లండన్‌లో ఏపీ బృందం కీలక భేటీలు... వైద్య రంగానికి గ్లోబల్ బూస్ట్

AP Healthcare Investments: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ వీర పాండియన్ గారి నేతృత్వంలో చేపట్టిన ఐదు రోజుల యూకే పర్యటన విజయవంతంగా ముగిసింది. ఏపీ ప్రభుత్వ యూరప్ ప్రత్యేక ప్రతినిధి శ్రీ గుంటుపల్లి జయకుమార్ సమన్వయంతో NHS UK, గేట్స్ ఫౌండేషన్, UCL, ఇంపీరియల్ కాలేజ్ లండన్ సహా పలు సంస్థలు, ప్రవాస తెలుగు వైద్యులతో బృందం సమావేశమై ఏపీలో వైద్య రంగ పెట్టుబడులు, పరిశోధనా సహకారంపై చర్చించింది.

వైద్య రంగంలో ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు
వైద్య రంగంలో ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు
  • ఆధునిక వైద్య సాంకేతికత, వైద్య విద్య, పరిశోధనల్లో పరస్పర సహకారం మరియు పెట్టుబడి అవకాశాలపై యూకే సంస్థలతో విస్తృత చర్చలు!

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూరప్ ప్రత్యేక ప్రతినిధి శ్రీ గుంటుపల్లి జయకుమార్ గారి సమన్వయంలో అత్యంత ఫలప్రదంగా సాగిన పర్యటన!

  • ఎన్‌హెచ్‌ఎస్ యూకే (NHS UK), గేట్స్ ఫౌండేషన్, యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL), లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో భేటీ!

London: వైద్య, ఆరోగ్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వామ్యాలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ వీర పాండియన్ గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం చేపట్టిన ఐదు రోజుల యునైటెడ్ కింగ్‌డమ్ (UK) పర్యటన అత్యంత విజయవంతంగా ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా యూకేలోని పలు ప్రాంతాల్లో ప్రముఖ వైద్య, ఆరోగ్య, విద్యా సంస్థల ప్రతినిధులతో బృందం విస్తృతంగా సమావేశమైంది.

వైద్య రంగంలో ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు

ఆధునిక సాంకేతికత, పరిశోధన & పెట్టుబడులపై కీలక చర్చలు

రాష్ట్రంలో వైద్య సేవలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం, వైద్య విద్య మరియు పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడం, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించడం వంటి ప్రధాన అంశాలపై ఈ సమావేశాల్లో లోతుగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యూరప్ ప్రత్యేక ప్రతినిధి శ్రీ గుంటుపల్లి జయకుమార్ గారు ఈ మొత్తం పర్యటనను సమన్వయం చేశారు.

వైద్య రంగంలో ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు

NHS UK, గేట్స్ ఫౌండేషన్ సహా 14 ప్రముఖ సంస్థలతో సంప్రదింపులు

పర్యటన సందర్భంగా యూనివర్సిటీ కాలేజ్ లండన్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, క్వీన్ ఎలిజబెత్ హాస్పిటల్, ఎన్‌హెచ్‌ఎస్ యూకే (NHS UK), గేట్స్ ఫౌండేషన్, ఇంపీరియల్ కాలేజ్ లండన్, హెల్త్ గ్లోబల్, యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్, బీఐటీ, ఏఐ హెల్త్, నైస్ (NICE), ఆర్‌ఏఐ యూకే, టీసీఎస్ యూకే మరియు బాపియో (BAPIO) సంస్థల ప్రతినిధులతో రాష్ట్ర ప్రతినిధి బృందం కీలక సంప్రదింపులు జరిపింది.

వైద్య రంగంలో ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు

బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రవాస తెలుగు వైద్యులతో భేటీ – ఏపీలో పనిచేసేందుకు ఆసక్తి

బ్రిటిష్ పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ప్రవాస తెలుగు వైద్య నిపుణులతో పాటు పలు సంస్థల ప్రతినిధులను బృందం కలుసుకుంది. పర్యటన సందర్భంగా జరిగిన సమావేశాల్లో పాల్గొన్న పెట్టుబడిదారులు, వైద్య నిపుణులు, విద్యా సంస్థల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగ పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సానుకూల ఆసక్తి వ్యక్తం చేశారు. ఐదు రోజుల పర్యటన విజయవంతంగా ముగియడం పట్ల శ్రీ వీర పాండియన్ గారు సంతోషం వ్యక్తం చేస్తూ—సమావేశాల్లో పాల్గొన్న సంస్థల ప్రతినిధులకు, ఏపీఎన్‌ఆర్‌టీ (APNRT) సభ్యులకు, పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

వైద్య రంగంలో ఏపీకి అంతర్జాతీయ గుర్తింపు

Tags

Be the first to react

Latest