భారత్‌ మార్కెట్‌లోకి వియత్నాం ఈవీ దిగ్గజం.. వచ్చే ఏడాది జూన్‌లోగా రెండు కొత్త మోడళ్లు!

VinFast Targets India’s EV Market: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వియత్నాంకు చెందిన ఈవీ తయారీ సంస్థ విన్ఫాస్ట్ (VinFast) సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌లోగా భారత్‌లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌లో ఈ స్కూటర్లను తయారు చేయనున్నట్లు విన్ఫాస్ట్ ఇండియా మార్కెట్ సీఈఓ అనురాగ్ సక్సేనా వెల్లడించారు.

VinFast Targets India s EV Market
VinFast Targets India s EV Market

భారత్‌లో విన్ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. వచ్చే ఏడాది జూన్‌లోగా రెండు కొత్త మోడళ్లు..

న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు వియత్నాంకు చెందిన ఈవీ తయారీ సంస్థ విన్ఫాస్ట్ (VinFast) సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జూన్‌లోగా భారత్‌లో రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తమిళనాడులోని తూత్తుకుడి ప్లాంట్‌లో ఈ స్కూటర్లను తయారు చేయనున్నట్లు విన్ఫాస్ట్ ఇండియా మార్కెట్ సీఈఓ అనురాగ్ సక్సేనా వెల్లడించారు.

కొత్త స్కూటర్లతో భారత ద్విచక్ర వాహన మార్కెట్‌లోకి అడుగుపెట్టనున్న విన్ఫాస్ట్, వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లను కూడా సిద్ధం చేస్తోంది. బ్యాటరీ స్వాపింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 2029 వరకు ఉచిత ఛార్జింగ్ సౌకర్యం కల్పించనుంది. దీర్ఘకాలిక బ్యాటరీ గ్యారంటీని కూడా ఆఫర్ చేయనుంది. ఈ సదుపాయాలు ఈవీ కొనుగోలుదారులకు నిర్వహణ ఖర్చులు తగ్గించడంలో, ఛార్జింగ్ విషయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడంలో ఉపయోగపడనున్నాయి.

ప్రస్తుతం విన్ఫాస్ట్ భారత్‌లో వీఎఫ్ 6 (VF 6), వీఎఫ్ 7 (VF 7) సహా మొత్తం నాలుగు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. ఈ కార్ల శ్రేణిని మరింత విస్తరించే దిశగా వచ్చే ఏడాది ప్రారంభంలో కనీసం మరో రెండు కొత్త మోడళ్లను తీసుకురానుంది. వీటిలో కాంపాక్ట్ ఎస్‌యూవీ వీఎఫ్ 5 (VF 5) కూడా ఉండనుంది. ఈ విషయాన్ని విన్ఫాస్ట్ ఆసియా సీఈఓ తపన్ ఘోష్ వెల్లడించారు.

భారత మార్కెట్‌పై కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు భారత్‌లో 500 మిలియన్ డాలర్లు, అంటే సుమారు 50 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టిన విన్ఫాస్ట్ మాతృసంస్థ విన్గ్రూప్ (Vingroup), భవిష్యత్తులో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచేందుకు మొత్తం 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలక్ట్రిక్ కార్లతో పాటు స్కూటర్ల విభాగంలోకి ప్రవేశించడం, ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించడం ద్వారా భారత ఈవీ మార్కెట్‌లో తన వ్యాపారాన్ని పెంచుకోవాలని విన్ఫాస్ట్ భావిస్తోంది. వచ్చే ఏడాది విడుదల కానున్న కొత్త స్కూటర్లు, కార్లు భారత వినియోగదారులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

Tags

Be the first to react

Latest