AP కి భారీ లాభాల దిశగా సీఎం విజనరీ ప్రాజెక్టు: మొబైల్ హాట్‌స్పాట్ లాగే కరెంట్ షేరింగ్!

Chandrababu Power Hotspot Grid Concept: ఫోన్ డేటా హాట్‌స్పాట్ తరహాలోనే ఒక రాష్ట్రంలో మిగిలిపోయిన విద్యుత్‌ను అవసరమున్న పొరుగు రాష్ట్రాలకు తక్షణమే పంపించేలా దక్షిణాది పవర్ గ్రిడ్‌ను మరింత బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు సదరన్ జోనల్ కౌన్సిల్‌లో ప్రతిపాదించారు. ఏపీలో భారీగా ఉత్పత్తి అవుతున్న సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ మిగులు విద్యుత్‌ను వృథా కాకుండా పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేయడం ద్వారా ఏపీని దక్షిణాదికే ‘పవర్ బ్యాంక్’గా తీర్చిదిద్దడం, నిరంతర విద్యుత్‌తో గ్లోబల్ పరిశ్రమలను ఆకర్షించడమే ఈ విజనరీ ప్లాన్ లక్ష్యం.

వేస్ట్ అయ్యే కరెంట్‌తో ఏపీకి జాక్‌పాట్
వేస్ట్ అయ్యే కరెంట్‌తో ఏపీకి జాక్‌పాట్
  • వేస్ట్ అయ్యే కరెంట్‌తో ఏపీకి జాక్‌పాట్.. సౌత్ ఇండియాకు పవర్ బ్యాంక్‌గా రాష్ట్రం!

  • సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌లో కీలక ప్రతిపాదన.. దక్షిణాది గ్రిడ్ మరింత బలోపేతం!

  • 'వన్ నేషన్.. వన్ గ్రిడ్' ఉన్నా ట్రాన్స్‌మిషన్ లాస్ సవాల్.. స్ట్రాంగ్ నెట్‌వర్క్‌తోనే పరిష్కారం!

Andhrapradesh: మన మొబైల్ ఫోన్‌లో డేటా మిగిలిపోతే పక్కనున్న వారికి వైఫై హాట్‌స్పాట్ ఇచ్చినంత సులువుగా.. ఒక రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉంటే వెంటనే కొరత ఉన్న పొరుగు రాష్ట్రానికి పంపించగలిగితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి వినూత్నమైన ఆలోచననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారు. ఈ ‘పవర్ హాట్‌స్పాట్’ ఐడియా కనుక క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చితే, ఆంధ్రప్రదేశ్ యావత్ దక్షిణాది రాష్ట్రాలకే ఒక భారీ ‘పవర్ బ్యాంక్’గా అవతరిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వన్ నేషన్.. వన్ గ్రిడ్ ఉన్నప్పటికీ ట్రాన్స్‌మిషన్ సవాల్

భారతదేశంలో ఇప్పటికే ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్.. వన్ ఫ్రీక్వెన్సీ’ వ్యవస్థ అమల్లో ఉంది. డిసెంబర్ 2013లోనే సదరన్ గ్రిడ్‌ను నేషనల్ గ్రిడ్‌తో అనుసంధానించడం జరిగింది. సిద్ధాంతపరంగా దేశంలో ఎక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్‌నైనా ఇతర ప్రాంతాలకు తరలించే వెసులుబాటు ఉన్నప్పటికీ, విద్యుత్ ఉత్పత్తి చేయడం ఒక ఎత్తయితే, దానిని ఎక్కడా నష్టం (ట్రాన్స్‌మిషన్ లాస్) జరగకుండా డిమాండ్ ఉన్న కేంద్రాలకు సమర్థవంతంగా చేరవేయడానికి అత్యంత పటిష్టమైన ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ అవసరం.

ఏపీలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి జోరు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సోలార్ (సౌర), విండ్ (పవన) విద్యుత్ ప్రాజెక్టులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాబోయే కాలంలో ఏపీలో క్లీన్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి సరికొత్త రికార్డులను సృష్టించనుంది. ఉదాహరణకు, మధ్యాహ్నం సమయంలో ఏపీలో ఎండ తీవ్రత వల్ల సోలార్ విద్యుత్ భారీ స్థాయిలో ఉత్పత్తి అయి, రాష్ట్ర అంతర్గత అవసరాలకు వాడగా ఇంకా పెద్ద మొత్తంలో మిగులు విద్యుత్ మిగిలిపోతుంది. ఆ సమయంలో గ్రిడ్ సమస్యలతో ఆ కరెంట్ వృథా కాకుండా చూడటమే ఈ వ్యూహం ముఖ్య ఉద్దేశం.

సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్‌లో సీఎం ప్రతిపాదన

ఏపీలో మిగులు కరెంట్ ఉన్న సరిగ్గా అదే సమయానికి పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక లేదా కేరళ వంటి రాష్ట్రాల్లో భారీ పవర్ డిమాండ్ ఉండవచ్చు. అలాంటప్పుడు మన దగ్గర ఉన్న అదనపు విద్యుత్‌ను వెంటనే ఆ రాష్ట్రాలకు బదిలీ చేయగలిగితే ఇటు విద్యుత్ వృథా కాదు, అటు పొరుగు రాష్ట్రాల అవసరాలూ తీరతాయి. ఇదే అంశాన్ని దక్షిణాది స్థాయిలో మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఇటీవల జరిగిన సదరన్ జోనల్ కౌన్సిలింగ్ మీటింగ్‌‌లో చంద్రబాబు నాయుడు దక్షిణాది పవర్ గ్రిడ్ ట్రాన్స్‌మిషన్ లైన్లను మరింత బలోపేతం చేయాలని కేంద్రం, ఇతర రాష్ట్రాల ముందు ప్రతిపాదించారు.

భారీగా పంప్డ్ స్టోరేజ్ – గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ల వెల్లువ

భారీ సోలార్ పార్కులు, అత్యాధునిక పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో ఏపీ ఇప్పటికే ముందడుగు వేస్తోంది. ఈ ప్రతిపాదన ద్వారా ఏపీ కేవలం విద్యుత్‌ను తయారుచేసే సాధారణ రాష్ట్రంగా మాత్రమే కాకుండా, సౌత్ ఇండియా మొత్తానికి ప్రధాన ‘పవర్ ట్రేడింగ్ & సప్లై హబ్’గా మారుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ మల్టీనేషనల్ కంపెనీలకు (MNCs) పోర్టులు, రోడ్లతో పాటు నిరంతర నాణ్యమైన విద్యుత్ (24/7 పవర్) అత్యంత కీలకం. ఈ పటిష్టమైన గ్రిడ్ నెట్‌వర్క్ పరిశ్రమలకు విశ్వసనీయమైన కరెంట్‌ను అందించి విదేశీ పెట్టుబడులను వెల్లువెత్తేలా చేస్తుంది.

సౌత్ ఎనర్జీ మ్యాప్‌లో ఏపీ గేమ్ చేంజర్

దక్షిణాది రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకం అత్యంత సమర్థవంతంగా సాగితే మొత్తం ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకే కొత్త ఊపు వస్తుంది. వృథా అయ్యే గ్రీన్ పవర్‌ను ఆదాయ వనరుగా మార్చుకోవడంతో పాటు, దేశ క్లీన్ ఎనర్జీ లక్ష్యాల్లో ఏపీ నంబర్ వన్ స్థానానికి చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. చంద్రబాబు ఆలోచన చేసిన ఈ విజనరీ పవర్ హాట్‌స్పాట్ కాన్సెప్ట్ భవిష్యత్ భారత ఇంధన ముఖచిత్రంలో ఒక విప్లవాత్మక మైలురాయిగా నిలవనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Tags

Be the first to react

Latest