అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా తనదైన శైలితో ఎప్పుడూ వార్తల్లో ఉండే డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెనిజులాలో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, తానే ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించుకుంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దౌత్య వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో ఒక ఎడిటెడ్ చిత్రాన్ని ( Truth Social) షేర్ చేశారు. అది వికీపీడియా పేజీని పోలి ఉండటంతో పాటు, 2026 జనవరి నుంచి వెనిజులా తాత్కాలిక (Interim President) అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినట్లు చూపించింది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ కావడంతో, ఇది నిజమా లేక ట్రంప్ మార్కు రాజకీయ వ్యూహమా అన్న చర్చ మొదలైంది. అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోయినా, ఇలాంటి పోస్ట్ చేయడం అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతకు దారితీస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత కొన్ని రోజులుగా వెనుజుల (Venezuela) లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టే చర్యల పేరుతో అమెరికా బలగాలు కారకాస్ పరిసరాల్లో ఆపరేషన్లు నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolás Maduro) ను అదుపులోకి తీసుకుని అమెరికాకు తరలించారన్న కథనాలు లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మదురో నిర్బంధం తర్వాత, వెనిజులా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ (Delcy Rodríguez) తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. అయితే ఈ పాలన ఎంతకాలం కొనసాగుతుందన్నది స్పష్టత లేకుండా ఉందిని రాజకీయ సమాచారం .
ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ చేసిన తాజా ప్రకటన మరింత గందరగోళాన్ని (Political Controversy) సృష్టిస్తోంది. సాధారణంగా ఒక దేశాధ్యక్షుడు మరో దేశానికి తాత్కాలిక అధ్యక్షుడినని ప్రకటించుకోవడం దౌత్య చరిత్రలో చాలా అరుదైన విషయం. వెనిజులాలో (Latin America News) ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని ట్రంప్ చెబుతున్నప్పటికీ, అధికార పగ్గాలు తనవే అన్నట్టుగా వ్యాఖ్యానించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది సరదాగా చేసిన పోస్టా, లేక అమెరికా చేపట్టబోయే పెద్ద వ్యూహానికి సంకేతమా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అంతర్జాతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ ప్రకటన వెనిజులా రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడిలో ఉండగా, ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల్లో అయోమయాన్ని పెంచుతాయని వారు అంటున్నారు. మరోవైపు, అమెరికా పాత్రపై లాటిన్ అమెరికా దేశాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంగా చూస్తే, ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం సోషల్ మీడియా పోస్ట్‌గా కాకుండా, రానున్న రోజుల్లో అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపుకు కారణమయ్యే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.