న్యూజిలాండ్‌లో ఏపీఎన్‌ఆర్టీఎస్ బిజినెస్ లీడర్స్ మీటింగ్.. డాక్టర్ రవి కుమార్ వేమూరుతో ప్రత్యేక భేటీ!

Andhra Pradesh–New Zealand Business Meet: ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడమే లక్ష్యంగా ఏపీఎన్‌ఆర్టీఎస్ (APNRTS) న్యూజిలాండ్ విభాగం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. న్యూజిలాండ్‌లోని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రవి కుమార్ వేమూరు సమావేశం నిర్వహించనున్నారు.

Andhra Pradesh New Zealand Business Meet
Andhra Pradesh New Zealand Business Meet

ఆక్లాండ్‌లో ప్రవాసాంధ్ర వ్యాపారవేత్తలతో డాక్టర్ రవి కుమార్ వేమూరు భేటీ..

ఏపీ–న్యూజిలాండ్ మధ్య పెట్టుబడులే లక్ష్యం.. ఏపీఎన్‌ఆర్టీఎస్ ప్రత్యేక సమావేశం..

ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార, వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడమే లక్ష్యంగా ఏపీఎన్‌ఆర్టీఎస్ (APNRTS) న్యూజిలాండ్ విభాగం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. న్యూజిలాండ్‌లోని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్‌ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ రవి కుమార్ వేమూరు సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ఏపీఎన్‌ఆర్టీఎస్ అధ్యక్షుడు డాక్టర్ రవి కుమార్ వేమూరు నిన్న అనగా నవంబర్ 15, ఆదివారం రాత్రి 11.30 కు ఔక్లాండ్ కు చేరుకున్నారు, ఈ సందర్భంగా పలువురు ఏపీఎన్‌ఆర్టీ సభ్యులు ఎయిర్పోర్టు కు చేరుకొని డాక్టర్ రవి కుమార్ వేమూరు కు సాదరంగా స్వాగతం పలికారు.

Andhra Pradesh New Zealand Business Meet

ఆక్లాండ్‌లో నిర్వహించనున్న ఈ బిజినెస్ లీడర్స్ మీటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్, న్యూజిలాండ్ మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడులు, పరస్పర సహకార అవకాశాలపై చర్చించనున్నారు. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలుగు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు తమ వ్యాపార ఆలోచనలు, పెట్టుబడి ప్రతిపాదనలు, భవిష్యత్ ప్రణాళికలను నేరుగా డాక్టర్ రవి కుమార్ వేమూరుతో పంచుకునేందుకు ఈ సమావేశం మంచి వేదికగా నిలవనుంది.

Andhra Pradesh New Zealand Business Meet

ఈ సమావేశం నవంబర్ 18, గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఆక్లాండ్‌లో సమావేశం నిర్వహించే ఖచ్చితమైన వేదిక వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. సమావేశం అనంతరం పాల్గొనే అతిథులకు స్నాక్స్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

న్యూజిలాండ్‌లోని వ్యాపార ప్రముఖులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆసక్తి ఉన్న ఇతర సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని ఏపీఎన్‌ఆర్టీఎస్ న్యూజిలాండ్ విభాగం ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలనుకునే ప్రవాసాంధ్రులకు, రాష్ట్రంలో కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తున్న వారికి ఈ భేటీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

ఏపీఎన్‌ఆర్టీఎస్ న్యూజిలాండ్ కంట్రీ కోఆర్డినేటర్ దిలీప్ మద్దుకూరి ఈ కార్యక్రమానికి సంబంధించి సభ్యులకు ఆహ్వానం పంపించారు. సమావేశానికి సంబంధించిన పూర్తి వేదిక వివరాలను త్వరలో తెలియజేస్తామని వెల్లడించారు. 

ఈ కార్యక్రమం ద్వారా ప్రవాసాంధ్రుల వ్యాపార అనుభవం, పెట్టుబడి సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అనుసంధానించే దిశగా మరో ముందడుగు పడుతుందని ఆశిస్తున్నారు.

Tags

Be the first to react

Latest