AP Govt: ఏలేరు ఆయకట్టుకు సాగు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి.. రెండేళ్లలో రూ.25 కోట్లతో 548 పనులు!
AP Govt: ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు నిరంతరంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఏలేరు ఆయకట్టు సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.
ఏలేరు ఆయకట్టుకు 2.6 టీఎంసీల నీరు.. 53 వేల ఎకరాలకు సాగునీరు..
ఏలేరు ఆయకట్టుకు 950 క్యూసెక్కుల నీటి విడుదల.. మంత్రి నిమ్మల రామానాయుడు..
అమరావతి: ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు సాగునీరు, తాగునీరు నిరంతరంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఏలేరు ఆయకట్టు సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు.
బుధవారం శాసనసభలో యల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఇటీవల ఏలేరు ఆయకట్టు ప్రాంతంలో క్షేత్రస్థాయి పరిశీలనలు నిర్వహించినట్లు వెల్లడించారు.
ఏలేరు రిజర్వాయర్ పరిధిలో సుమారు 53 వేల ఎకరాల ఆయకట్టు ఉందని మంత్రి తెలిపారు. దీనితో పాటు 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు కూడా సాగు, తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. సూపర్ ఎల్‌నినో వంటి క్లిష్ట వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ రైతులకు నీటిని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకు నీరు అందించాలన్న ముందుచూపుతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీంను నిర్మించారని రామానాయుడు తెలిపారు.
పురుషోత్తపట్నం లిఫ్ట్ స్కీంతో పాటు పోలవరం ఎడమ కాలువ పనులను ముందుకు తీసుకెళ్లడం వల్లే ప్రస్తుతం ఏలేరు ఆయకట్టుకు సాగు, తాగునీరు అందించే పరిస్థితి ఏర్పడిందని మంత్రి వివరించారు.
గత ప్రభుత్వం పోలవరం ఎడమ కాలువ పనులను నిర్లక్ష్యం చేసిందని మంత్రి విమర్శించారు. కనీసం తట్టమట్టి పనులు కూడా చేపట్టలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.1,800 కోట్లు ఖర్చు చేసి పోలవరం ఎడమ కాలువ పనులను ముందుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అత్యంత క్లిష్టమైన పాంపా, తాండవ, ఏలేరు నదుల క్రాసింగ్ పనులతో పాటు 11 హైవే క్రాసింగ్ వంతెనల పనులను పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగు అవసరాల కోసం 950 క్యూసెక్కుల నీటిని పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ఏలేరు ఆయకట్టుకు 2.6 టీఎంసీల నీటిని పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రైతులకు సాగునీరు అందించడంతో పాటు ఆయకట్టు పరిధిలోని ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
గత ఐదేళ్లలో ఏలేరు నదీగర్భంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నదీ బెడ్ లెవల్ పడిపోయిందని మంత్రి ఆరోపించారు. దీంతో గ్రావిటీ ద్వారా నీటిని అందించడంలో సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. గత ప్రభుత్వం ఏలేరు ఆయకట్టు పరిధిలో నిర్వహణ, మరమ్మతుల O&M పనులకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని మంత్రి విమర్శించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ఆయకట్టు పరిధిలో నిర్వహణ, మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని రామానాయుడు తెలిపారు. గత రెండేళ్లలో 548 O&M పనులకు రూ.25 కోట్లు మంజూరు చేసి పనులు చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులో ఎల్‌నినో వంటి క్లిష్ట వాతావరణ పరిస్థితులు ఎదురైనా నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఏలేరు ఆయకట్టుకు నీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా మరో రూ.15.84 కోట్లతో O&M పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపినట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఏలేరు ఆయకట్టు రైతులకు నిరంతర సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. నీటి వనరుల సంరక్షణ, కాలువల నిర్వహణ, పెండింగ్ పనుల పూర్తి ద్వారా ఏలేరు ప్రాంతానికి శాశ్వత నీటి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు.
Tags
Be the first to react