలో ప్రారంభించబోయే ఆదరణ 3.0లో వడ్డెర్లకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వడ్డెర్లకు మైనింగ్ లీజు కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లు, సీనరేజీలో 50 శాతం మినహాయింపు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని, వాటికి సంబంధించిన ఫైళ్లు ఆర్జిక శాఖ వద్ద ఉన్నాయని తెలిపారు. సముద్రంలో చేపల వేట నిషేధం కాలంలో మత్స్యకారులకు(పల్లెకారులు) ఇచ్చే ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇలా రాష్ట్రంలో ఉన్న 1.20 లక్షల మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తున్నామన్నారు.  మత్స్య కారులు చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.10 లక్షల వరకూ బీమా చెల్లిస్తున్నామన్నారు. మత్స్యకారుల మర పడవులకు వినియోగించే లీటర్ డీజిల్ పై రూ.9లు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. మత్స్య కారుల పిల్లల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు నిర్వహిస్తున్నామన్నారు. మత్స్య కారుల పడవలు మరమ్మతులకు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.

ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు
దేశంలో మొట్టమొదటిసారిగా 2014-19 మధ్య రజకల ఆర్థిక వృద్ధి కోసం ధోబి ఘాట్లు నిర్మించిన ఘనత సీఎం చంద్రబాబుదేని మంత్రి సవిత తెలిపారు. రాబోయే ఆదరణ 3.0 పథకంలోనూ రజకులకు వాషింగ్ మిషన్లు, ఆధునిక పరికరాలు అందజేయబోతున్నామన్నారు. వడ్డెర్లను, మత్స్యకారులను, రజకులను, వాల్మీకీలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చే అంశం పరిశీలిస్తున్నామని, ఆయా కమిటీల నివేదికలు రావాల్సి ఉందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ జాబితాలో కొత్త కులాలను చేర్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఈ విషయం సభ్యులకు కూడా తెలుసని మంత్రి సవిత తెలిపారు.

బీసీలకు జగన్ చేసింది శూన్యం
వైసీపీ ప్రభుత్వ హయాంలో అయిదేళ్ల పాటు బీసీలకు జగన్ చేసిందేమీ లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. 2014-19 మధ్య ఆయా కులాలను ఎస్సీ, ఎస్టీ జాబితాల్లో చేర్చడానికి అధ్యయన కమిటీలను అప్పట్లో తమ ప్రభుత్వమే నియమించిందన్నారు. తరవాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆయా కమిటీలను  నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వడ్డెర్లతో పాటు అన్ని బీసీ కులాలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దనున్నామన్నారు. బీసీలకు పునాదులు, వాళ్లకు అభివృద్ధి చేసిందీ తామేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. 

Spotlight

Read More →