AP Assembly: తెలుగు నేర్చుకోకుంటే మన ఉనికి ఉండదు...! మాతృభాషపై సీఎం కీలక వ్యాఖ్యలు! Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! AP Assembly: తెలుగు నేర్చుకోకుంటే మన ఉనికి ఉండదు...! మాతృభాషపై సీఎం కీలక వ్యాఖ్యలు! Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం!

Chandrababu: 20 నెలల్లో 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించాం.. గత పాలనలో ఎక్సైజ్‌లో అతిపెద్ద కుంభకోణం!

Nara Chandrababu Speech: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాల కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఎంఎస్ఎంఈలో 2.48 లక్షలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1.46 లక్షలు, పరిశ్రమల్లో 95 వేలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు.

Published : 2026-03-04 21:30:00
  • పీపీపీ విధానంలో నిర్మిస్తే అది ప్రైవేట్ పరం కాదు… ప్రభుత్వ ఆధీనంలోని ఆస్తి!
     
  • గత పాలకులు మెడికల్ కాలేజీలకు భూమిని చూపించలేదు..

Nara Chandrababu Speech: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాల కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఎంఎస్ఎంఈలో 2.48 లక్షలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1.46 లక్షలు, పరిశ్రమల్లో 95 వేలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 64 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. మెగా డీఎస్సీ, పోలీసు కానిస్టేబుళ్లు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు 30,500 కల్పించామని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని..అంతకంటే ఎక్కువ ఉద్యోగాలే కల్పించి హామిని నిలబెట్టుకుంటామని ఉద్ఘాటించారు. ఇందుకోసం ఓ కమిటీని కూడా నియమించామని అన్నారు. పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ, ఉద్యోగాల కల్పన, వైద్య, విద్య తదితర రంగాలపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.

గత పాలన లో యువత పొరుగు రాష్ట్రాలకు వలస పోయింది
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ...‘2019-24 మధ్య ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిన్నది. జాకీ, అమర్ రాజా, లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోయాయి. వైసీపీ ఉన్నంత వరకూ ఏపీకి తిరిగి రామని చెప్పి మరీ ఆ కంపెనీలు వెళ్లిపోయాయి. పూర్తిగా నెగెటివ్ ఇమేజ్‌ని సృష్టించి గత పాలకులు వెళ్లారు. 2019-20 నుంచి 2023-2024 ఆర్ధిక సంవత్సరంలో 913 కంపెనీలు మూతపడినట్టు ఆర్బీఐ నివేదికలో పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే చిరునామా ఏపీ ఉండేది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ ఉంది. 26 పాలసీలతో వేగంగా పెట్టుబడులకు అనుమతులు ఇస్తున్నాం. 

పర్యాటకానికి పారిశ్రామిక హోదా ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక పార్కులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూడా రూ.210 కోట్ల మేర విడుదల చేశాం. ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటిద్వారా 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది.  విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లు  అభివృద్ధి చేస్తున్నాం. 2047కు 2.4 ట్రిలియన్ డాలర్ల  ఆర్ధిక వ్యవస్థగా ఏపీ తయారవుతుంది. విశాఖ ఐటీ, జీసీసీల కేంద్రంగా తయారవుతుంది. ఎవరూ ఊహించనన్ని పెట్టుబడులు విశాఖకు వచ్చాయి’ అని ముఖ్యమంత్రి అన్నారు.

పేరున్న పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి
‘అమరావతికి క్వాంటం లాంటి ఎకోసిస్టం వస్తోంది. తిరుపతిని కూడా స్పేస్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్సు పరిశ్రమలతో అభివృద్ధి చేస్తాం. గూగుల్, టాటా- టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలు విశాఖకు వచ్చాయి. ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమ వస్తోంది. 20 నెలల్లోనే ప్రపంచంలోనే పేరున్న పరిశ్రమలు కంపెనీలు ఏపీకి వచ్చాయి. ఈ నెలలో ఆర్సెలార్ మిట్టల్, వచ్చే నెలలో గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేయబోతున్నాం. ఏఎం గ్రీన్ ద్వారా గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి కూడా శ్రీకారం చుట్టాం. ఎన్టీపీసీ ద్వారా 1.85 లక్షల కోట్లతో గ్రీన్ ఎనర్జీ తయారీ కోసం కూడా ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. 

టాటా సంస్థ కూడా రూ.6 వేల కోట్ల పెట్టుబడులతో యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. ఇలా ప్రముఖ సంస్థలన్నీ రాష్ట్రానికి పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. భవిష్యత్తులో ఈ పెట్టుబడులను సుస్థిరం చేయడానికి పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వంలో యువత పొరుగు రాష్ట్రాలకు వలస పోయిన పరిస్థితి. పెట్టుబడులకు ప్రిఫర్డ్ డెస్టినేషన్‌గా ఏపీ మారుతుంది. ఎన్డీఏ పాలన ఉన్నంత కాలం ఏపీకి పారిశ్రామిక వేత్తలు క్యూ కడతారు. దీనిని భరించలేక వైసీపీ నెగటివ్ ప్రచారాన్ని మొదలు పెట్టింది పెట్టుబడులు అంటే విముఖత చూపిస్తున్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

ఆవిష్కరణలు, నైపుణ్యాలకు పదును పెడుతున్నాం
‘ఏపీ అంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించాం. ఏపీ అంటే బ్రాండ్ అనే పేరు మళ్లీ తీసుకువచ్చాం. భారత్‌లో తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీ అమరావతికి వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంటే అమరావతి క్వాంటం వ్యాలీకి అడ్రస్‌గా మారుతుంది. వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ ద్వారా ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా రాష్ట్రంలోని 5 జోన్లలో ఆవిష్కరణలకు, నైపుణ్యాలకు పదును పెడుతున్నాం. గత ప్రభుత్వంలో ఎవరికీ నైపుణ్యాలను కల్పించలేక పోయారు. మా ప్రభుత్వంలో మానవ వనరులను అభివృద్ధి చేయటంతో పాటు అత్యుత్తమ ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుంది’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు.

మెడికల్ కాలేజీల నిర్మాణానికి భూమి చూపించలేదు
‘దేశంలోనే తొలిసారి ప్రజలందరికీ వర్తింప చేసేలా యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువస్తున్నాం. రూ.2.5 లక్షల వరకూ ఉచితంగా వైద్య సేవలు అందించేలా ఈ విధానం ఉంటుంది. అతి తక్కువ వ్యయంతోనే వైద్య చికిత్సలు అందేలా చర్యలు చేపడుతున్నాం. పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్మాణం చేపడుతున్నాం. గత పాలకులు కనీసం వైద్య కళాశాలలకు భూమి కూడా చూపించలేదు. ప్రతీ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పీపీపీ అంటే ప్రైవేటు కాదని మరోమారు ప్రజలకు చెబుతున్నాం. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆస్తిగానే ఉంటుంది. అన్ని మెడికల్ కళాశాలల్లోనూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సేవలు అందుతాయి. సంజీవని ప్రాజెక్టు ద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్యం కోసం డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందిస్తున్నాం. ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని సీఎం స్పష్టం చేశారు.  

తెలుగును కాపాడే బాధ్యత తీసుకుంటాం
‘విద్యా రంగంలో మరింత మెరుగైన ఫలితాల కోసం ఏటా రాష్ట్రంలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగులతో సమీక్షించుకుంటున్నాం. గత పాలకుల వల్ల విద్యా రంగం దిగజారి పోయింది. ప్రాథమిక విద్య ఎక్కడైనా మాతృభాషలోనే ఉంటుంది.  ప్రపంచానికి తెలివైన యువతను అందించటంతో పాటు తెలుగును కాపాడుకునే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రముఖ కంపెనీలతో పర్యాటక ప్రాజెక్టులు అనుసంధానం
‘అతిథి దేవోభవ అన్నది మన విధానం. దీనిని అనుసరించే పర్యాటక విధానాన్ని రూపొందించాం. ప్రకృతి వనరులకు మన రాష్ట్రంలో కొదవలేదు. భూకేటాయింపులు సహా వివిధ ప్రోత్సాహకాలను ప్రాజెక్టులకు అందిస్తున్నాం. పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా పర్యాటక పాలసీకి రూపకల్పన చేశాం. 102 ఎంఓయుూల ద్వారా రూ.18 వేల కోట్ల పెట్టుబడులు కూడా రాష్ట్రానికి వచ్చాయి. 3.4 లక్షల మందికి దీని ద్వారా ఉద్యోగాలు వస్తాయి. 7,348 హోటల్ గదుల నిర్మాణానికి అనుమతులు కూడా  ఇచ్చాం. 

సూర్యలంక బీచ్‌ను గోవాతో పోటీ పడేలా తీర్చిదిద్దుతాం. అఖండ గోదావరి, పాపికొండలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. గండికోట మన దేశపు గ్రాండ్ కాన్యన్. దీనిని కూడా అద్భుతంగా అభివృద్ది చేయాలని నిర్ణయించాం. ప్రసాద్ స్కీమ్ కింద వివిధ దేవాలయాలను కూడా అభివృద్ధి చేయబోతున్నాం. కారావాన్, హోం స్టేలు, టెంట్ సిటీల ద్వారా పర్యాటకాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నాం. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో వీటిని అనుసంధానించి పర్యాటక ప్రాజెక్టులు పెద్ద ఎత్తున తీసుకు వస్తున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఎక్సైజ్‌లో కుంభకోణానికి పాల్పడ్డారు
‘గత పాలకుల హయాంలో ఎక్సైజ్‌లో అతిపెద్ద కుంభకోణం చేశారు. దీనిపై కేబినెట్ సబ్ కమిటీని వేసి విచారణ చేస్తున్నాం. సొంత బ్రాండ్లు తెచ్చి వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేశారు. ఇప్పుడు మొత్తం పారదర్శకంగా మార్చి అంతర్జాతీయ బ్రాండ్లు తీసుకువచ్చాం. ఎవరు తప్పు చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల ఆరోగ్యమే మాకు అత్యంత ప్రాధాన్యం. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సేవించి 30 వేల మంది వరకూ అనారోగ్యాల పాలై మరణించారు. ప్రస్తుతం ఎక్సైజ్ విధానాన్ని ప్రక్షాళన చేశాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో అన్నారు.

Spotlight

Read More →