₹38 వేల కోట్లు, 15 వేల ఉద్యుగాల ప్రాజెక్ట్ తమిళనాడు నుండి కాకినాడకు షిఫ్ట్! పవర్ ఫుల్ లోకేష్!

తమిళనాడు తూత్తుకుడికి వెళ్లాల్సిన హ్యుండాయ్ మెగా షిప్‌యార్డ్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు రప్పించడంలో మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా విజయం సాధించారు. సియోల్‌లో కంపెనీ ప్రతినిధులతో భేటీ అయి కాకినాడ వద్ద ఉన్న అనుకూలతలు, ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలను వివరించడంతో పాటు తమిళనాడులో ఎదురైన రాజకీయ, భూసేకరణ సమస్యల దృష్ట్యా కొరియన్ దిగ్గజం ఏపీకే మొగ్గు చూపింది. దీని ద్వారా రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉపాధి లభించనుంది.

తమిళనాడును కాదని కాకినాడకు భారీ ప్రాజెక్ట్
తమిళనాడును కాదని కాకినాడకు భారీ ప్రాజెక్ట్
  • భూసేకరణపై ఆంక్షలు, టీవీకే రాజకీయ ఒత్తిళ్లు.. తమిళనాడు నుంచి తప్పుకున్న కొరియన్ దిగ్గజం!

  • ప్రపంచ నౌకా నిర్మాణ పటంలో కాకినాడకు అరుదైన ఖ్యాతి.. లాజిస్టిక్స్ రంగానికి సరికొత్త రెక్కలు!

  • ఒప్పందంలోని లూప్‌హోల్‌ను పసిగట్టిన ఏపీ.. రాత్రికి రాత్రే సీన్ మార్చేసిన కూటమి సర్కార్!

Kakinada: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు దక్కాల్సిన అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ చాకచక్యంగా ఒడిసిపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద నౌకా నిర్మాణ సంస్థ అయిన హెచ్‌డీ హ్యుండాయ్ (HD Hyundai) భారీ మెగా షిప్‌యార్డ్ ప్రాజెక్టును కాకినాడ వద్ద ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. తమిళనాడులోని తూత్తుకుడికి వెళ్లాల్సిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌కు రప్పించడంలో కూటమి ప్రభుత్వ సమన్వయం, ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ చూపిన వ్యూహాత్మక చొరవ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.

ఒప్పందంలో వెసులుబాటు – రంగంలోకి దిగిన ఏపీ

వాస్తవానికి ఈ భారీ నౌకా నిర్మాణ ప్లాంట్ కోసం కొరియన్ దిగ్గజ సంస్థ తొలుత తమిళనాడు ప్రభుత్వంతో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం.. తమిళనాడు ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడానికి కట్టుబడి ఉన్నప్పటికీ, సదరు కంపెనీకి మాత్రం అవసరమైతే ఎప్పుడైనా తప్పుకొని వేరే రాష్ట్రానికి వెళ్లే పూర్తి స్వేచ్ఛ ఉంది. ఈ కీలక అంశాన్ని ఏపీ అధికార యంత్రాంగం సరిగ్గా గుర్తించింది. ఈ అద్భుత అవకాశాన్ని క్షణాల్లో అందిపుచ్చుకున్న మంత్రి నారా లోకేష్, స్వయంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు వెళ్లి హ్యుండాయ్ ఉన్నత స్థాయి ప్రతినిధులతో భేటీ అయ్యారు.

ప్లగ్ అండ్ ప్లే ఆఫర్ – లోకేష్ మాస్టర్ ప్లాన్

తూత్తుకుడిలో షిప్‌యార్డ్ నిర్మించాలంటే అన్ని మౌలిక సదుపాయాలను సున్నా నుంచి కొత్తగా నిర్మించుకోవాల్సి ఉంటుందని, అదే కాకినాడ వద్ద అయితే విశాలమైన పారిశ్రామిక భూమి, సుదీర్ఘ తీర ప్రాంతం, డీప్ డ్రాఫ్ట్ సదుపాయాలు మరియు ముందస్తు పర్యావరణ అనుమతులు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయంటూ 'ప్లగ్ అండ్ ప్లే' తరహా ఆఫర్‌ను లోకేష్ కంపెనీ ముందు ఉంచారు. భూసేకరణ సమస్యలు లేకుండా, పనులు తక్షణమే ప్రారంభించుకునేందుకు ఏపీ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చి కంపెనీ ప్రతినిధులను పూర్తిస్థాయిలో ఒప్పించారు.

తమిళనాడులో నెలకొన్న అనిశ్చితి కూడా అనుకూలం

మరోవైపు తమిళనాడులో ఎదురైన క్షేత్రస్థాయి రాజకీయ, పారిశ్రామిక పరిస్థితులు కూడా హ్యుండాయ్ సంస్థ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. అక్కడ భూసేకరణపై ప్రభుత్వ ఆంక్షలు, నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తెస్తున్న రాజకీయ ఒత్తిళ్లు, పరందూరు విమానాశ్రయ ప్రాజెక్ట్ సమస్యలు మరియు తూత్తుకుడిలో స్థానిక నిరసనల కారణంగా కంపెనీలో నమ్మకం సన్నగిల్లింది. అక్కడ ప్రాజెక్ట్ ప్రారంభం ఆలస్యమవుతుందని భావించిన కొరియన్ యాజమాన్యం, ఏపీ ప్రభుత్వం చూపిన సానుకూలత మరియు కాకినాడ వద్ద ఉన్న సహజసిద్ధమైన అనుకూలతలకే తుది ఓటు వేసింది.

స్థానిక యువతకు ఉపాధి వెల్లువ – గోదావరి జిల్లాకు నయా వైభవం

ఈ భారీ ప్రాజెక్టు రాష్ట్రానికి రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, పారిశ్రామిక రంగానికి ఊహించని ఊపు లభించనుంది. వేలాది మంది ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ మరియు ఐటీఐ చదివిన స్థానిక నిరుద్యోగ యువతకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ షిప్‌బిల్డింగ్ పటంలో కాకినాడ సరికొత్త కేంద్రంగా మారనుంది. రవాణా, లాజిస్టిక్స్, స్టీల్, ఎంఎస్ఎంఈ అనుబంధ తయారీ రంగాలకు ఊహించని వ్యాపార విస్తరణ లభించనుంది. రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రి లోకేష్ చేస్తున్న పారిశ్రామిక దౌత్యం, ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న విధానం పట్ల రాజకీయ, వ్యాపార వర్గాల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Tags

Be the first to react

Latest