అమరావతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు! శరవేగంగా సైకిల్ ట్రాక్స్, స్మార్ట్ రోడ్ల నిర్మాణం!

Amaravati Development: రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక రోడ్డు మౌలిక వసతుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పాదచారుల కోసం పియానో కీస్ థీమ్ వాకింగ్ ట్రాక్‌లు, సైక్లిస్టుల కోసం కలర్‌ఫుల్ డెడికేటెడ్ సైకిల్ ట్రాక్‌లను ఏపీ సీఆర్‌డీఏ తీర్చిదిద్దుతోంది. పర్యావరణ హిత గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహిస్తూ రూపుదిద్దుకుంటున్న ఈ స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విజువల్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అమరావతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు
అమరావతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు
  • పియానో కీస్ థీమ్‌తో వాకింగ్ పాత్‌లు.. ఆకట్టుకుంటున్న నడకదారులు!

  • రోడ్ల నిర్మాణంలో వేగం పెంచిన సీఆర్‌డీఏ.. అంతర్జాతీయ లుక్!

  • ఎరుపు, నీలం, ఆకుపచ్చ లేన్లు.. సైక్లిస్టులకు ఫుల్ సేఫ్టీ!

Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో సరికొత్త వేగం కనిపిస్తోంది. నగరాన్ని ప్రపంచ స్థాయి స్మార్ట్ మరియు గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) రోడ్డు మౌలిక వసతుల నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రధాన రహదారుల విస్తరణతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక డిజైన్లతో కూడిన రోడ్ల నెట్‌వర్క్ అమరావతిలో రూపుదిద్దుకుంటోంది.


పియానో థీమ్ పాదచారుల మార్గాలు – కలర్‌ఫుల్ సైకిల్ ట్రాక్స్

రాజధాని ప్రధాన రోడ్ల పక్కన పాదచారులు, సైక్లిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న ట్రాక్‌లు ప్రస్తుతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. పాదచారుల నడకదారులను పియానో కీబోర్డ్ తరహా బ్లాక్ & వైట్ ఆకట్టుకునే టైల్స్ డిజైన్‌తో తీర్చిదిద్దుతున్నారు. దీనికి ఆనుకుని సైక్లిస్టుల భద్రత కోసం ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ప్రత్యేకమైన డెడికేటెడ్ సైకిల్ ట్రాక్‌లను సిద్ధం చేస్తున్నారు. సైకిల్ సింబల్స్‌తో పాటు లేన్ మార్కింగ్‌లు నగరానికి సరికొత్త అంతర్జాతీయ లుక్‌ను అందిస్తున్నాయి.


పర్యావరణ హిత గ్రీన్ మొబిలిటీకి పెద్దపీట

మోటారు వాహనాల కాలుష్యాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు అమరావతి మాస్టర్ ప్లాన్‌లో నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్‌పోర్ట్ (NMT) వ్యవస్థకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. విస్తృతమైన పచ్చదనం, సెంట్రల్ మీడియన్లు, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలతో పాటు రాత్రి వేళల్లో సరిపడా వెలుతురునిచ్చే స్మార్ట్ లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో వాకర్స్, జాగింగ్ ప్రియులు, సైకిల్ రైడర్లు ఎంతో ఆహ్లాదకరంగా, సురక్షితంగా ప్రయాణించేలా ఈ మౌలిక వసతులను నిర్మిస్తున్నారు.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అమరావతి విజువల్స్

అమరావతి రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించిన డ్రోన్ మరియు గ్రౌండ్ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. విదేశాల్లో మాత్రమే కనిపించే అధునాతన ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ తమ రాజధానిలో సాకారమవుతుండటం పట్ల ప్రజలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఆర్‌డీఏ పర్యవేక్షణలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ జరుగుతున్న ఈ పనులు రాజధాని అమరావతి భవిష్యత్ స్వరూపాన్ని కళ్లకు కడుతున్నాయి.

Tags

Be the first to react

Latest