Kollu Ravindra: మచిలీపట్నంలో అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర.. తల్లిదండ్రులకు భరోసా!

Kollu Ravindra: మచిలీపట్నంలో అస్వస్థతకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన, ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

Kollu Ravindra
Kollu Ravindra

వ్యాక్సిన్ అనంతరం అస్వస్థత.. 8 మంది విద్యార్థులు ఆస్పత్రిలో, స్పందించిన మంత్రి..

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. తల్లిదండ్రులకు మంత్రి కొల్లు రవీంద్ర భరోసా..

మచిలీపట్నం: మచిలీపట్నంలో అస్వస్థతకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆయన, ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారని, తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

మంత్రి మంగళవారం ఉదయం ప్రభుత్వాసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిశారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, అవసరమైన అన్ని చికిత్సలు అందించాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర, నిన్న ఉదయం వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం మచిలీపట్నంలో 140 మందికి, కృష్ణా జిల్లాలో మొత్తం 750 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. సమాచారం అందిన వెంటనే వైద్యులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం విద్యార్థులు చికెన్ బిర్యానీ తిన్నట్లు తెలిసిందని మంత్రి పేర్కొన్నారు. బయట తీసుకున్న ఆహారం కారణంగానే అస్వస్థతకు గురై ఉండే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే పూర్తి స్థాయి వైద్య, సాంకేతిక నివేదిక వచ్చిన తర్వాతే అసలు కారణం స్పష్టమవుతుందని, ఆ నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హోటళ్లలో ఆహార నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇస్తామని మంత్రి చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పరిశీలించాలని సూచించారు. ప్రజలు కూడా బయట ఆహారం తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రత పాటించే హోటళ్లలోనే భోజనం చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి స్పష్టం చేశారు.

Tags

Be the first to react

Latest