ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

Bhogapuram airport : భోగాపురం ఎయిర్‌పోర్టుపై వైసీపీ క్రెడిట్ చోరీ రాజకీయాలు.. పట్టాభిరామ్ ఫైర్!

2026-01-06 13:52:00
India Startup News: ప్రపంచ స్టార్టప్ పెట్టుబడుల్లో.. భారత్ స్థానం ఎంతంటే..!!

భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంపై వైసీపీ (YSRCP) చేస్తున్నది అభివృద్ధి రాజకీయాలు కాదు, స్పష్టమైన క్రెడిట్ చోరీ రాజకీయాలేనని కూటమి ప్రభుత్వం తీవ్రంగా విమర్శిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram airport ) వెనుక వైసీపీకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ లేకపోయినా, అంతా తామే చేసినట్టు చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ (Pattabhiram) స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, దశలవారీగా భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిందని, ఆ అభివృద్ధి క్రెడిట్‌ను నిస్సిగ్గుగా వైసీపీ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. జగన్‌కు ఉన్నది క్రిమినల్ క్రెడిట్ చరిత్ర మాత్రమేనని, దాన్ని ఎవరూ చోరీ చేయలేరని, చంద్రబాబుకు ఉన్నది డెవలప్మెంట్ క్రెడిట్ అని, ఫేక్ ట్వీట్లతో ఆ స్థాయికి కూడా జగన్ చేరలేడని పట్టాభిరామ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు..!!

భోగాపురం ఎయిర్‌పోర్టు చరిత్రను పరిశీలిస్తే, అసలు వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తాయని ఆయన తెలిపారు. 20-05-2015న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం కోసం ప్రత్యేక ప్రయోజన వాహకం (SPV) ఏర్పాటు చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో నెంబర్ 63ను విడుదల చేసిందని గుర్తు చేశారు. ఆ తర్వాత 27-01-2016న కేంద్ర ప్రభుత్వం భోగాపురం ఎయిర్‌పోర్టుకు సైట్ క్లియరెన్స్ ఇచ్చిందని, ఈ కీలక అనుమతిని తీసుకువచ్చిన ఘనత పూర్తిగా చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. అలాగే 09-06-2016న భూ నిర్వాసితులకు న్యాయమైన, ఉదారమైన పరిహారం అందించేందుకు జీవో నెంబర్ 64ను చంద్రబాబు ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. రైతులకు నష్టం కలగకుండా భూసేకరణ చేపట్టడం, ప్రజల ఆమోదంతోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం చంద్రబాబు పాలన ప్రత్యేకత అని వివరించారు.

AP Government News: ఏపీ ప్రజలకు బంపర్ గుడ్‌న్యూస్.. తగ్గిన కరెంట్ ఛార్జీలు!

భోగాపురం విమానాశ్రయ అంకురార్పణ కూడా చంద్రబాబు నాయుడే చేశారని, ప్రాజెక్టు వేగవంతం కావడానికి 2017లోనే స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. 07-10-2016న కేంద్ర ప్రభుత్వం ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్ ఇచ్చిందని, 14-08-2017న కీలకమైన పర్యావరణ అనుమతులు తెచ్చి నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించింది కూడా చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అయితే ఆ సమయంలో విమానాశ్రయం అవసరమా అంటూ వైసీపీ అడ్డుకుందని, భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని బహిరంగంగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే వైసీపీ అనుమతులు తామే తెచ్చామని అవాస్తవాలు ప్రచారం చేయడం ప్రజల తెలివిని అవమానించడమేనని పట్టాభిరామ్ మండిపడ్డారు.

Child calcium: మీ పిల్లలకు కాల్షియం లోపమా.. వెంటనే ఈ ఫుడ్స్ ఇవ్వండి!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం మరింత వేగం పుంజుకుందని, అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం ఆరు నెలల ముందే, అంటే 2026 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. అభివృద్ధి ఎవరు చేశారో ప్రజలకు బాగా తెలుసని, ఫేక్ ప్రచారాలతో చరిత్రను మార్చలేరని, భోగాపురం ఎయిర్‌పోర్టు చంద్రబాబు విజన్‌కు నిదర్శనమని పట్టాభిరామ్ స్పష్టంగా పేర్కొన్నారు.

Fat Loss Tips: కొబ్బరి తో కూడా బరువు తగ్గొచ్చట.. కానీ ఈ నియమాలు పాటించకపోతే వృథానే!
Stock markets : నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణ ప్రభావం.. సూచీలు దిగువకు!
Water: హైదరాబాద్‌కు వాటర్ రింగ్ నెట్ వర్క్…! తాగునీటి కష్టాలకు రూ.8,000 కోట్ల శాశ్వత పరిష్కారం!
Praja Vedika: నేడు (6/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Cinema News: ఐసీయూలో స్టార్ డైరెక్టర్! అభిమానుల్లో టెన్షన్... టెన్షన్!
Break in China: చైనా వెనిజులా బంధానికి బ్రేక్... అమెరికా వ్యూహం సఫలం!
Caravan Tourism: కొత్త ట్రావెల్ ట్రెండ్! కేరవాన్ ఎక్కేయ్... ఆంధ్రాను చుట్టేయ్!
Maduro Arrest: న్యూయార్క్ కోర్టులో నికోలస్ మదురో…! ‘నేను నిర్దోషిని’ అంటూ అమెరికాపై తీవ్ర ఆరోపణలు!
Weather News: మళ్లీ మారుతున్న వాతావరణం! ఏపీ, తెలంగాణకు వెదర్ అలర్ట్!!

Spotlight

Read More →