Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!! తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు! Land Pooling Phase-2: వైసీపీ అడ్డంకుల వల్లే అమరావతి నిలిచింది.. భూసమీకరణలో రైతుల డిమాండ్లు కీలకం.. ఎమ్మెల్యే శ్రావణ్! AP Cabinet: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. 20కి పైగా కీలక ప్రతిపాదనల! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం! Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ! Amaravathi: అమరావతి మాస్టర్ ప్లాన్ విస్తరణకు సీఆర్డీఏ కీలక కసరత్తు! కొత్త హద్దులు, కీలక నిర్ణయాలు!! తొలిసారిగా రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవం - 10 ఎకరాల విస్తీర్ణంలో పరేడ్‌గ్రౌండ్‌కు ఏర్పాట్లు! Land Pooling Phase-2: వైసీపీ అడ్డంకుల వల్లే అమరావతి నిలిచింది.. భూసమీకరణలో రైతుల డిమాండ్లు కీలకం.. ఎమ్మెల్యే శ్రావణ్! AP Cabinet: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. 20కి పైగా కీలక ప్రతిపాదనల! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Amaravati Development: అమరావతిని ప్రపంచ టాప్–5 రాజధానుల్లో నిలబెడతాం! రూ.98.7 లక్షలతో 1148 మీటర్ల రోడ్డు... మంత్రి చేతుల మీదుగా ప్రారంభం! Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!

AP Cabinet: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. 20కి పైగా కీలక ప్రతిపాదనల!

2025-12-29 12:33:00
సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లకు గేట్‌వే…! CUET-UG 2026 డేట్స్ ఫిక్స్..!

ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం కాసేపట్లో జరగనుండగా, ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి కీలకమైన 20కి పైగా అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధి, మౌలిక వసతులు, పరిశ్రమలు, విద్య, క్రీడలు, సామాజిక సంక్షేమం, ఉద్యోగులు, విద్యుత్ రంగం వంటి విభాగాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చడం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం లక్ష్యంగా కేబినెట్ కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది.

IndiGo Airlines: ఇండిగో పట్టు సడలుతోందా? దేశీయ విమానయాన మార్కెట్‌లో కీలక మార్పు..!

ఈ సమావేశంలో ముందుగా నూజివీడులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వడానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇది వ్యవసాయం, తోటల సాగు, మేనేజ్‌మెంట్ రంగాల్లో నిపుణులను తయారు చేయడంలో కీలకంగా మారనుంది. అలాగే కోనసీమ జిల్లా కాట్రేనికోనలో వేదాంత సంస్థ చేపట్టనున్న ఆయిల్ డ్రిల్లింగ్ ప్రాజెక్టుకు సంబంధించి భూమి లీజు పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. దీనితో ఇంధన రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

BSF Recruitment: పదో తరగతి అర్హతతో బీఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! పరీక్షలేకుండానే ఎంపిక..!

తిరుపతి దామినేడులో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు కోసం భూబదలాయింపుకు కేబినెట్ ఆమోదం తెలిపే సూచనలు ఉన్నాయి. ఇది యువతకు క్రీడా అవకాశాలు పెంచడమే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా ఈవెంట్లకు వేదికగా మారే అవకాశం ఉంది. అమరావతి అభివృద్ధికి నాబార్డు నుంచి రూ.7,387 కోట్ల రుణం తీసుకునేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా వరల్డ్ బ్యాంకు, ఏడీబీ నిధులతో అమరావతి క్యాపిటల్ సిటీ పనులకు సంబంధించిన ప్యాకేజీ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. రోడ్లు, డ్రైనేజీ, వాటర్ సప్లయ్ వంటి మౌలిక సదుపాయాల కోసం మరో ప్రత్యేక ప్యాకేజీకి కూడా ఆమోదం ఇవ్వనున్నారు.

Elon Musk: 8 గంటల వెయిటింగ్‌.. ప్రాణం పోయింది.. కెనడా హెల్త్‌కేర్‌పై ఎలాన్ మస్క్ ఫైర్!

తుడా పరిధిలో స్టాంప్ డ్యూటీ మినహాయింపునకు ఆమోదం, అమరావతి ల్యాండ్ అలాట్‌మెంట్ కేసులపై జీఓఎం సిఫార్సుల అమలు వంటి కీలక నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో తీసుకోనున్నారు. మంగళగిరి–తాడేపల్లి ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఎస్టీపీ పనులకు ఆమోదం ఇవ్వడం ద్వారా పట్టణ మౌలిక వసతులు మెరుగుపడనున్నాయి. అటవీశాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.

Cigarettes: పొగ తాగేవారికి కేంద్రం కఠిన నిర్ణయం.. సిగరెట్ ఇక లగ్జరీ!

సామాజిక సంక్షేమ రంగంలో ఎస్సీ లబ్దిదారులపై పెండింగ్ వడ్డీ మాఫీకి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. విద్యుత్ రంగంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల అమలుకు సూత్రప్రాయ ఆమోదం ఇవ్వనున్నారు. వరద నియంత్రణ చర్యల్లో భాగంగా కలంగి వరద నియంత్రణ పనులకు పరిపాలనా అనుమతి, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టులో అదనపు ఖర్చులకు ఆమోదం కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.

Train Fire: ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం…! 71 ఏళ్ల వృద్ధుడు మృతి.!

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు అమలుకు ఆర్థికశాఖ అనుమతి, గ్రామ–వార్డు సచివాలయాల పేర్ల మార్పుపై ఆర్డినెన్స్‌కు ఆమోదం, జిల్లాకోర్టుల్లో సిస్టమ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ల పోస్టుల సృష్టి వంటి అంశాలు కూడా కీలకంగా ఉన్నాయి. తిరుపతిలో ఫైవ్ స్టార్ హోటల్ ప్రాజెక్టు రద్దు, దుగ్గరాజపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టు ఏర్పాటు, దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు భూసేకరణకు అనుమతులు వంటి నిర్ణయాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకంగా మారనున్నాయి. మొత్తంగా ఈ కేబినెట్ సమావేశం ఏపీ భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే కీలక సమావేశంగా భావిస్తున్నారు.

Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై ఊహించని షాక్! లక్షల మందికి ఇళ్లు రావు.. ఈ లిస్ట్‌లో మీరు పేరు ఉందేమో చెక్ చేసుకోండి!
గుంటూరులో ఆ పార్క్‌కు మహర్దశ.. రూ.18.35 కోట్లతో పునరుద్ధరణ!
Vijay Latest News: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కిందపడ్డ విజయ్…!!
AP Cabinet: చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం... కీలక అంశాలు!
Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Natural Remedies: ఉదయాన్నే ఇవి రెండు నమిలితే ఆ సమస్యలన్నీ దూరం!
Land Resurvey: జనవరి 2 నుంచి ఆ జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే!

Spotlight

Read More →