ప్రమాదకరంగా మారిన ఇంద్రకీలాద్రి! భక్తులకు హెచ్చరిక జారీ!
విజయవాడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం ఇంద్రకీలాద్రిపై కనిపించింది. విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడి రోడ్డుపై భారీగా మట్టి, రాళ్లు జారిపడ్డాయి. అయితే ఘాట్‌రోడ్‌ను రెండు రోజుల క్రితమే అధికారులు రాకపోకలకు మూసివేయడంతో ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో భక్తులు, వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
- గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.
- భక్తులు, ఆలయ సిబ్బంది భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు.
విజయవాడ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం ఇంద్రకీలాద్రిపై కనిపించింది. విజయవాడ దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడి రోడ్డుపై భారీగా మట్టి, రాళ్లు జారిపడ్డాయి. అయితే ఘాట్‌రోడ్‌ను రెండు రోజుల క్రితమే అధికారులు రాకపోకలకు మూసివేయడంతో ప్రమాదం తప్పింది. ఘటన జరిగిన సమయంలో భక్తులు, వాహనాల రాకపోకలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఘాట్‌రోడ్‌లో మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ముందుగానే రహదారిని మూసివేశారు. ఇదే సమయంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో కొండపై మట్టి తడిసి, కొంత భాగం చరియల రూపంలో రోడ్డుపైకి జారినట్లు తెలుస్తోంది.
ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆలయ ఈవో శీనా నాయక్ ఘాట్‌రోడ్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు.
భద్రతపై మంత్రి ఆనం ఆదేశాలు
దుర్గగుడి ఘాట్‌రోడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులు, ఆలయ సిబ్బంది భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
కొండ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనం చేపట్టాలని మంత్రి సూచించారు. ఇందుకోసం బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ (NIRM) నిపుణులను తక్షణమే రప్పించి, ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని గతంలోనూ NIRM నిపుణులు పరిశీలించి భద్రతకు సంబంధించి పలు సూచనలు చేసినట్లు మంత్రి తెలిపారు. తాజా ఘటన నేపథ్యంలో ఆ సూచనలను మరోసారి సమీక్షించి, అవసరమైన అదనపు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఘాట్‌రోడ్ మూసివేసి ఉండటంతో భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.
Be the first to react